కేశవపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తాడికల్‌కు చెందిన 27ఏళ్ల గొట్టె శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్‌ను ప్రేమించి 2020లో వివాహం చేసుకుంది. తరువాత వారిద్దరూ బోయినపల్లిలో నివాసముంటున్నారు.. వీరికి ఓ బాబు ఉన్నాడు. నువ్వు నన్ను నమ్మినందుకు నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు.. దేవుని సాక్షిగా చెబుతున్నా.. కొడుకు సాక్షిగా చెబుతున్నా.. మా అమ్మ.. నీ సాక్షిగా చెబుతున్నా.. పెళ్లి అయినా దగ్గరి నుంచి నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు.. నేను తప్పు చేయాలనుకుంటే.. నువ్వు …
Read More »సృష్టికర్తలు కాదు.. పచ్చి దగాకోర్లు.. ఏం చేశారో తెలిస్తే తూ అని ఊస్తారు..
పిల్లల్ని మార్చి.. నమ్మిన దంపతుల్ని ఏమార్చి, చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డ సృష్టికర్తలు ఎట్టకేలకు నేరం ఒప్పుకున్నారు. ఔను.. సరొగసీ పేరుతో పచ్చిమోసానికి పాల్పడ్డాం, దగా చేశాం, డాక్టర్ల వేషంలో దందాలు చేశాం అని లెంపలేసుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ అక్రమాల కేసు దర్యాప్తులో ఇదొక కీలక పరిణామం. సంతాన సాఫల్యం ముసుగులో అడ్డగోలు సంపాదనకు తెగించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కథ క్లయిమాక్స్‌కు చేరినట్టే ఉంది. గత వారంలో అరెస్టయిన డాక్టర్ నమ్రత కస్టడీ నిన్నటితో ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు …
Read More »రైల్వే స్టేషన్లో ముగ్గురు మహిళల వద్దకు వెళ్లి ఆగిన పోలీస్ డాగ్.. ఏంటా అని తనిఖీ చేయగా
అది విజయవాడ రైల్వే స్టేషన్. ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉంది. పోలీసులను రెగ్యులర్ తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో చెకింగ్స్ సమయంలో సాయపడే డాగ్ ఒకటి.. మూడు బ్యాగుల వద్దకు వెళ్లి ఆగింది. దాన్ని చూడగానే వాటిని తీసుకొచ్చిన మహిళలు.. అక్కడి నుంచి వెళ్లిపోడానికి యత్నించారు. ప్రయాణికుల మాటున గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను విజయవాడ రైల్వే స్టేషన్లో నార్కో డాగ్ ‘లియో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. 30 కిలోల గంజాయిని ముగ్గురు మహిళల నుంచి స్వాధీనం చేసుకుని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. …
Read More »తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ పర్సన్ వెంకటేష్ నాయుడు.. ఇంతకీ ఇతను ఎవరివాడు…?
ఏపీలో లిక్కర్ స్కాం సృష్టిస్తోన్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ ఎపిసోడ్లో రెండు రోజులుగా ఓ వ్యక్తి గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కాంను మించి ఆ వ్యక్తి గురించి ఎందుకు అంత చర్చ నడుస్తుంది. ఎవరా వ్యక్తి? అతని వెనుక ఉన్నది ఎవరు? చెరుకూరు వెంకటేష్ నాయుడు, s/o తిరుపతి నాయుడు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో నివాసం. 36 ఏళ్ల వెంకటేష్ నాయుడు, లిక్కర్ కేసులో ఏ34 అనూహ్యంగా తెరపైకి వచ్చాడు. లిక్కర్ స్కాం డబ్బును తరలించడానికి సహకారం అందించారని ఆరోపణలు …
Read More »ఫస్ట్‌నైట్ కోసం స్వీట్లు తెచ్చేందుకు వెళ్లిన వరుడు.. తిరిగి గదిలోకి వచ్చే సరికి..
కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లిలో ఉదయం అంతా ఉత్సాహంగా సందడిగా ఉన్న వధువు.. రాత్రి శోభనం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో నవవధువు ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షితకు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన వరుడు నాగేంద్రతో ఆగస్టు నాలుగో తేదీన సోమవారం ఉదయం వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా హర్షిత, నాగేంద్ర వివాహంతో కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాల …
Read More »శివార్లలో డ్రగ్స్ పార్టీలకు చెక్ పెట్టడానికి పోలీసుల నయా వ్యూహం
వీకెండ్ వస్తే…హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లు.. డ్రగ్స్ పార్టీలతో దద్దరిల్లిపోతున్నాయి. మత్తు పార్టీల కోసం ఐసోలేటెడ్ ఏరియాలో ఫామ్‌హౌస్‌లను ఎంచుకుంటున్నాయి ఎంజాయ్ బ్యాచ్‌లు. దీంతో నగర శివార్లలో డ్రగ్స్ పార్టీలకు చెక్ పెట్టడానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. చేవెళ్లలోని సెరేన్ ఆర్చర్డ్స్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ ముసుగులో డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అభిజిత్ బెనర్జీ అనే ఐటీ ఎంప్లాయీ ఈ బర్త్‌డే పార్టీ ప్లాన్ చేశాడు. తనతో పాటు పనిచేసే సిప్సన్, పార్థ్ గోయల్, పల్లప్ప యశ్వంత్ …
Read More »వీడికేం పోయేకాలం సామీ..! ఏకంగా 500 మంది మహిళలను మోసం చేశాడు.. అసలు మ్యాటర్ తెలిస్తే!
జల్సాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నమ్మించి నిండా ముంచాడు. ముద్ర రుణాలు ఇప్పిస్తానంటూ సుమారు 500 మంది మహిళలను మోసం చేశాడు. పక్కా సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఐఎస్ సదన్ పోలీసులు అతగాడిని అదుపులోకి తీసుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేరు.. షేక్ జానీ.. మరో పేరు.. హరినాథ్ రావు.. ఊరు నల్గొండ జిల్లా నకిరేకల్. ఇంటర్ ఫెయిలైన జానీ.. బతుకు దెరువు కోసం 2011లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు.. సరూర్‌నగర్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో …
Read More »కూతురు అమెరికా నుంచి డబ్బులు పంపింది.. బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వెళ్తుండగా
బైంసాలో పట్టపగలే చోటుచేసుకున్న చోరీ కలకలం రేపింది. అమెరికాలో ఉన్న కూతురు పంపిన రూ.5 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తి… తినేందుకు బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్లిన క్షణాల్లోనే స్కూటీ డిక్కీ నుంచి డబ్బులు గల్లంతయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో సోమవారం నాడు మధ్యాహ్న సమయంలో చోరీ జరిగింది. ముథోల్ మండలానికి చెందిన ఎడ్బిడ్ గ్రామవాసి బొంబోతుల ఆనంద్ అమెరికాలో ఉన్న తన కూతురు పంపిన డబ్బును బ్యాంకు నుంచి …
Read More »వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసు మరో మలుపు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసులో మొదటి నుంచి దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. దర్యాప్తు నిలిచిన దశ నుంచి కొనసాగించాలని సూచించింది. సిట్ అధికారులు విచారమ ప్రారంభించారు. అనంతబాబుకు సహకరించినవారిపై సిట్ ఫోకస్ చేసింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసి హత్య కేసులో ఉన్న కుట్ర అంతా బయట పెట్టాలని అనుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో తదుపరి దర్యాప్తు పేరుతో మళ్లీ …
Read More »గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీలో అవినీతికి పాల్పడ్డ వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు చోట్ల చేసిన సోదాల్లో భారీగా నగదు కట్టలు, ఆస్తులు గుర్తించారు ఈడీ అధికారులు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 10 చోట్ల సోదాలు నిర్వహించింది ఈడీ. సికింద్రాబాద్, బోయిన్పల్లి, …
Read More »