హైదరాబాద్ కుషాయిగూడలో అదృశ్యమైన వ్యక్తి అనూహ్యంగా దుర్గం చెరువులో శవమై తేలడం కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఆదివారం (జులై 27) ఉదయం మృతుదేహం లభ్యమైంది. దుర్గం చెరువులో మృతుదేహం తేలడంతో మాదాపూర్ పోలీసులకు.. లేక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో చెరువు దగ్గరికి వెళ్లిన పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. మృతుడిని కుషాయిగూడ సైనిక్ పూరికి చేందిన దుర్గా ప్రసాద్ (36)గా పోలీసులు గుర్తించారు. జులై 25న ఇంటి నుంచి వెళ్లిన దుర్గా ప్రసాద్.. రెండు …
Read More »అనుమానమే పెనుభూతమై.. ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.. కట్‌చేస్తే..
తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో దారణం వెలుగు చూసింది. అనుమానం ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి దారుణంగా బండరాయితో కొట్ట హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న పిల్లలకు విషయాన్ని వాళ్ల అమ్మమ్మకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. జీవితాంతం తోడుగా ఉంటానంటూ మూడు ముళ్లు వేశాడు. ఏడు అడుగులు నడిచాడు. సొంతూరు నుంచి అత్తవారి ఊరుకు మకాం మార్చాడు. వారి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు …
Read More »ఆపరేషన్ మహదేవ్.. పహల్గామ్‌లో టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులు హతం..
పహల్గామ్ లో అమాయక టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి.. ఆర్మీ , సీఆర్‌పీఎఫ్ , జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ , సులేమాన్‌షా, అబూ తల్హా హతమయ్యారు. కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను చుట్టుముట్టిన ఆర్మీ .. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇప్పటికే.. ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ మహదేవ్ చేపట్టిన భద్రతా బలగాలు.. అణువణువు గాలించి ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. …
Read More »రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్… ముగ్గురు అరెస్ట్, ఇద్దరు పరారీ
పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ నగరంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉంది. మరోసారి పోలీసుల తనిఖీల్లో రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. హైదరాబాద్‌లోని బాటసింగారంలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశా, ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశారు పోలీసులు. 934 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది ఈగల్ టీమ్. DCM వాహనంలో పండ్ల బాక్స్‌ల మధ్యలో గంజాయిని తరలిస్తూ దొరికిపోయారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు పరారయ్యారు. పారిపోయిన …
Read More »ఐబొమ్మకు మూడిందా..? రంగంలోకి పవన్ ఫ్యాన్స్
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన తొలి సినిమా ‘హరి హర వీరమల్లు’ పైరసీ బారిన పడింది. సినిమా విడుదలై మూడురోజుల్లా కాకముందే Ibomma, Movierulz లాంటి వెబ్‌సైట్లలో లీక్ కావడంతో తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు ఇప్పుడు పైరసీ బారిన పడింది. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన మొదటి సినిమా ఇదే కావడంతో.. …
Read More »స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్… కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్
హైదరాబాద్‌లోని కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ దర్శనమిచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. రేవ్‌పార్టీ నిందితులకు రాజకీయంగా సంబంధాలు ఉన్నాయా అనేదానిపై పోలీసులు ఎంక్వైరీ చేశారు. స్టిక్కర్‌పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది నకిలీదని నిర్ధారించారు. టోల్ చార్జీ కట్టకుండా తప్పించుకునేందుకే కారుకు ఎంపీ స్టిక్కర్ వేసుకున్నట్టు గుర్తించారు. ఎంపీ స్టిక్కర్ ఫేక్ అని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. సీజ్ చేసిన కారు అశోక్ నాయుడిదిగా గుర్తించారు. ఆదివారం కొండాపూర్ SV …
Read More »చిన్నారిపై లైంగిక దాడి.. కామాంధుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష..
చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇంటిబయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి మాయమాటలు చెప్పిన అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అతడిని కఠిన శిక్ష విధించింది. దేశంలో ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఓ చోట మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, పొక్సో వంటి చట్టాలను సైతం కామాంధులు లెక్క చేయడం …
Read More »అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..
కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పిచ్చిన వ్యక్తిని పథకం ప్రకారం కత్తులతో పొడిచి చంపించేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. నంద్యాల పట్టణానికి చెందిన పరుచూరి అశోక్ అనే వ్యక్తిని పథకం ప్రకారం పాణ్యం శివారులోని5 ఓ సోడ షాపు పిలిపించి కత్తులతో పొడిచి చంపిన ఘటనలో పోలీసులు పది …
Read More »డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిన 14 మందిని పోలీసులు ఏం చేశారంటే..?
హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించిన 14 మంది శిక్షకు బదులుగా చికిత్సను ఎంచుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. తెలంగాణ పోలీసుల EAGLE టీమ్.. తెలిపిన ప్రకారం.. వీరంతా గవర్నమెంట్ గుర్తింపు పొందిన డీ-అడిక్షన్ కేంద్రాల్లో చికిత్సకు ముందుకు వచ్చారు. వారు కావాలనుకున్నది శిక్ష రద్దు కాదు, తమ తప్పును ఒప్పుకుని జీవితాన్ని మార్చుకునే అవకాశం అని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసిన వారి కోసం… NDPS చట్టంలోని 64-A సెక్షన్ ఒక మార్గం చూపుతోంది. వ్యసనానికి లోనైనవారు …
Read More »బడ్డీ కొట్టలో చాక్లెట్లు తెగ తింటున్న పిల్లలు… అధికారులు ఆరా తీయగా
విజయవాడలో బడ్డీ కొట్లలో అమ్ముతున్న చాక్లెట్లను.. పిల్లలు తెగ తింటున్నారు. అవే కొనిపెట్టాలని తల్లిదండ్రుల వద్ద మారాం చేస్తున్నారు. స్కూళ్లకు సమీపంలోని బడ్డీ కొట్లలో కూడా వీటిని విక్రయిస్తున్నారు. ఈ విషయం గురించి సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా.. విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. విజయవాడలో ఉంటున్న పిల్లల తల్లిదండ్రులూ జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటకొస్తే ఏ ప్రాంతంలోని తల్లిదండ్రులు అయినా పిల్లలు విషయంలో ఇప్పుడు అలెర్ట్ అవ్వాల్సిన సమయం. ఇప్పుడు మీకు చెప్పబోయే న్యూస్ ఏమాత్రం లైట్ తీసుకోకండి. విజయవాడలో ఈగల్ …
Read More »