ఇతర క్రీడలు

పీవీ సింధు స్టన్నింగ్‌ షో.. మూడో ఒలింపిక్‌ మెడల్‌ దిశగా విజయం

తెలుగుతేజం పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్‌ అబ్దుల్‌ రజాక్‌పై 21-9, 21-6తో వరుస సెట్లలో గెలిచి.. శుభారంభం చేసింది. తాజాగా బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టిన్‌ కుబాను సైతం ఓడించింది. తొలి మ్యాచ్‌కు మించి బుధవారం జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు సత్తాచాటింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌ను 21-5తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన రెండో …

Read More »

మను భాకర్ ఖాతాలో మరో పతకం.. 

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ మరోసారి మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. సరబ్జోత్ సింగ్‌తో కలిసి బరిలోకి దిగిన భాకర్.. వరుసగా రెండో ఈవెంట్‌లోనూ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కాగా.. ఈ రెండూ మను భాకర్ సాధించినవే కావడం విశేషం. సోమవారం జరిగిన …

Read More »

పారిస్ ఒలింపిక్స్‌లో బీజేపీ మహిళా ఎమ్మెల్యే.. 

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. అయితే తొలిరోజు భారత క్రీడాకారులు నిరాశపరిచారు. ఈ క్రమంలోనే పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన వారిలో ఓ బీజేపీ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆమెనే బీహార్‌కు చెందిన శ్రేయాసీ సింగ్. బీహార్‌ 2020 ఎన్నికల్లో జముయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాసీ సింగ్.. భారత షూటింగ్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు ఎన్నికయ్యారు. పారిస్ ఒలింపిక్స్ కోసం వెళ్లిన 117 మంది భారతీయ క్రీడాకారుల్లో శ్రేయాసీ సింగ్ కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే షూటింగ్ …

Read More »

Paris Olympics 2024: పారిస్ సంబరం.. ఘనంగా ఆరంభం..

పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అధికారికంగా తెరలేచింది. ఒలింపిక్ చరిత్రలో తొలిసారి నదిలో జరిగిన ఈ సంబురాలు.. చూపరులను ఆకట్టుకున్నాయి. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు అంబరాన్ని తాకాయి. చారిత్రక సీన్‌ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్‌ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో నిర్వహించింది. గతంలో ఎప్పుడైనా ప్రారంభ వేడుకలు స్టేడియంలో జరిగేవి.. కానీ పాత పద్దతికి స్వస్తి పలుకుతూ సెన్ నదిపై వేడుకలను ఘనంగా నిర్వహించింది ఫ్రాన్స్. విశ్వక్రీడల …

Read More »

నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్‌.. చరిత్రలో నిలిచిపోనున్న ప్రారంభ వేడుకలు..!

ప్రపంచ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ దేశాల్ని ఒక్కచోటకు చేర్చి ఆటలాడించే అద్భుత ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. నేడు పారిస్‌ వేదికగా ఒలింపింక్స్‌ 2024కు తెరలేవనుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడల్లో నేటి నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. చివరగా పారిస్‌లో 1924లో ఒలింపిక్స్‌ జరిగాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అక్కడ పోటీలు జరగనున్నాయి. ఒలింపిక్స్‌ చరిత్రలో నిలిచిపోనున్న వేడుకలు.. సాధారణంగా ఎప్పుడైనా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు ఆతిథ్య నగరంలోని ప్రధాన స్టేడియంలో జరుగుతాయి. …

Read More »