ఇంటర్ బోర్డు వైఖరిపై తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు తమ కాలేజీలను సెంటర్లుగా ఇవ్వబోమని తెగేసి చెబుతున్నాయి. దీంతో మరో నెల రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానుండగా.. పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1125 కాలేజీలు బోర్డు నిబంధనలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టాయి.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు సెంటర్లపై సందిగ్ధత ఏర్పడింది. ఇంటర్ బోర్డు వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రైవేటు జూనియర్ …
Read More »ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు.. పరీక్ష ఎప్పుడంటే?
నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని పేదింటి విద్యార్ధులకు ప్రతీయేట స్కాలర్ షిప్ లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది తొలిసారిగా యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహించేందుకు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మొదటిసారిగా యూపీఎస్‌సీ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరెక్టర్ రాజేంద్రకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. యూపీఎస్‌సీ …
Read More »ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల రద్దుపై ఇంటర్ బోర్డు యూటర్న్.. ఇక రద్దు లేనట్లే!
ఇంటర్మీడియట్ విద్యామండలి కొత్తగా ప్రతిపాదించిన సంస్కరణలపై విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తే వచ్చే ప్రతికూలతల గురించి విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు పరీక్షలపై శ్రద్ధ తగ్గుతుందని, చదువుపై దృష్టిపెట్టరని జనవరి 26 స్వీకరించిన సలహాలు, సూచనల్లో వారు పేర్కొన్నారు..రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం …
Read More »ఇంటర్ బోర్డు పైత్యం.. పరీక్షలకు ముందు ఇంటర్ ప్రశ్నపత్రంలో మార్పులేంది సామీ..?
ఒకవైపు పరీక్షలు సమీపిస్తుంటే విద్యార్ధుల్లో ఒత్తిడి నానాటికీ పెరిగిపోతుంది. రాత్రింబగళ్లు కష్టపడి చదువుతున్నారు. ఇలాంటి క్లిష్టసమయంలో ఇంటర్ బోర్డు వింత ప్రకటన జారీ చేసింది. ఉన్నట్లుండి ఇంటర్ లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అటు ఉపాధ్యాయులతోపాటు ఇటు విద్యార్ధులు అంతా గందరగోళంలో పడిపోయారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యార్ధులు ముమ్మరంగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యా సంవత్సరం దాదాపు ముగింపుకు వచ్చిన …
Read More »త్వరలో గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ కోర్సులు ప్రారంభం.. సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏకలవ్యా.. గురుకుల విద్యాలయాల్లో త్వరలో డిగ్రీ కోర్సులు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయా గురుకులాల్లో ఐదు నుంచి పదో తరగతి వరకు, ఇంటర్మీడియట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు డిగ్రీ కోర్సులు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో ప్రస్తుతం 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు బాల బాలికలకు ప్రభుత్వం విద్యను అందిస్తుంది. …
Read More »మీరు మీ తల్లిదండ్రులకు ఏకైక కూతురా? అయితే ఈ స్కాలర్‌షిప్ మీకోసమే
పదో తరగతి పూర్తి చేసిన బాలికలకు సీబీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా కలిగిన బాలికా విద్యార్ధినులకు ప్రతియేటా మాదిరిగానే ఈ సారి కూడా సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్ అందించేందుకు ముందుకొచ్చింది. పదో తరగతి పాసై 11వ లేదా 12వ తరగతిలో ప్రవేశాలు పొందిన విద్యార్ధినులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు..తల్లిదండ్రులకు ఒకే ఒక సంతానంగా కలిగి ప్రతిభ కలిగిన బాలికలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) బోర్డు యేటా సింగిల్ గర్ల్ …
Read More »డీపీఆర్‌ఓ అభ్యర్థులకు అలర్ట్.. ధ్రువపత్రాల పరిశీలన తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).. డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (డీపీఆర్‌ఓ) పోస్టులకు సంబంధించి కీలక అప్ డేట్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఇప్పటికే రాత పరీక్ష పూర్తి కాగా మెరిట్ లిస్ట్ కూడా వెల్లడించింది. ఈ పోస్టలకు ఎంపికైన అభ్యర్ధులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించే తేదీని ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (డీపీఆర్‌ఓ) పోస్టులకు సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష పూర్తైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెరిట్ లిస్ట్ విడుదల చేయగా… …
Read More »తెలంగాణ ఏకలవ్య గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే
తెలంగాణ రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఫిబ్రవరి 16వతేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిల్లో ప్రవేశాలు పొందిన …
Read More »మార్చి 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. టైం టేబుల్‌లో స్వల్ప మార్పు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్ పరీక్షల తేదీలను విద్యాశాఖ వెల్లడించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్ సైన్స్, బయలాజీకల్ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. …
Read More »వైద్యుల నియామక పోస్టులు భారీగా పెంపు.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది డిసెంబరు 2న వైద్యుల నియామకాల కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అదనంగా మరో 200 పోస్టులను జతచేస్తూ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌లో మొత్తం 97 పోస్టులు ఉన్నాయి. వీటికి అదనంగా 200 పోస్టులు కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 297కు పెంచుతున్నట్లు ప్రకటించింది..తాజాగా జారీచేసిన ప్రకటనలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీహెచ్‌ఎస్)కు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ వైద్యుల పోస్టులు 200 …
Read More »