ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం కూడా ప్రారంభమైంది. సో నిరుద్యోగులు…కమాన్, గెట్‌రెడీ.. తెరవండి పుస్తకాలు.. చదివేయండి సిలబస్‌లు. ఎందుకంటే మెగా DSC వచ్చేసింది. 16వేలకు పైగా కొలువులను మోసుకొచ్చింది.కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణం వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు …
Read More »ఇంటర్ ఫలితాలు విడుదల ఆ రోజే.. అధికారిక ప్రకటన వచ్చేసింది..
తెలంగాణలో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ సిద్ధమైంది. ఈ నెల 22న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు. …
Read More »టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్ధులకు బిగ్‌షాక్.. నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే
తెలంగాణలో ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష నియామకాలు సర్వత్రా చర్చకు దారి తీశాయి. ఇప్పటికే దీనిపై టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చినా.. కొందరు అభ్యర్ధులు హైకోర్టును సంప్రదించారు. దీంతో గ్రూప్ 1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయమని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించరాదని సూచించింది. అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు …
Read More »మొన్న MBBS.. నేడు ఇంజనీరింగ్.. ప్రాంతీయ భాషల్లోకి పాఠ్య పుస్తకాల ముద్రణ షురూ!
గతంలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలు, మెడికల్ విద్యను ప్రాంతీయ భాషల్లో ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంజినీరింగ్ విద్యలోనూ పలు మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ కోర్సులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. స్థానిక భాషల్లో ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలను అందించడానికి కసరత్తు చేస్తోంది. వివిధ విభాగాల్లో ఇప్పటికే కార్యచరణ ప్రారంభించారు కూడా. తద్వారా ప్రాథమిక, హైస్కూల్ విద్యను మాతృభాషలో చదువుకుని ఇంజినీరింగ్‌లో ఆంగ్లమాధ్యమంతో …
Read More »వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. దరఖాస్తు విధానంలో కీలక మార్పులు చేసిన విద్యాశాఖ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలకు రూట్ క్లియర్ అవుతోంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన సర్కార్.. రాజప్రతిని గవర్నర్ ఆమోదముద్ర కోసం పంపించారు. గవర్నర్ ఆమోదిస్తున్నట్లు సంతకం పెడితే ఇక ఎస్సీ వర్గీకరణ పూర్తైనట్లే. ఆ మరుసటి రోజే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే డీఎస్సీ దరఖాస్తు విధానంలో అధికారులు ఈసారి కొన్ని కీలక మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియను ఏ, బీ విభాగాలుగా విభజించి వివరాలు సేకరించనున్నారు. …
Read More »నేడే జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్ ఎంత ఉంటుందంటే?
జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్-1 (బీఈ/ బీటెక్) పరీక్షలు, ఏప్రిల్ 9వ తేదీన పేపర్-2ఏ, 2బీ (బీఆర్క్/బీ ప్లానింగ్) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని …
Read More »ఇంటర్ సిలబస్ మారిందోచ్..! క్లారిటీ ఇచ్చిన ఇంటర్ బోర్డు!
వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ సిలబస్ మారుతుందన్న ప్రచారంపై తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మార్పు నిజమేనంటూ ఆయన తేల్చి చెప్పారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి మారిన సిలబస్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. అయితే పదేళ్ల నుంచి ఒకటే సిలబస్ ఉండటంతో జాతీయ విద్యావిధానంకు అనుగుణంగా మార్పులు చేయడం అనివార్యమైందన్నారు. ఇంటర్ సిలబస్ మార్పుపై సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కమిటీని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీలో …
Read More »తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడో చెప్పేసిన బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య
అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ముందే తక్కువ మార్కుల తేడాతే ఫెయిల్ న పేపర్లను మరోసారి వాల్యూయేషన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు నష్టం జరగకుండా ఉంటుందని అంటున్నారు. ఇంటర్ రిజల్ట్స్ ఇచ్చాక విద్యార్థులు కావాలంటే రీ వాల్యూయేషన్ కు అప్లై చేసుకునే ఛాన్స్ ఎప్పటిలానే ఉంటుందని అన్నారు.ఏపీలో ఇంటర్ ఫలితాలు వెలువడటంతో తెలంగాణలో ఫలితాలు ఎప్పుడు వస్తాయో అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత నెల 25న తెలంగాణ ఇంటర పరీక్షలు పూర్తయ్యాయి. నెల రోజుల లోపే ఫలితాలు ఇవ్వాలని …
Read More »ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాల వెల్లడి తేదీలు వచ్చేశాయ్! ఎప్పుడంటే..
పరీక్షలు రాసి పలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఇంటర్ ఫస్ట్, సెకండియర్ విద్యార్ధులకు అలర్ట్. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన ఇంటర్ బోర్డు మార్కులను ఆన్ లైన్ లో క్రోడీకరించే పనిలో పడ్డారు. ఈ విధానం మరో వారంలోనే పూర్తి చేసి ఆ తర్వాత వెనువెంటనే ఫలితాలు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధుల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 19 సెంటర్లల్లో మార్చి 19 నుంచి ప్రారంభమైన …
Read More »పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మరోవారంలోనే పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంతవత్సరానికి ఏప్రిల్ 1వ తేదీన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇక జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవగా.. ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. ప్రస్తుతం మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తున్నారు. ఇది కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. దీంతో వారంలోపు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని సవ్యంగా కుదిరితే …
Read More »