మూఢనమ్మకాల అనుమానం, భూతగాదాలతో కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ కుమారుడు. తండ్రి ఒంటరిగా పొలం వద్ద పనులు చేస్తుండగా తన మేనల్లుడితో పాటు అక్కడికి వచ్చిన కుమారుడు తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తల, మొండెం వేరు మృతదేహాన్ని తీసుకెళ్లి ఒక కాలువలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవినగర్ లో వృద్ధుడు చాగొండ బాలయ్య నివాసం …
Read More »ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. స్థానికులకు అడ్డంగా దొరికిన యువకుడు.. కట్‌చేస్తే..
కడప జిల్లాలో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న ఒక ఐదేళ్ల బాలికపై కన్నేసిన కామాందుడు.. ఆ పాపపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకొని చితబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో రోజురోజుకూ కామాందులు పెరిగిపోతున్నారు. రోడ్లపై ఆడ పిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలా తమ వక్రబుద్ది చూపిస్తున్నారు. అక్కడ ఉన్నది పసిపిల్లా, పండు ముసలా అని కూడా చూడట్లేదు. కామంతో కల్లుమూసుకుపోయి వాళ్లపై పడి తమ …
Read More »ఆర్టీవో చలాన్ కట్టాలంటూ వాట్సప్‌కు మెస్సెజ్.. క్లిక్ చేస్తే ఊహించని సీన్.. బీ అలర్ట్..
మోసం.. మోసం.. మోసం.. మనకు తెలియకుండానే మన ఫోన్ ద్వారా ఇట్టే దోచేస్తున్నారు సైబర్ బూచోళ్లు.. అందుకే.. ఫోన్ చేసినా.. మెస్సెజ్ చేసినా.. ఏ లింకులను క్లిక్ చేయొద్దు.. ఎవర్నీ నమ్మోద్దు.. అంటూ పోలీసులు అందరికీ సూచిస్తున్నారు. అయినా.. కొందరు పట్టించుకోకుండా కొందరు సైబర్ క్రిమినల్స్ మోసం బారిన పడి లబోదిబోమంటున్నారు బాధితులు.. తాజాగా.. హైదరాబాద్ నగరంలో.. మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.. ఆర్టీఓ చలాన్ కట్టలంటూ వాట్సప్ ద్వారా వచ్చిన మెస్సెజ్‌లను క్లిక్ చేసిన ఇద్దరు హైదరాబాద్ నివాసితులు దాదాపు 6 …
Read More »గుళ్లో హుండీ మాయం.. నెల తర్వాత ఊహించని సీన్! అంతా అమ్మవారి మహిమే..
భక్తులు కానుకలు, ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టెను ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత హుండీ పగలగొట్టి అందులోని సొమ్మును బయటకు తీశారు కూడా. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ ఎత్తుకెళ్లిన మొత్తం సొమ్మును తిరిగి అదే గుడిలో వదిలేసి చెంపలేసుకుని వెళ్లారు. ఓ దొంగల ముఠా కాపుకాసి ఏకంగా దేవుడి గుడిలోనే చోరీ చేశారు. భక్తులు కానుకలు, ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టెను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత హుండీ పగలగొట్టి అందులోని సొమ్మును బయటకు తీశారు …
Read More »ఎయిర్‌పోర్ట్‌లో తింగరిగా ప్రవర్తిస్తున్న యువతి.. అదుపులోకి తీసుకుని చెక్ చేయగా..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బ్యాంకాక్ నుంచి ఓ ప్లైట్ వచ్చింది. అయితే ఆ విమానం దిగిన ఓ యువతి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంది. కాసేపు గమనించిన అధికారులు వెంటనే ఆమె అదుపులోకి తీసుకున్నారు. వివరాలు అడిగిన తర్వాత.. తన లగేజ్ తనిఖీ చేశారు … హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల యువతి సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా, ఆమెను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 3.1 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని ఆమె బ్యాగులో దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ …
Read More »ఏంట్రా ఇది.. ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే టార్గెట్ చేశారు.. మహిళా ఉద్యోగిని బెదిరించి..
రాష్ట్ర సచివాలయం అప్పుడే ప్రారంభమైంది. సచివాలయానికి వచ్చిన వివిధ శాఖల ఉద్యోగులు తమ తమ సీట్ల కూర్చొని విధులు నిర్వర్తించడం మొదలు పెట్టారు. సచివాలయంలోని ఒక శాఖలో పనిచేస్తున్నా మహిళా ఉద్యోగికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తన పేరు అరవింద్ అని సిఐడి నుండి ఫోన్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఆ ఉద్యోగిలో కంగారు మొదలైంది. అరవింద్ అంతటితో ఆగకుండా మీపై సిఐడి కేసు ఉందని దాన్ని మాఫి చేయాలంటే డబ్బులివ్వాలని అడిగాడు. సిఐడి కేసు ఉందని చెప్పడంతో ఆ మహిళా ఉద్యోగిలో …
Read More »లక్షలు డ్రా చేయాలంటూ బ్యాంక్‌కు వచ్చిన వృద్దుడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం,అలాగే సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా కొంతమేరకు నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చు. అందుకు నిదర్శనమే తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఘటన. కె.డి.సి.సి. బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి చలసాని పూర్ణ చంద్రరావు అనే 74 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో 72 గంటలు పాటు వేధించారు. వారి ఒత్తిడికి భయపడి సదరు …
Read More »ఆమెకు 45.. అతడికి 24.. గుట్టుగా ఆ యవ్వారం.. సీన్లోకి కూతురి ఎంట్రీతో
యూట్యూబ్‌లో చూసి మర్డర్ స్కెచ్ వేశారు. ఆ యువతిని క్షుద్ర పూజలకు బలిచ్చినట్లు అందరిని నమ్మించి హైడ్రామా క్రియేట్ చేశారు. యువతిని చంపి ఆ డెడ్‌బాడీ వద్ద క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్ళతో హైడ్రామా క్రియేట్ చేసిన ఆ మర్డర్ మిస్టరీ వీడింది. డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు చాకచక్యంగా చేధించారు. తీగలాగితే దొంగ కదిలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన డబుల్ మర్డర్ మిస్టరీ వీడింది. అచ్చం దృశ్యం కథను మరిపించేలా కన్నతల్లి మర్డర్ స్కెచ్ వేసినట్లుగా గుర్తించిన పోలీసులు ఆ కసాయి తల్లితో …
Read More »ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు.. జోరుగా రూ.లక్షల్లో లావాదేవీలు! 8 మంది అరెస్ట్..
నగరంలో మరో ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టైంది. SR నగర్లో అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్‌ను టాస్క్ ఫోర్స్ (సౌత్) టీమ్ సోమవారం అరెస్ట్ చేసింది. నిషేధిత ఖేలో గేమ్స్ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న ముఠాకు సంబంధించిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. ఈ ముఠా ఆన్లైన్ బెట్టింగ్ కోసం పలు రకాల మొబైల్ అప్లికేషన్లను ఉపయోగిస్తోంది. మారు వ్యక్తుల పేర్లతో యూజర్ ఐడీలు, బ్యాంక్ ఖాతాలను సృష్టించి జోరుగా దందా నిర్వహిస్తున్నారు. అరెస్టయిన నిందితులను జి వినయ్ కుమార్, ఎన్ సాయి వర్ధన్ …
Read More »ఎయిర్‌పోర్టులో అనుమానంగా కనిపించిన యువతి.. ఆపి లగేజ్ చెక్ చేయగా..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ మొత్తంలో గంజాయి పట్టుకున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న మహిళను అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి సుమారు రూ.3 కోట్లు విలువైన 3.1 కేజీల గంజాయ్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుండి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల మహిళను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. అమె నుంచి సుమారు 3.1 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం …
Read More »