క్రైమ్

మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య.. నిందితులకు ఉరిశిక్ష వేస్తామన్న సీఎం

Junior Doctor: పశ్చిమ బెంగాల్‌లో మెడికల్ స్టూడెంట్‌పై హత్యాచారం జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. రాజధాని కోల్‌కతాలో ఉన్న ఓ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించిన ఆ మహిళా ట్రైనీ డాక్టర్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిందని.. ఉదయం చూసేసరికి శవంగా కనిపించినట్లు తోటి మెడికల్ స్టూడెంట్స్ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించగా.. కీలక విషయాలు బయటికి వచ్చాయి. బాధితురాలిపై దారుణంగా లైంగిక దాడి జరిగిందని.. ఆమె శరీరంపై, ప్రైవేటు భాగాలపై …

Read More »

భారీ ఉగ్రకుట్ర భగ్నం.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాది

Independence Day: దేశంలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాజాగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఉగ్రవాది వద్ద నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో పంద్రాగస్టు వేడుకలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రకు ఉగ్రవాదులు తెరలేపగా.. వాటిని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అయితే ఆ ఉగ్రవాది.. భారత ప్రభుత్వం వాంటెడ్ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. అతడి కోసం వెతుకుతుండగా.. తాజాగా ఢిల్లీలో ఆయుధాలతో పట్టుబడటం తీవ్ర …

Read More »

ఏపీ ప్రజలకు అలర్ట్.. పథకం ప్రారంభం కాక ముందే ఇదేం తలనొప్పి.. జాగ్రత్తగా ఉండండి

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొన్ని పథకాలను ప్రారంభించింది. మరికొన్ని పథకాలను త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాల పేరుతో మోసాలు మొదలయ్యాయి.. అసలు ప్రారంభంకాని పథకం పేరు చెప్పి ఓ అమాయకుడి దగ్గర నుంచి డబ్బులు లాగేసుకున్నారు సైబర్ కేటుగాళ్లు. తీరా మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. ప్రకాశం జిల్లా పొదిలి పిచ్చిరెడ్డి కాలనీకి చెందిన బి రామకృష్ణకు.. స్థానిక వార్డు వాలంటీర్‌ నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్ వచ్చింది. తాను …

Read More »

బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవదహనం.. 440కి చేరిన మృతులు

బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు ఆగడం లేదు. ఇప్పటికే ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి పారిపోయినా అక్కడ ఆందోళనలు మాత్రం చల్లారడం లేదు. దేశం మొత్తాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నా.. నిరసనకారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 440 కి పెరిగింది. తాజాగా ఓ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పుపెట్టడంతో.. అందులో ఉన్న 24 మంది సజీవ దహనం అయ్యారు. ఆ హోటల్‌లో ఇండోనేషియాకు చెందిన ఓ పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. …

Read More »

స్టాక్‌ మార్కెట్‌ పేరిట మోసం.. ప్రైవేట్‌ ఉద్యోగుల నుంచి రూ.3.81 కోట్లు దోచేశారు!

ప్రజల అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడి. ఎవరైతే అత్యాశకు పోతారో వారు.. మోస పోవటం ఖాయం. ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇటీవల కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ మోసాలు చేస్తున్నారు. అమాయకులు, అత్యాశపరులు వారి వలలో చిక్కుకొని నిండా మునుగుతున్నారు. తాజాగా.. పటాన్‌చెరు పట్టణంలో రూ.3.81 కోట్ల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులను రెండు వేర్వేరు ఘటనల్లో మోసగించారు. మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం …

Read More »

మటన్‌ పేరుతో కుక్క మాంసం సరఫరా ఆరోపణలు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

Mutton: నాన్ వెజ్ ప్రియులు మాంసాన్ని ఇష్టంగా తింటారు. అలాగే ఓ కుటుంబం కూడా మటన్ తెచ్చుకుని తిన్నారు. ఆ కుటుంబంలోని నలుగురు సభ్యులు మాంసం తిని.. ఆ తర్వాత అందులో ఇద్దరు తమ పనులకు వెళ్లిపోయారు. అయితే వాంతులు, విరేచనాలు కావడంతో వారు తిరిగి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇంట్లో ఉన్న ఇద్దరు కూడా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం …

Read More »

పేపర్ లీకేజ్‌పై సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) ప్రశ్నాపత్రం లీకేజ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్ధులు, ఓ జూనియర్ ఇంజినీర్, ఇద్దరు కుట్రదారులు సహా 13 మందిని నిందితులుగా చేర్చింది. నీట్ లీక్ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. పరీక్షను రద్దుచేసి.. మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టును పలువురు ఆశ్రయించగా.. అందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమే కానీ.. దీని …

Read More »

161కి చేరిన వాయనాడ్ మృతులు.. వారికోసం రంగంలోకి ఆర్మీ జాగిలాలు

ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ వయనాడ్‌లోని మెప్పడిలో నాలుగు గ్రామాలపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకూ 161 మంది చనిపోయారు. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు. ఈ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా రాష్ట్ర యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద, బురద ప్రవాహంలో కొందరు కొట్టుకుపోగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో …

Read More »

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్‌పూర్‌ దగ్గర హౌరా-సీఎస్‌ఎంటీ (ముంబై) ఎక్స్‌ప్రెస్‌ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికుకలకు తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు బీహార్‌లో కూడా సోమవారం రైలు ప్రమాదం జరిగింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సమస్తిపూర్ దగ్గర ఇంజిన్, రెండు బోగీల …

Read More »

జనసేన పార్టీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి.. కారు ధ్వంసం, పవన్ కళ్యాణ్ సీరియస్

ఏలూరు జిల్లా పోలవరం పార్టీ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కాన్వాయ్‌పై దాడి కలకలంరేపింది. ఆయన కారుపై గుర్తుతెలియని వ్యక్తు లు రాళ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే బాలరాజు బర్రింకలపాడు నుంచి సోమవారం రాత్రి జీలుగుమిల్లి బయలుదేరారు.. ఇంతలో నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఈ దాడి జరిగింది. ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.. కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దాడి జరిగిన సమయంలో కారులో తాను లేనని.. తాను సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, …

Read More »