ఓ గిరిజన మహిళపై దాడిచేసి.. ఆమెతో బలవంతంగా మానవ మలం తినిపించిన అత్యంత హేయమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బొలన్గిర్ జిల్లా బంగముండా పోలీస్ స్టేషన్ పరిధిలోని జురాబంధ్ గ్రామంలో నవంబరు 16న ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. బాధిత మహిళకు చెందిన వ్యవసాయ భూమి మీదుగా నిందితుడు ట్రాక్టర్ నడుపుతూ పంటకు నష్టం కలిగించడంతో ఆమె నిలదీసింది. ఈ క్రమంలో అతడితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆమెపై నిందితులు దాడి చేసి నోటిలో బలవంతంగా మానవ మలాన్ని కుక్కారు. వారి నుంచి …
Read More »Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్.. రెండు రాష్ట్రాల్లోనూ కమల వికాసమే!
మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–175-195 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)–85-112 సీట్లుఇతరులు–7-12 కేకే సర్వే మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)-225 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)- 56ఇతరులు-07 రిపబ్లిక్ సర్వే మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–150-170 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)–110-130 సీట్లుఇతరులు–8-10 సీట్లు మ్యాట్రిజ్ మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)–150-170 సీట్లుమహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)– 110-130 సీట్లుఇతరులు–8-10 సీట్లు పీ మార్క్ మహాయుతి(బీజేపీ-షిండే …
Read More »ఆడ ‘తోడు’ కోసం ‘టైగర్ జానీ’ అలుపెరగని ప్రయాణం.. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు 340 కి.మీ ప్రేమయాత్ర..!
ప్రేమ, విరహం మనుషులకే కాదు జంతువులకూ ఉంటుంది. అందుకు సరైన ఉదాహరణ టైగర్ జానీ అనే పెద్ద పులి. ఆడ తోడు కోసం ఈ టైగర్ అలుపెరుగని ప్రయాణం సాగిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెల రోజులుగా నడక సాగిస్తూనే ఉంది. ఇప్పటికే 340 కి.మీ దాటిన ప్రేమయాత్ర ఇంకా సాగుతూనే ఉంది. మహారాష్ట్ర అడవుల నుంచి కొండలు, గుట్టలు దాటి తెలంగాణ కవ్వాల్ అభయారణ్యంలోకి చేరుకుంది. నిర్మల్ జిల్లా సమీపంలోని మహబూబా ఘాట్ వద్ద ఈనెల 11న ఓ పులి …
Read More »మిరాకిల్: గంటన్నర పాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకున్న సైనికుడి గుండె.. !
గుండె ఆగిపోవడం అంటే దాదాపు మరణించినట్టే. కానీ, ఓ సైనికుడి గుండె 90 నిమిషాలు పాటు ఆగిపోయి.. మళ్లీ కొట్టుకుంది. వైద్యులు చేసిన కృషితో ఆ జవాన్ తిరిగి ఈ లోకాన్ని చూశాడు. ఆధునిక వైద్యశాస్త్రం చేసిన ఈ అద్భుతం ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుభాకాంత్ సాహు (24) అనే యువకుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన అతడ్ని చికిత్స కోసం అక్టోబరు 1న భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడకు తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్ట్‌కు …
Read More »ఎలాన్ మస్క్ రాకెట్ ద్వారా నింగిలోకి ఇస్రో ఉపగ్రహం జీ శాట్-20.. ప్రత్యేకతలివే
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-20 (GSAT 20) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఎలాన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ల్యాంచింగ్ ప్యాడ్ నుంచి రాకెట్ బయలుదేరిన 34 నిమిషాల అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. కొద్ది రోజుల్లో కర్ణాటక హసన్‌లో ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి …
Read More »Mahakumbh Mela: 2025లో మహాకుంభమేళా ఎప్పుడు? పుణ్య స్నానం తేదీలు గురించి తెలుసుకోండి..
మహాకుంభమేళా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహా కుంభమేళా 2025లో జరగనుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహా కుంభ మేళాలో నదీ స్నానం చేయడం వల్ల సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో 2025లో మహా కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం. కుంభమేళా అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ. దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ హరిస్తాయని నమ్మకం. కుంభమేళా సమయంలో కోట్లాది మంది …
Read More »లోన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్ల తగ్గింపు.. బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచన!
Intrest Rates: ప్రస్తుతం బ్యాంకులు వసూలు చేస్తున్న అధిక వడ్డీ రేట్ల వల్ల లోన్లు తీసుకున్న ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రుణాలపై వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకురావాలని బ్యాంకులకు సూచించారు. కేంద్ర మంత్రి సూచన మేరకు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. దీంతో రుణగ్రహీతలపై భారం తగ్గనుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు. వడ్డీ రేట్లను తగ్గించాలని బ్యాంకులకు …
Read More »బీజేపీకి బిగ్ షాక్.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ప్రాంతీయ పార్టీ
మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఏడాదికి పైగా ఆ రాష్ట్రంలో తెగల మధ్య హింసాత్మక సంఘటనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. తాజాగా ప్రభుత్వంలో భాగంగా ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ -ఎన్పీపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. అయితే ఇప్పటికే కుకీ పీపుల్స్ పార్టీ కూటమి నుంచి వైదొలగగా.. ఇప్పుడు ఎన్పీపీ కూడా అదే బాటలో బయటికి రావడం మణిపూర్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను.. పదవి నుంచి …
Read More »Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి 10 వందే భారత్ స్లీపర్ రైళ్లు, ఈ రూట్లలోనే..!
Vande Bharat Express: 2019లో రైల్వేశాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు.. సాధారణ రైళ్లతో పోల్చితే టికెట్ ధర కాస్త ఎక్కువే అయినా రైలు ప్రయాణికులకు మాత్రం వేగం, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఇక ఈ సెమీ హెస్పీడ్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య భారీ సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. రైలు ప్రయాణికుల నుంచి ఈ వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని యోచించిన రైల్వే శాఖ వచ్చే ఏడాది వాటిని …
Read More »మళ్లీ రగులుతోన్న మణిపూర్.. మంత్రులు ఇళ్లకు నిప్పు.. సీఎం నివాసంపై దాడి
మరోసారి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో నిరససలు ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నాయి. ఆందోళనలతో ఇంఫాల్ లోయ అట్టుడుకుతోంది. రాజకీయ నాయకుల నివాసాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఏకంగా సీఎం వ్యక్తిగత నివాసానికి నిప్పంటించే ప్రయత్నం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీ నేతల ఇళ్లపై ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. వీరిలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అల్లుడు రాజ్‌కుమార్ సింగ్ నివాసం కూడా ఉంది. శనివారం సాయంత్రం బీరేన్ సింగ్ ఇంటిపైనా దాడికి యత్నించడంతో …
Read More »