ఎడ్యుకేషన్

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే హాల్‌ టికెట్లు రావడంతో.. రంగుల పేపర్లపై వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు వస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు గుర్తించారు. ఇలా రంగుల పేపర్లతో పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చే హాల్‌టికెట్లను అనుమతించబోమని తాజాగా ఇంటర్ బోర్డు హెచ్చిరించింది.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. పరీక్షలకు వారం ముందు విద్యార్ధుల మొబైల్‌ నంబర్లకు …

Read More »

ఎలాంటి ఫీజు లేకుండా దక్షిణ కొరియాలో చదువుకునే ఛాన్స్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి

విదేశాల్లో చదువుకోవాలని కలలు కనే విద్యార్ధులకు అద్భుత అవకాశం. దక్షిణ కొరియాలోని పలు యూనివర్సిటీల్లో చదువుకునేందుకు సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం (SMG) సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025కు ఇండియన్‌ విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా భారతీయ విద్యార్థులెవరైనా దక్షిణ కొరియాలో పీజీ కోర్సులు చదవొచ్చు..దక్షిణ కొరియాలోని సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం (SMG) సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025కు ఇండియన్‌ విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా భారతీయ విద్యార్థులకు …

Read More »

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం.. మార్చి 1 నుంచి పది లక్షల విద్యార్ధులకు పరీక్షలు షురూ!

2024-25 విద్యా సంత్సరానికి సంబంధించి ఇంటర్ రెగ్యులర్‌, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు మార్చి మొదటి వారం నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్‌ ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 3 నుంచి 15 వరకు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో దాదాపు పది లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్‌, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు మార్చి నుంచి ప్రారంభంకానున్న సంగతి …

Read More »

పదో తరగతి మెమోలను ఎట్లా ముద్రిచాలో.. గ్రేడింగా? మార్కులా? విద్యాశాఖ తర్జనభర్జన

తెలంగాణ పదో తరగతి మార్కుల మెమోలను ఎట్లా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తెగ ఆలోచిస్తుంది. పదో తరగతిలో గ్రేడింగ్‌ విధానం ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విద్యాశాఖ.. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అందించే మెమోలను మార్కులా? లేదా గ్రేడింగా? ఎలా ముద్రించాలన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తర్జనభర్జన పడుతుంది..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు …

Read More »

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఒంటి పూట బడులు ఎప్పటినుంచంటే..?

హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బ సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగుతన్న ఎండల నేపథ్యంలో పిల్లలకు ఒంటి పూట నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యకమవుతుంది.తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పొద్దున 10 దాటగానే సూర్యుడు యాక్షన్‌లోకి దిగిపోతున్నాడు. మార్చి కూడా రాకుండానే ఎండల తీవ్రత ఓ రేంజ్‌లో పెరిగింది. దీంతో రోడ్ల వెంట బండ్లు పెట్టుకుని చిన్న.. చిన్న వ్యాపారాలు చేసేవారు అల్లాడిపోతున్నారు. ఇక బళ్లకు వెళ్లే …

Read More »

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీలను పరీక్ష జరిగిన రోజునే కమిషన్‌ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీతోపాటు అభ్యర్ధుల రెస్పాన్స్‌షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది..రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. …

Read More »

ఇక ఏడాదికి 2 సార్లు 10, 12 తరగతుల పరీక్షలు.. ముహూర్తం ఫిక్స్‌!

విద్యార్ధులకు సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించనుంది. అన్నీ కుదిరితే 2026 నుంచే ఈ విధానం కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అధ్యక్షతన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి, సీబీఎస్‌ఈ, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌), నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్‌) ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన ముసాయిదాను ఏర్పాటుచేయగా.. వచ్చే సోమవారం నుంచి దీనిపై …

Read More »

నేడే ఇంటర్మీడియట్ హాల్‌ టికెట్లు విడుదల.. ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1535 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ను కూడా విడుదల …

Read More »

ఆర్‌ఆర్‌బీ రైల్వే ఉద్యోగాల పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, మెటీరియల్‌ సూపరిటెండెంట్‌, కెమికల్‌ అండ్‌ మెటలార్జికల్‌ అసిస్టెంట్‌, కెమికల్‌ సూపర్‌వైజర్‌, మెటలార్జికల్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీలను వెల్లడించింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల (సీబీటీ-II) విధానంలోనే జరుగుతాయి. ఈ పరీక్షలన్నీ మార్చి 19, 20వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ …

Read More »

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ దరఖాస్తు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2025 నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దరఖాస్తు గడువును పొడిగిస్తూ యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. మరోవైపు ఈ ఏడాది నుంచి సివిల్స్‌అభ్యర్థులకు కేంద్రం కొత్త నిబంధనలు సైతం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే సమయంలో అభ్యర్ధుల వయసు, రిజర్వేషన్‌ కోటాకు సంబంధించిన ధ్రువపత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొంది..యూపీఎస్సీ యేటా నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీసెస్‌ నియామక పరీక్ష 2025 నోటిఫికేషన్‌ గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా …

Read More »