2025-26 నుంచి 2027-28 వరకు బ్లాక్ పీరియడ్‌కు బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల ఫీజును పెంచుకునేందుకు చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) చేసిన అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. CBIT వసూలు చేసే ఫీజుల వివరాలు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని TG Eapcet అడ్మిషన్ల కన్వీనర్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఆదేశించారు. బీటెక్ కోర్సులకు ఏడాదికి రూ.2,23,000గా, MTech కోర్సుకు రు.1,51,600, MBA/MCA కోర్సుకు రు.1,40,000లకు పెంచేందుకు కోర్టు CBITని అనుమతించింది. పెరిగిన …
Read More »తెలంగాణ నీట్ యూజీ 2025 ర్యాంకర్ల లిస్ట్ వచ్చేసింది.. ఫుల్ జాబితా ఇదే!
నీట్ యూజీ 2025 పరీక్షలో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 43,400 మంది అర్హత సాధించారు. ఈ మేరకు ఎంపిక జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. ఇది కేవలం నీట్‌లో అర్హత పొందిన అభ్యర్థుల వివరాలు తెలిపే జాబితా మాత్రమేనని, మెరిట్ జాబితా కాదని వర్సిటీ స్పష్టం చేసింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఎన్‌సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్, ఎస్‌సీసీఎల్ మెరిట్ జాబితాను విడిగా విడుదల చేస్తామని పేర్కొంది. …
Read More »ఇంజినీరింగ్, MBBSలో సీటు పొందిన విద్యార్థులకు తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్ధిక సాయం!
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంజినీరింగ్, మెడిసిన్‌లో సీట్లు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. ఆయా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని కార్యాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. గురుకుల విద్యార్థులకు 11 కాస్మొటిక్ వస్తువులను కిట్ రూపంలో …
Read More »గురుకుల విద్యార్ధులకు భలే ఛాన్స్.. నారాయణ విద్యా సంస్థల్లో ఐఐటీ, నీట్ ఉచిత కోచింగ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మంత్రి నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ, నీట్‌లో అతి కొద్దిమార్కుల తేడాతో సీట్లు సాధించలేకపోయిన విద్యార్థులకు నారాయణ విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. దీని గురించి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో ఇప్పటికే మంత్రి నారాయణ చర్చించారు కూడా. ఇందులో భాగంగా ఈ ఏడాదికి మొత్తం 80 మంది విద్యార్థులకు ఉచిత కోచింగ్ …
Read More »ఇవాళ ఏపీలో పేరెంట్-టీచర్ మెగా ఈవెంట్… కొత్త రికార్డు సృష్టించబోతున్న కూటమి సర్కార్
ఏపీలో ఇవాళ పేరెంట్-టీచర్ మెగా మీటింగ్ టు పాయింట్ వో జరగబోతోంది. 2 కోట్ల 28 లక్షల మందికి పైగా భాగస్వామ్యంతో కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. పాఠశాలల పనితీరుపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడంతో పాటు తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. పేరెంట్-టీచర్ మీటింగ్… తల్లిదండ్రుల్ని పిలిచి కూర్చోబెట్టి వాళ్ల పిల్లల ప్రోగ్రెస్ రిపోర్టుపై మాట్లాడుకోవడం… కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఈ ప్రక్రియను గవర్నమెంట్ …
Read More »ఈఏపీసెట్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు.. ఈసారి కన్వీనర్ కోటా సీట్లు ఎన్ని ఉన్నాయంటే?
రాష్ట్ర వ్యప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ గడువును జులై 9 వరకు పొడిగించినట్లు జేఎన్టీయూ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ బి. బాలునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. జులై 7న మొత్తం 900 విద్యార్థులకు గాను 806 మంది కౌన్సెలింగ్ హాజరయ్యారు. కాగా ఈసారి మొత్తం 171 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో.. 1.14 లక్షలకుపైగా బీటెక్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం సీట్లలో కన్వీనర్ …
Read More »మెగా డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలో తప్పిదాలు.. సమాధానాల స్థానంలో ‘చుక్కలు’ దర్శనం! అభ్యర్ధుల గగ్గోలు
ఇటీవల విడుదలైన మెగా డీఎస్సీ ఆన్ లైన్ పరీక్ష రెస్సాన్స్ షీట్లు చూసి అభ్యర్ధులు గుడ్లు తేలేస్తున్నారు. తాము రాసిన ప్రశ్నలకు జవాబులు రాకుండా చుక్కలు వచ్చాయని.. కొందరికి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాయనట్లు వచ్చిందని మరో అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమాధానాలు గుర్తించినా తప్పుగా చూపుతోందని, అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తించినా కొన్నింటినే ఆన్సర్ చేసినట్టు నమోదైందని ఆధారాలతో సహా చూపుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని అభ్యర్ధులంతా సోమవారం రాత్రి డైరెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.. మెగా …
Read More »పదో తరగతి అర్హతతో 2119 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఏయే పోస్టులున్నాయంటే?
న్యూఢిల్లీలోని ఢిల్లీ సబ్‌ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB).. 2025-26 ఏడాదికి సంబంధించి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద వివిధ శాఖలలో, స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలలో మొత్తం 2119 టీచింగ్, మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 7, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద …
Read More »మల్లారెడ్డి విద్యార్థుల సత్తా.. అమెజాన్‌లో భారీ ప్యాకేజీతో కొలువులు!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో నగరానికి చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధునులు భారీ ప్యాకేజీతో కొలువులు సొంతం చేసుకున్నారు. ఏడాదికి ఏకంగా రూ.46 లక్షల ప్యాకేజీతో ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతుండగానే ఆఫర్ వచ్చింది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ఉండగానే భారీ వేతన ప్యాకేజీతో ప్రఖ్యాత ఐటీ సంస్థ అమెజాన్‌లో కొలువులు సొంతం చేసుకున్నారు. సీఎస్‌ఈ చివరి ఏడాది చదువుతున్న శృతి, శ్రీశ్రావ్యలు ఈ …
Read More »కొత్తగా 157 ప్రభుత్వ పాఠశాలలు వచ్చేస్తున్నాయ్..! ఏఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?
తెలంగాణలో కొత్తగా 157 ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులు ఉన్నచోట ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. 63 గ్రామీణ, 94 పట్టణ ప్రాంతాల్లో ఈ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 571 పాఠశాలలు ప్రారంభిస్తామని గతంలో ప్రభుత్వ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ నగరాల్లోని బస్తీల్లో కనీసం 20 మంది విద్యార్థులు …
Read More »