మరో నాలుగు దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు గురువారం (జూన్ 26) ఈ సమాచారాన్ని అందించారు. బ్రెజిల్‌తో పాటు, ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలను ప్రధాని మోదీ సందర్శిస్తారని తెలిపారు. అయితే, ప్రస్తుతానికి ప్రధాని మోదీ ప్రతిపాదిత పర్యటన గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పర్యటనలో ప్రధాన దృష్టి …
Read More »పిల్లల కోసం హెల్తీ స్వీట్ రెసిపీ.. రుచి అద్భుతంగా ఉంటుంది..! ఇలా చేస్తే పర్ ఫెక్ట్ గా వస్తాయి..!
ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయాలంటే మినప సున్నుండలు చాలా మంచి ఆప్షన్. చిన్న పిల్లల ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు, ఖనిజాలు ఇందు లో పుష్కలంగా ఉంటాయి. బాదం, జీడిపప్పు కలిపి చేసిన ఈ స్వీట్లు చాలా రుచికరంగా ఉంటాయి.ప్రతి ఒక్కరి ఇళ్లలో పిల్లల కోసం వారి ఆరోగ్యం కోసం తప్పకుండా ఒక ప్రత్యేకమైన స్వీట్ చేసి పెడుతారు. ఆ స్వీట్స్ లలో కచ్చితంగా మినప సున్నుండలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్స్. ఈ స్వీట్స్ పిల్లల ఎదుగుదలకు మంచివి. …
Read More »ఆరేళ్ల తరువాత తెరుచుకోబోతున్న కైలాష్ మానసరోవర్ యాత్ర.. చైనాతో రాజ్‌నాథ్ చర్చలు!
చైనాలోని కింగ్‌డావో నగరంలో జరిగిన SCO (షాంఘై సహకార సంస్థ) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక నిర్ణయంపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయంలో భారతదేశం- చైనా …
Read More »పిన్ కోడ్‌లోని ప్రతి డిజిట్‌కు ఒక అర్థముందని తెలుసా? దాన్ని ఎవరు కనిపెట్టారు? మొత్తం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోండి!
భారతీయ పిన్ కోడ్ వ్యవస్థ తపాలా సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. 6-అంకెల కోడ్ దేశాన్ని 9 జోన్లు, ఉప-జోన్లు, జిల్లాలు, పోస్టాఫీసులుగా విభజిస్తుంది. మొదటి అంకె జోన్‌ను, రెండవది ఉప-జోన్‌ను, మూడవది జిల్లాను, చివరి మూడు అంకెలు పోస్టాఫీసును సూచిస్తాయి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..నేటి డిజిటల్ యుగంలో ఉత్తరాలు పంపడం తగ్గిపోయినప్పటికీ, చిరునామాపై రాసే ‘పిన్ కోడ్’ ఇప్పటికీ మన రోజువారీ లావాదేవీలలో అంతర్భాగం. ఆన్‌లైన్ షాపింగ్ నుండి బ్యాంకింగ్ వరకు, ప్రభుత్వ పథకాల నుండి అత్యవసర సేవల వరకు, ప్రతిచోటా …
Read More »కన్నప్పగా మంచు విష్ణు ఎంతవరకు మెప్పించారు..?
సినిమా చరిత్రలో కొన్నిటిని క్లాసిక్స్ గా చెప్పుకుంటాం. తరాలు మారినా తరగని ఆస్తులుగా పరిగణిస్తుంటాం. అలాంటి క్లాసిక్స్ నవతరాన్ని ఎప్పుడూ ఊరిస్తూనే ఉంటాయి. ఓ సారి ట్రై చేయమని కన్నుగీటుతూనే ఉంటాయి. అలా ఊరించిన సబ్జెక్టే కన్నప్ప. రెబల్‌స్టార్ కెరీర్‌లో కలికితురాయి ఈ మూవీ. అలాంటి సబ్జెక్టును యంగ్ రెబల్ స్టార్ వదులుకుంటారా? అనే ప్రశ్నలన్నటినీ దాటి.. ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్ మీద సరికొత్తగా ల్యాండ్ అయింది. ఇంతకీ మంచు విష్ణు మలిచిన ఈ కన్నప్ప కథ ఎలా ఉంది? ప్రభాస్ పాత్ర పొందిగ్గా కుదిరిందా? …
Read More »కజకిస్తాన్ రాయబారితో నవాబ్ మీర్ కీలక భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ఎయిర్ కనెక్టివిటీ, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి హైదరాబాద్, అల్మట్టి మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని డాక్టర్ ఖాన్ ప్రతిపాదించారు. ఈ విమాన సర్వీసుల ద్వారా వైద్య, పర్యాటకానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, కజకిస్తాన్ పౌరులకు హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఆరోగ్య.. హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి కార్యాలయంలోని గౌరవ సలహాదారుడు డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ ఇటీవల ఢిల్లీలో రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి అజామత్ యెస్కరాయేవ్‌ను కలిశారు. అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన కజకిస్తాన్ రాయబారి.. ఏపీ, …
Read More »ISSతో ఫాల్కన్-9 వ్యోమనౌక డాకింగ్ విజయవంతం.. చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా
అంతరిక్షం లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరిక్ష పరిశోధ కేంద్రం ISSతో ఫాల్కన్ వ్యోమ నౌక డాకింగ్ విజయవంతం అయ్యింది. బుధవారం(జూన్ 25) శుభాంశు శుక్లా తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో చేపట్టిన ఫాల్కన్-9 విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. స్పేస్‌లో అడుగుపెట్టగానే జైహింద్.. జై భారత్ అన్న సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు. ISSలో అడుగుపెడుతున్న తొలి భారతీయుడు శుభాంశు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నా భుజాలపై త్రివర్ణ పతాకం …
Read More »నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులపాటు పిడుగులతో భారీ వర్షాలు!
వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో పాటుగా మరోక ద్రోణి కూడా విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ …
Read More »ఇక సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు.. 2026 నుంచి అమలు
ఏడాదిలో రెండు సార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) బుధవారం (జూన్ 25) ఆమోదం తెలిపింది. ఈ విధానం 2026 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. అంటే 2026 నుంచి ఏడాదికి రెండు సార్లు సీబీఎస్సీ పదో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహిస్తారన్నమాట. ఈ మేరకు ఒక విద్యా సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరు కావడానికి వీలు కల్పించే కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతుందని అధికారులు బుధవారం (జూన్ 25) తెలిపారు. కొత్త విధానం ప్రకారం …
Read More »కొత్త తరానికి ఎమర్జెన్సీ గురించి తెలియాలి.. ప్రత్యేక తీర్మానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తీర్మానాన్ని ఆమోదించారు. అంతకుముందు ఎమర్జెన్సీలో అణచివేతకు వ్యతిరేకంగా కేబినెట్ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. కొత్త తరానికి ఎమర్జెన్సీ గురించి వివరించాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అత్యవసర …
Read More »