హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. నకిలీ వీసాలు, ఉద్యోగ ఆఫర్ లేటర్లతో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీలసులు పట్టుకున్నారు. ఈ మోసాలకు పాల్పడుతున్న నలుగురిలో ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 9 పాస్ట్‌పోర్టులు, 5నకిలీ విసాలు, రెండ్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. విదేశాలకు వెళ్లడం, అక్కడ ఉద్యోగాలు చేయడం చాలా మంది విద్యార్తుల కల. ఇలా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులను …
Read More »థాయ్‌లాండ్‌లో కొడుకు పెళ్లి.. కథ మామూలుగా లేదుగా! ఏసీబీ కస్టడీకి నూనె శ్రీధర్..
కాళేశ్వరం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ను కస్టడీకి తీసుకొని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. కరీంనగర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ నివాసం కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు పది రోజుల క్రితం సోదాలు నిర్వహించి రూ.200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. అంతేకాకుండా కుమారుడి వివాహం థాయిలాండ్‌లో చేయగా రిసెప్షన్ హల్దీ ఫంక్షన్స్ రిసాట్లల్లో పలు హోటల్స్ లలో నిర్వహించారు. అధికారులు గుర్తించినటువంటి ఆస్తుల్లో తెల్లాపూర్ లోని విల్లా షేక్పేట్ లో గేటెడ్ కమ్యూనిటీ హాల్లో ప్లాట్, అమీర్‌పేట్‌లో కమర్షియల్, కాంప్లెక్స్ కరీంనగర్‌లో మూడు ప్లాట్లు, …
Read More »అయ్యో భగవంతుడా.. ఇదేంటయ్యా..! చనిపోయిన మరుసటి రోజే ఉద్యోగం వచ్చినట్లు సమాచారం..
భవిష్యత్‌పై కోటి ఆశలతో కష్టపడి ఇష్టంగా చదివాడు.. పోలీస్ అవ్వాలని.. దేశ భద్రత కోసం సీఆర్పీఎఫ్ లో పని చేయాలని ఎన్నో కలలు కన్నాడు. దీని కోసం అన్ని విధాలుగా సిద్ధమై.. సక్సెస్ అయ్యాడు.. సీఆర్‌పీఎఫ్ పరీక్షలు సైతం రాశాడు.. మరికొన్ని గంటల్లోనే పరీక్ష ఫలితాలు వస్తాయనగా.. ఇంతలోనే విధి వంచించింది.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం వి వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన బానోత్ మణిచంద్ర నాయక్ (22) అనే యువకుడు …
Read More »కెనడా కేంద్రంగా భారత్‌పై ఖలిస్థానీ ఉగ్రవాదుల కుట్రలు! CSIS సంచలన రిపోర్ట్
కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) తాజా నివేదికలో కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలు, నిధుల సేకరణ, ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడించింది. ఇది భారతదేశం ఎప్పటినుంచో లేవనెత్తుతున్న ఆందోళనలను ధృవీకరిస్తుంది. కెనడా ప్రభుత్వం “ఉగ్రవాదం” అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించడం ఇదే మొదటిసారి.కెనడా ప్రధాన నిఘా సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) సంచలన సమాచారం బయటపెట్టింది. ఖలిస్తానీ తీవ్రవాదులు ప్రధానంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, నిధుల సేకరణకు, ప్రణాళిక వేయడానికి కెనడాను …
Read More »థాంక్ గాడ్ రక్షించినందుకు.. సోనమ్ చేతిలో రాజాకి బదులుగా నేను మరణించే వాడిని అంటున్న యువకుడు.. ఎందుకంటే..
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసు గురించి తెలిసిందే. హనీమూన్ కి వెళ్ళిన రఘు వంశీ, సోనమ్ ల కథ ఓ సినిమా స్టోరీని తలపిస్తున్న రియల్ స్టోరీ. అయితే ఇప్పుడు మరొక సంఘటన వెలుగులోకి వచ్చి ఆశ్చర్య పరుస్తోంది. సోనమ్ చేతిలో మరణించాల్సి వ్యక్తిని నేనే.. దేవుడి దయవలన అదృష్టవశాత్తు నేను రక్షించబడ్డాను.. రఘువంశీకి మరణించాడు అని ధార్ వ్యాపారవేత్త సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు సోనమ్ జీవితంలో ఉన్న మరో రహస్యాన్ని వెల్లడించాడు. తనకు సోనమ్ పెళ్లి …
Read More »రైతులకు సంకెళ్లు.. రేవంత్ సర్కార్ ఆగ్రహం.. ముగ్గురు పోలీసు అధికారుల సస్పెండ్..
జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ శివారులోని ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. ఇథనాల్ ఫ్యాక్టరీ విధ్వంసం కేసులో అరెస్టయిన 12 మంది రైతులను మహబూబ్‌నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో సంకెళ్లు వేయడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు.. ఒక ఆర్‌ఎస్సై , ఇద్దరు ఏఆర్‌ఎస్సైలను సస్పెండ్ చేశారు. ముగ్గురు సస్పెన్షన్‌కు సంబంధించి ఉత్తర్వులు …
Read More »బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు! పరుగులు తీసిన సిబ్బంది
హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ ద్వారా వచ్చింది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, CISF, ఇతర భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాన్ని ఖాళీ చేసి, బాంబు నిర్మూలన బృందం తనిఖీలు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది.ఇటీవలె అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో.. ప్రజల్లో విమానం పేరు వింటేనే భయం కలుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. …
Read More »నిర్మలా సీతారామన్ AI వీడియోతో భారీ స్కామ్! రూ.20 లక్షలు మోసపోయిన లేడీ డాక్టర్
హైదరాబాద్‌లోని ఓ వైద్యురాలు ఏఐ సాయంతో జరిగిన సైబర్ మోసానికి బలి అయ్యారు. నకిలీ వీడియోలు, లింకుల ద్వారా ఆమెను రూ.20 లక్షల రూపాయలు పోగొట్టారు. నిర్మలా సీతారామన్ గారి పేరుతో ఉన్న నకిలీ వీడియోను చూపించి నమ్మించి మోసం చేశారు.సైబర్ మోసాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా, కేంద్రం నుంచి ఎన్ని సూచనలు సలహాలు వచ్చినా అవేమి పట్టించుకోకుండా బాధితులు మోసపోతున్నారు. ఇన్వెస్ట్మెంట్, ఫెడెక్స్ ఫ్రాడ్ అంటూ వివిధ రకాలుగా సైబర్ నేరస్థులు ప్రజలను బురిడీ కొట్టించి …
Read More »సైబర్ మోసాలపై అప్రమత్తం కండి.. అలాంటి లింక్స్‌ను క్లిక్ చేశారో.. ఇక అంతే సంగతులు!
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. టెక్నాలజీతో పాటు సైబర్ నేరాల కూడా వేగంగానే పెరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ దాడులు జరగడం అనేది నేడు సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఇలానే ఓ రైతు తన ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంతో తన బ్యాంక్ ఖాతాలోని డబ్బులు పొగొట్టుకున్నాడు. కాగా ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అవేంటో తెలసుకుందాం పదండి..ఇటీవల కాలంలో …
Read More »అక్రమ మైనింగ్ కేసులో ఏపీ మాజీ మంత్రి కాకాణి అరెస్ట్
క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి అక్రమాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. గత కొంతకాలంగా పరారీలో ఉన్న కాకాణిని కేరళలో అదుపులోకి తీసుకున్నారు.ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణిని నెల్లూరు పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి నెల్లూరు తీసుకువచ్చే అవకాశం …
Read More »