క్రైమ్

రూ.కోటికి.. రెండు కోట్లు ఇస్తామని బంపర్ ఆఫర్.. కట్‌చేస్తే..దిమ్మతిరిగే ట్విస్ట్!

రద్దయిన రూ.2వేల నోట్లతో రెట్టింపు డబ్బును ఆశగా చూపి ఓ ముఠా మోసానికి పాల్పడింది. ఓ వ్యాపారి నుంచి రూ.కోటి కాజేసి అడ్డంగా దొరికి పోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.73.20 లక్షల నగదు తోపాటు రెండు వాహనాల స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసిందిచలామణిలో లేని రూ.2వేల నోట్లతో రెట్టింపు ఆదాయం పొందవచ్చని ఆశచూపుతూ ఓ ముఠా మోసాలకు పాల్పడుతున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి …

Read More »

 డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం- సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో గంజాయి మాట వినిపిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో డ్రగ్స్‌, గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నామని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ ముందుకెళతామని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణను గత ప్రభత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని ఎవరైనా డ్రగ్స్‌తో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గురువారం గుంటూరులో నిర్వహించిన వాకథాన్‌ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో …

Read More »

మావోయిస్టు లేఖపై స్పందించిన మంత్రి సీతక్క..! ఒక మహిళ అని కూడా చూడకుండా..

తాజాగా మంత్రి సీతక్కపై వెలుగులోకి వచ్చిన మావోయిస్టు లేఖపై ఆమె స్పందించారు. ఇది నిజమైన బెదిరింపు లేక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అనేది తెలియాల్సి ఉందని అన్నారు. ఆదివాసి మహిళగా తనకు మంత్రి పదవి రావడం కొందరికి జీర్ణం కాలేదని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.మావోయిస్టుల పేరుతో ఇటీవలె మంత్రి సీతక్కపై ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ లేఖపై సీతక్క స్పందించారు. ఆ లేఖలో ములుగులో ఆదివాసీల గెంటివేతపై ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణలో ఆదివాసీల పరిరక్షణ బాధ్యత …

Read More »

మావోల నుంచి బెదిరింపులు.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు భద్రత పెంపు!

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్‌రావుకు భద్రత పెంచాలని నిర్ణయించింది. మావోయిస్టుల నుంచి ఇటీవల రఘునందన్‌ రావుకు బెదిరింపు కాల్స్‌ వచ్చిన నేపథ్యంలో ఆయన భద్రతపై పోలీస్‌ శాఖ ధృష్టి సారించింది. ఈ బెదిరింపు కాల్స్‌పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, ఆయనకు అదనపు భద్రత అవసమని నిర్ణయించారు. ఈ మేరకు రఘునందన్‌ రావుకు అదనపు భద్రత కల్పించాలని మెదన్‌ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఇటీవల మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని …

Read More »

ఎంతకు తెగించార్రా.. CID.. సుప్రీం కోర్టు.. చీఫ్‌ జస్టిస్‌.. అంతా ఫేక్‌! దారుణంగా మోసపోయిన ఉద్యోగి

కాప్రాకు చెందిన రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని, సైబర్ నేరస్థులు సుప్రీం కోర్టు, ఆర్బీఐ పేరుతో మోసం చేశారు. ఢిల్లీ పోలీసులమంటూ ఫోన్ కాల్ చేసి, మనీలాండరింగ్ కేసు నమోదైందని బెదిరించి, కోర్టు సెక్యూరిటీ పేరుతో రూ.22.05 లక్షలు గుట్టుచప్పుడు లేకుండా మోసం చేశారు. బాధితుడు తనకు తెలిసిన వారి సహాయంతో మోసం గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మోసం చేసేందుకు కేటుగాళ్లు ఏమైనా చేసేలా ఉన్నారు. ఏకంగా భారత దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా వాడేసుకున్నారు. గతంలో పోలీస్‌ యూనిఫామ్‌లో కొంతమంది ఫేక్‌ …

Read More »

నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్‌కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!

హైదరాబాద్ మహానగరంలో ఓ కలెక్షన్ బాయ్ వ్యవహారం తన షాప్ యజమానికి హార్ట్ ఎటాక్ తెప్పించేంత పని అయ్యింది. తనని నమ్మి యజమాని పని అప్పచెపితే, తన అవసరం కోసం సోమ్ము చేసుకుని వాడుకున్నాడు. తీరా యజమాని పోలీసులను ఆశ్రయించడంతో కటకటాల పాలయ్యాడు. నమ్మిన బంగారు దుకాణం వ్యాపారికి టోకరా ఇచ్చిన ఉద్యోగి 7లక్షల రూపాయలతో కలెక్షన్ ఏజెంట్ పరార్ అయ్యాడు. నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతడి వద్ద నుండి రూ .6లక్షల 42 వేల …

Read More »

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలల్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు!

తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఫోకస్‌ పెట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిఏ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉప్పల్ ఆర్టిఏ కార్యాలయంతో పాటు తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ప్రధానంగా ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి బ్రోకర్ల చేతివాటం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సహకారం వంటి అంశాలపై ఏసీబీ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. గతంలోనూ మే 28న ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న …

Read More »

ఫార్ములా-E రేస్ కేసులో కీలక మలుపు.. IAS అధికారి అరవింద్‌కు మరోసారి ఏసీబీ పిలుపు!

తెలంగాణలో సంచలన సృష్టిస్తోన్న ఫార్ములా-E రేస్ కేసులో మరోసారి ఐఏఎస్ అరవిందు కుమార్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ కుమార్ పలుమార్లు ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ నుండి ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని గతంలో రాబట్టారు. ఆయన స్టేట్‌మెంట్లను సైతం ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే కొద్ది రోజులపాటు సెలవు నిమిత్తం అరవింద్ …

Read More »

పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టులు పెట్టిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియలో అనుచిత పోస్టులు పెట్టిన పలువురిపై జనసేన నాయకులు, వపన్ ఫ్యాన్స్ పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ పై అనుచితంగా కామెంట్స్ చేసిన వారిని గుర్తించారు. …

Read More »

తేజేశ్వర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌..! బయటికొచ్చిన సంచలన నిజాలు

గద్వేల్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌లు బయటపడ్డాయి. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అరెస్టు అయ్యారు. తిరుమలరావు, ఐశ్వర్య కలిసి 75 వేల రూపాయలకు సుపారీ ఇచ్చి తేజేశ్వర్‌ను హత్య చేయించారని పోలీసులు తెలిపారు. ఐశ్వర్యకు తిరుమలరావుతో గతంలో సంబంధం ఉండేదని, తేజేశ్వర్‌ను హత్య చేసి తిరుమలరావుతో పారిపోవాలని ఐశ్వర్య ప్లాన్ చేసిందని దర్యాప్తులో తేలింది.తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు, ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే …

Read More »