క్రీడలు

పారిస్‌ ఫైనల్‌ మెడల్స్ లిస్ట్‌.. టాప్‌లో అమెరికా, భారత్‌ కంటే మెరుగైన స్థానంలో పాకిస్థాన్..!

పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లో క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. మొత్తంగా సుమారు రెండు వారాల పాటు సాగిన ఈ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే భారత ఫ్యాన్స్‌కు మాత్రం మిశ్రమ అనుభూతులను అందించాయి. మను భాకర్‌ తొలి మెడల్‌ సాధించి జోష్‌ నింపింది. అయితే బ్యాడ్మింటన్, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు నిరాశ పరిచారు. మరికొందరు పతకాన్ని తృటిలో చేజార్చుకున్నారు. మొత్తంగా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ 6 పతకాలు సాధించింది. అయితే పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో చైనాకు చోటు …

Read More »

వినేశ్ ఫోగట్ అంశంపై చర్చకు నిరాకరణ.. పార్లమెంట్ నుంచి విపక్షాలు వాకౌట్

ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ అనర్హత అంశంపై చర్చించాలని రాజ్యసభలో విపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టాయి. ఇందుకు ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నిరాకరించడంతో విపక్షాలు వాకౌట్ చేశారు. వినేశ్ ఫోగట్ తాను పోటీ పడిన 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకోగా.. తుదిపోరుకు కొద్ది గంటల ముందే నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంతో అనర్హురాలిగా ప్రకటించడంతో యావత్తు దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఒలింపిక్ నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటు ప్రధాని నరేంద్ర మోదీ.. …

Read More »

 ‘మీకల, నా ధైర్యం రెండూ ఓడిపోయాయి.. ఇక గుడ్‌బై!’ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం

ప్యారీస్‌ ఒలంపిక్స్‌ 2024లో కేవలం 100 గ్రాముల అదనపు బరువు వల్ల రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆమెకు ధైర్యం చెబుతూ ఎందరో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. వినేశ్‌ ట్వీట్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read More »

రాత్రికి రాత్రే బరువు ఎలా పెరిగింది? లక్షల్లో జీతం తీసుకునే కోచ్‌లు ఏం చేస్తున్నారు?

పారిస్ ఒలింపిక్స్‌ 2024లో ఫైనల్‌ చేరిన వినేష్‌ ఫొగాట్‌ స్వర్ణ పతకం సాధిస్తుందని అంతా భావించారు. 50 కేజీల మహిళ రెజ్లింగ్‌ విభాగంలో పాల్గొన్న ఆమె ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు కొన్ని గ్రాముల బరువు ఎక్కువ ఉన్నట్లు ఒలింపిక్‌ కమిటీ గుర్తించింది. దీంతో ఆమె ఫైనల్‌ ఆడకుండా అనర్హత వేటు విధించింది. దీంతో 140 కోట్ల మంది భారతీయులు నిరుత్సాహానికి గురయ్యారు. భారత క్రీడాలోకం మొత్తం వినేష్‌ ఫొగాట్‌కు మద్దతు ప్రకటించారు. రౌండ్‌ 16, క్వారర్స్‌, సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు ముందు వినేష్‌ ఫొగాట్‌ బరువు …

Read More »

భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం.. 27 ఏళ్ల తర్వాత సిరీస్‌ కోల్పోయిన భారత్‌

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్ శర్మ కాంబోలో ఆడిన తొలి వన్డే సిరీస్‌ను భారత్‌ కోల్పోయింది. శ్రీలంకతో జరిగిన ఈ వన్డే సిరీస్‌లో 0-2తో భారత్‌ ఓడిపోయింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 110 రన్స్ తేడాతో టీమిండియాను ఓడించింది. బ్యాటర్ల వైఫల్యంతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ భారత్‌ గెలవలేకపోయింది. అయితే ఈ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లో …

Read More »

ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్.. వినేష్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు, పతకం లేకుండానే!

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. సెమీ ఫైనల్‌లో గెలిచి నాలుగో పతకం ఖాయం చేసిన వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో పతకం ఖాయమనుకున్న భారత్‌కు షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు బరువు కొలవగా.. 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల ఫైనల్‌ …

Read More »

నేటి నుంచి పారిస్ బరిలో మల్లయోధులు.. ‘పది పతకాలు’ దక్కాలంటే రెజ్లర్లు పట్టు పట్టాల్సిందే..!

Paris Olympic Games 2024: ఎన్నో ఆశలతో పారిస్‌ 2024 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా రెండంకెల పతకాల మార్కును చేరుకోవాలని పట్టుదలతో ఒలింపిక్స్ బరిలో నిలిచిన భారత్.. ఇప్పుడు అది సాధిస్తుందా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. షూటింగ్ మినహా మరే ఈవెంట్‌లలోనూ భారత అథ్లెట్లు రాణించలేకపోయారు. భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించగా.. అందులో రెండు మను భాకర్ ఖాతాలోనే ఉన్నాయి. మిగతాది కూడా షూటింగ్‌లో దక్కిందే. వాస్తవానికి పారిస్‌లో భారత్ పది పతకాలకు మించి …

Read More »

పీవీ సింధు స్టన్నింగ్‌ షో.. మూడో ఒలింపిక్‌ మెడల్‌ దిశగా విజయం

తెలుగుతేజం పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్‌ అబ్దుల్‌ రజాక్‌పై 21-9, 21-6తో వరుస సెట్లలో గెలిచి.. శుభారంభం చేసింది. తాజాగా బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టిన్‌ కుబాను సైతం ఓడించింది. తొలి మ్యాచ్‌కు మించి బుధవారం జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు సత్తాచాటింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌ను 21-5తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన రెండో …

Read More »

మను భాకర్ ఖాతాలో మరో పతకం.. 

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ మరోసారి మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. సరబ్జోత్ సింగ్‌తో కలిసి బరిలోకి దిగిన భాకర్.. వరుసగా రెండో ఈవెంట్‌లోనూ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కాగా.. ఈ రెండూ మను భాకర్ సాధించినవే కావడం విశేషం. సోమవారం జరిగిన …

Read More »

విజయంతో గంభీర్‌ శకం ప్రారంభం.. 

శ్రీలంక పర్యటనను భారత్‌ విజయంతో ప్రారంభించింది. శనివారం (జులై 27వ తేదీ) పల్లెకెలె వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును టిమిండియా ఓడించింది. హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) నేతృత్వంలో ఆడిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల పతనానికి 213 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను 170 పరుగులకే కుప్పకూల్చింది. కాగా.. ఈ …

Read More »