క్రీడలు

పారిస్ ఒలింపిక్స్‌లో బీజేపీ మహిళా ఎమ్మెల్యే.. 

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. అయితే తొలిరోజు భారత క్రీడాకారులు నిరాశపరిచారు. ఈ క్రమంలోనే పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన వారిలో ఓ బీజేపీ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆమెనే బీహార్‌కు చెందిన శ్రేయాసీ సింగ్. బీహార్‌ 2020 ఎన్నికల్లో జముయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాసీ సింగ్.. భారత షూటింగ్ విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు ఎన్నికయ్యారు. పారిస్ ఒలింపిక్స్ కోసం వెళ్లిన 117 మంది భారతీయ క్రీడాకారుల్లో శ్రేయాసీ సింగ్ కూడా ఒకరు కావడం గమనార్హం. అయితే షూటింగ్ …

Read More »

Paris Olympics 2024: పారిస్ సంబరం.. ఘనంగా ఆరంభం..

పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అధికారికంగా తెరలేచింది. ఒలింపిక్ చరిత్రలో తొలిసారి నదిలో జరిగిన ఈ సంబురాలు.. చూపరులను ఆకట్టుకున్నాయి. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు అంబరాన్ని తాకాయి. చారిత్రక సీన్‌ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్‌ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో నిర్వహించింది. గతంలో ఎప్పుడైనా ప్రారంభ వేడుకలు స్టేడియంలో జరిగేవి.. కానీ పాత పద్దతికి స్వస్తి పలుకుతూ సెన్ నదిపై వేడుకలను ఘనంగా నిర్వహించింది ఫ్రాన్స్. విశ్వక్రీడల …

Read More »

నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్‌.. చరిత్రలో నిలిచిపోనున్న ప్రారంభ వేడుకలు..!

ప్రపంచ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ దేశాల్ని ఒక్కచోటకు చేర్చి ఆటలాడించే అద్భుత ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. నేడు పారిస్‌ వేదికగా ఒలింపింక్స్‌ 2024కు తెరలేవనుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడల్లో నేటి నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. చివరగా పారిస్‌లో 1924లో ఒలింపిక్స్‌ జరిగాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అక్కడ పోటీలు జరగనున్నాయి. ఒలింపిక్స్‌ చరిత్రలో నిలిచిపోనున్న వేడుకలు.. సాధారణంగా ఎప్పుడైనా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు ఆతిథ్య నగరంలోని ప్రధాన స్టేడియంలో జరుగుతాయి. …

Read More »

హార్దిక్‌కు మరోషాక్..!

టీ20 ప్రపంచకప్ 2024లో ఛాంపియన్‌గా నిలివడం మినహా.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గత ఏడాది కాలంగా ఏదీ కలిసి రావడం లేదు. ఆట పరంగా, వ్యక్తిగతంగా అతడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాక.. హార్దిక్ పాండ్యా ఫేట్ మారిపోయింది. తొలి సీజన్‌లోనే గుజరాత్ ఛాంపియన్‌గా నిలవడం.. రెండో సీజన్‌లోనూ ఫైనల్ చేరడంతో పాండ్యా కెప్టెన్సీపై ప్రశంసలు వచ్చాయి. భారత జట్టుకు సైతం భవిష్యత్ కెప్టెన్ అతడే అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఐపీఎల్ …

Read More »

భారత క్రికెట్‌ చరిత్రలో.. తొలి బౌలర్‌గా అర్ష్‌దీప్‌ అరుదైన ఘనత

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) యూఎస్‌ఏపై భారత యువ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ (4-0-9-4) అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. దీంతో భారత క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దాంతోపాటు మరో రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో 10 పరుగులు కంటే తక్కువ ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అశ్విన్‌ (4/11) రికార్డును అర్ష్‌దీప్ అధిగమించాడు. పొట్టి కప్‌లో తొలి బంతికే వికెట్‌ …

Read More »