ఛాంపియన్స్ ట్రోఫీ- 2025కు సంబంధించి సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సాధారణంగా ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రారంభం కావాల్సింది. షెడ్యూల్ కూడా విడుదల కావాల్సింది. అయితే.. ఒక్క కారణంతో ఆలస్యం కొనసాగుతూనే ఉంది. టోర్నీ నిర్వహణకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు తాము వెళ్లబోమని.. ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు (ICC) స్పష్టం చేసింది. ఇదే విషయం గురించి.. ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు చెప్పి.. హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించాలని …
Read More »కపిల్‌దేవ్, చంద్రబాబు భేటీ.. ఏపీలో ఆ మూడు చోట్లా గోల్ఫ్ కోర్టులు!
Cricketer Kapil dev meets cm Chandrababu in Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతాల్లో గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. అమరావతి, అనంతపురం, విశాఖపట్నంలో గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. మంగళవారం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్, కేశినేని చిన్నితో కలిసి ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటు సహా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కపిల్ దేవ్ …
Read More »భారత్ 46 ఆలౌట్.. సొంత గడ్డపై అత్యల్ప స్కోరు.. కివీస్ పేసర్ల ధాటికి విలవిల్లాడిన బ్యాటర్లు..!
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు కుప్పకూలింది. పేకమేడను తలపిస్తూ.. భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. మొత్తంగా కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. దీంతో భారత్.. కేవలం 31.2 ఓవర్లలోనే 46 పరుగులకు కుప్పకూలింది. భారత జట్టుకు సొంత గడ్డ మీద టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఓవరాల్‌గా టీమిండియాకు టెస్టుల్లో ఇది మూడో అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి …
Read More »ఆస్ట్రేలియా పర్యటన నుంచి షమీ ఔట్!.. హింట్ ఇచ్చిన రోహిత్ శర్మ!
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సుమారు ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ 2023లో అతడు చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్న మహమ్మద్ షమీ.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అయితే అతడు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడని.. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని అంతా భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడు …
Read More »టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు సెమీస్ ఛాన్స్.. అదొక్కటే ఛాన్స్
ఆట ఏదైనా.. భారత్-పాకిస్థాన్ జట్లు ఎప్పటికీ దాయాదులే. కానీ మీరెప్పుడైనా అనుకున్నారా.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గెలవాలని భారత అభిమానులు కోరుకోవాల్సి వస్తుందని. కానీ వచ్చింది.. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో తన చివరి లీగ్ దశ మ్యాచులో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఇప్పటికీ సెమీ ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంది. అదేలా అంటే.. ఈ గ్రూప్‌లో చివరి మ్యాచ్ …
Read More »సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. హైదరాబాద్‌లో సిక్సర్ల వర్షం
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిసింది. భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీ చేశాడు. అతడికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తోడవ్వడంతో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బంతి వేయడం గాల్లోకి చూడటం బంగ్లా ఆటగాళ్ల వంతైంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సంజూ శాంసన్ కేవలం 47 బంతుల్లో 111 పరుగులు (సిక్స్‌లు 8, ఫోర్లు 11) చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 75 పరుగులు (సిక్స్‌లు 5, …
Read More »ఆధునిక హంగులతో కొత్త ఎన్‌సీఏ.. బెంగళూరులో ప్రారంభించిన బీసీసీఐ
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ.. బెంగళూరులో తమ కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. అయితే ఈ కొత్త ఎన్‌సీఏకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (బీసీఈ)గా పేరుపెట్టారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జైషా పలువురు ఇతర ఆటగాళ్లతో కలిసి ఈ సెంటర్‌ను ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వాస్తవానికి ఇప్పటివరకు జాతీయ క్రికెట్ అకాడమీని.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో నిర్వహించేవారు. కానీ తాజాగా కెంపెగౌడ విమానాశ్రయానికి …
Read More »అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనీ.. మహీ కోసం IPL రూల్స్‌నే మార్చేశారుగా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరే ఆటగాడికి దక్కని క్రేజ్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంతం. ఈ విషయం అందరికీ తెలిసిందే. పదకొండుసార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది కెప్టెన్ కూల్ మాత్రమే. అందుకే అటువంటి ఆడగాడిని ఏ జట్టు అయినా ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐపీఎల్ పాలకమండలి.. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా …
Read More »క్లీన్‌స్వీపే లక్ష్యంగా కాన్పూర్‌లో అడుగుపెట్టిన భారత్.. జర్నీ వీడియో షేర్ చేసిన బీసీసీఐ
బంగ్లాదేశ్‌తో చివరిదైన రెండో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు కాన్పూర్ చేరుకుంది. ఇప్పటికే తొలి మ్యాచులో 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాన్పూర్ వేదికగా జరిగే ఈ టెస్టులోనూ గెలిచి.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. ఇక ఎయిర్‌పోర్ట్‌కు చేరిన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పటిష్ట భద్రత మధ్య వారిని.. పోలీసులు టీమిండియా బస చేసే హోటల్‌కు తీసుకెళ్లారు. బంగ్లాదేశ్ జట్టు కూడా …
Read More »దక్షిణాఫ్రికాకు అఫ్ఘానిస్థాన్ షాక్.. తొలిసారి వన్డే సిరీస్ కైవసం
ప్రపంచ క్రికెట్‌లో అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లు అనామక జట్టుగా ఉన్న అఫ్ఘాన్.. ఇటీవల కాలంలో హేమాహేమీ జట్లను సైతం ఓడిస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా జట్టును వరుసగా రెండు మ్యాచుల్లో ఓడించి.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఆ దేశ అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. దక్షిణాఫ్రికా జట్టును మాత్రం షాక్‌కు గురి చేసింది. తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన అప్ఘానిస్థాన్.. రెండో వన్డేలో ఏకంగా 177 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే …
Read More »