బొద్దింకలు ఏం చేస్తాయిలే అనుకుంటే పొరపాటే.. వీటిని లైట్ తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొద్దింకల వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో బొద్దింకలు ఎక్కువైతే ఇంటిల్లి పాది రోగాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, బొద్దింకలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా అందరి ఇళ్లలో బొద్దింకల బెడద వేదిస్తూ ఉంటుంది. కొందరి ఇళ్లలో బొద్దింకలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. నైట్ లైట్స్ ఆఫ్ చేయగానే బొద్దింకల స్వైర విహారం మొదలవుతుంది. కానీ, వీటిని …
Read More »కాలి నరం ద్వారా 600 గ్రాముల బరువుగల చిన్నారికి గుండె చికిత్స
నెలలు నిండని శిశువుకు గుండె సమస్యతో చికిత్స అవసరమైంది. కిమ్స్ హాస్పిటల్ గుండె వైద్యులు అత్యాధునిక డివైస్ ఉపయోగించి శస్త్రచికిత్స అవసరం లేకుండా పీడీఏ మూసివేశారు. ఈ డివైస్ తో చికిత్స పొంది కోలుకున్న అతి తక్కువ బరువుగల శిశువుగా .. ఈ బుడతడు రికార్డు సృష్టించాడు. ఏడు నెలలకే.. అంటే నెలలు నిండకముందే పుట్టిన ఒక శిశువుకు గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. అతడికి గచ్చిబౌలి కిమ్స్ వైద్యులు అత్యాధునిక పద్ధతిలో, శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేసి ప్రాణం పోశారు. ఇందుకు …
Read More »ఇది నీరు కాదు అమృతం.. రోజుకో గ్లాసు తాగితే 300 రోగాలు రాకుండా ఆపేయొచ్చు..
పొట్ట ఆరోగ్యం సరిగా లేకపోతే, దాని ప్రభావం మొత్తం శరీరంపై పడుతుంది. ఈ పరిస్థితిని ‘గట్ హెల్త్’ పాడవడం అంటారు. గట్ హెల్త్ దెబ్బతింటే, జీర్ణక్రియ సమస్యలే కాకుండా, దాదాపు 300 రోగాలకు శరీరం నిలయంగా మారుతుంది. ఈ పొట్ట సమస్యలకు ఒక అద్భుతమైన పరిష్కారం మన వంటగదిలోనే ఉంది. అదే జీలకర్ర నీరు. ఇది ‘పరమౌషధంలా’ పనిచేసి, మీ పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, శరీరాన్ని అనేక రోగాల నుంచి కాపాడుతుంది. ప్రతి ఇంటి వంటగదిలో ఉండే జీలకర్ర కేవలం ఆహారానికి రుచిని …
Read More »తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు బ్రేక్.. నిలిచిన ఆరోగ్య శ్రీ.. అసలు విషయం ఇదే..!
తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ వైద్య సేవ సీఈవోలకి లేఖ రాశారు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఓపీ సేవలను నిలిపివేశాయి. తమకు …
Read More »ఇండియన్ టాయిలెట్.. వెస్ట్రన్ టాయిలెట్.. ఏది ఆరోగ్యానికి మంచిది?
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఆహారం, ఫిట్‌నెస్, వ్యాయామం వంటి విషయాలపై మాత్రమే దృష్టి పెడుతుంటారు. కానీ ఆరోగ్యంకి సంబంధించి తరచుగా నిర్లక్ష్యం చేసే ముఖ్య అంశం టాయిలెట్ల వాడకం. మన దైనందిన జీవితంలో ఇండియన్ లేదా వెస్ట్రన్ టాయిలెట్‌లను ఉపయోగిస్తుంటాం. కానీ మంచి ఆరోగ్యానికి ఏ టాయిలెట్ ఎక్కువ అనుకూలంగా ఉంటుందో మనలో చాలా మందికి తెలియదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇండియన్ టాయిలెట్ ఉపయోగించడం వల్ల కూర్చునే భంగిమ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే పాశ్చాత్య టాయిలెట్లు వృద్ధులకు మరింత సౌకర్యవంతంగా …
Read More »బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా..? అసలు నిజం తెలిస్తే అవాక్కే..
ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యపు అలవాట్లే ఈ సమస్యలకు ప్రధాని కారణమని వైద్యులు అంటున్నారు. అయితే కొంతమంది బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అని నమ్ముతారు. మరి ఇది నిజమేనా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. కిడ్నీలో రాళ్ల గురించి ప్రజలలో చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయనే నమ్మకం చాలామందిలో ఉంది. కిడ్నీలో రాళ్లను వైద్య పరిభాషలో నెఫ్రోలిథియాసిస్ అంటారు. ఇవి సాధారణంగా మూత్రపిండాల లోపల చిన్న …
Read More »తులసి వేర్లతో కషాయం..ఇలా వాడితే ఎన్నో వ్యాధులకు దివ్యౌషధం..!
తులసి ఆకులు, సారం జలుబు, దగ్గుకు మాత్రమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుందని దాదాపు మనందరికీ తెలుసు. అయితే, తులసి ఆకులు, గింజలు మాత్రమే కాదు..తులసి వేర్లు కూడా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తులసి వేర్లతో కషాయం చేసి ఉపయోగిస్తే లెక్కలేనన్ని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం… తులసి మొక్క లేని ఇల్లు చాలా అరుదు. మతపరమైన కారణాల వల్లనే కాకుండా దాని ఔషధ గుణాల కారణంగా కూడా ప్రతి ఇంట్లోనూ తులసి …
Read More »ఆమెకు తరచూ తలనొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మెదడులో దాన్ని చూసి డాక్టర్లు షాక్
పరాన్న జీవులు ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని వైద్యులు అన్నారు. ఇవి వార్మ్ బ్లడెడ్ జంతువుల సజీవ కణజాలాన్ని తినేస్తూ జీవిస్తాయని అన్నారు. అవి శరీర గాయాల ద్వారా రోగి శరీరంలోకి వెళ్తాయని, సకాలంలో వైద్యం అందకపోతే అవయవాల్లోకి ప్రవేశించి ప్రాణాలకు ముప్పు.. ఈ రోజుల్లో చాలా మందికి రకరకాల శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. కొన్ని చికిత్సలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన ఆపరేషన్ నిర్వహించారు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. వైద్యులు శస్త్రచికిత్స చేసి మహిళ మెదడు నుంచి పరాన్నజీవిని తొలగించారు. తిరువూరుకు చెందిన 50 …
Read More »సంతాన సాఫల్యానికి సహజ దీప్తి.. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ హిమ దీప్తి!
నేటి రోజుల్లో వైద్యాన్ని ఒక వృత్తిగా కాకుండా వ్యాపారంగా చూసే ధోరణి పెరిగిపోతుంది. అలాంటి సమయంలో నిజమైన సేవా భావంతో, నమ్మకంతో రోగులను ఆదుకుంటున్న వైద్యులను కనుగొనడం చాలా అరుదు. అలాంటి అరుదైన వైద్యులలో ఒకరు డాక్టర్ హిమ దీప్తి, సంతాన సమస్యలతో బాధపడుతున్న జంటలకు ఆమె ఒక వెలుగుదారి. డాక్టర్ హిమ దీప్తి తన ఎంబీబీఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో పూర్తిచేశారు. తరువాత కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో ఎంఎస్ (ప్రసూతి …
Read More »చర్మ సమస్యలకు దివ్యౌషధం..పతంజలి దివ్య కాయకల్ప తైలం.. లాభాలు, జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి..
మీరు కూడా చర్మంపై అలెర్జీ, మచ్చలు, చర్మం పొడిబారడం, కోతలు, వడదెబ్బ, దురద వంటి ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా..? వాటికి చికిత్స చేయడానికి ఆరోగ్యకరమైన మార్గాన్ని వెతుకుతుంటే పతంజలి దివ్య కాయకల్ప తైలం మీకు ఒక బెస్ట్ ఆయుర్వేద ఎంపిక. ఈ నూనె చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుందని పతంజలి పరిశోధనా సంస్థ పేర్కొంది. ఆయుర్వేదంలో మూలికలతో తయారు చేసిన మందులు, ప్రస్తుత కాలుష్య వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకమైన చర్మ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. చర్మంపై మచ్చలు, దురద, అలెర్జీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, …
Read More »