జాతీయం

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో ఆగస్ట్‌ 30న పాఠశాలలు బంద్‌.. వరుసగా 2 రోజులు సెలవులు

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్ట్ 30న పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ కళాశాలలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని జిల్లా విద్యా అధికారిని ఆదేశించారు కలెక్టర్లు. విద్యా సంస్థలకు ఆగస్ట్‌ నెలలో చాలా సెలవులు వచ్చాయి. ఇక దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వర్షాలతో పాఠశాలలకు సెలవులు …

Read More »

జీఎస్టీలో కీలక మార్పులు.. రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందా..? సెప్టెంబర్ 3న ఏం జరగనుంది..?

ఏ రేట్లు తగ్గుతాయి.. ఏవి పెరుగుతాయి.. మోదీ చెప్పినట్లు ప్రజలు డబుల్ దీపావళి జరుపుకుంటారా..? జీఎస్టీలో కీలక మార్పులు ఉంటాయా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే చర్చ సాగుతోంది. ఈ చర్చకు మరో నాలుగు రోజుల్లో సమాధానం దొరికే అవకాశం ఉంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశంపైనే అందరి కళ్లు ఉండడానికి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోదీ చేసిన ప్రకటనే కారణం. జీఎస్టీలో కీలక సంస్కరణలు తీసుకొస్తామని.. కొన్ని వస్తువుల …

Read More »

ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరమ్‌కి హాజరైన మోడీ, ఇషిబా.. బహుళ రంగాల్లో భారీగా పెట్టుబడులు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్, చైనాల దేశాల్లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు టోక్యోకి చేరుకున్నారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత మోడీ జపాన్ లో పర్యటిస్తున్నారు. జపాన్‌తో వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత ప్రోత్సహించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం కావచ్చు. ఆగష్టు 30 వరకు జరిగే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తన జపాన్ కౌంటర్ షిగెరు ఇషిబాతో వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్ పర్యటన సందర్భంగా.. ప్రధాన మంత్రి మోడీ X లో …

Read More »

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తన నిష్కపటమైన శైలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. సీఎం యోగి ఇప్పుడు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు. సి ఓటర్ సహకారంతో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇది వెల్లడైంది. ఈ సర్వేలో 36 % మంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఇష్టపడ్డారు. దీనితో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా …

Read More »

గేట్‌ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్ష తేదీల కొత్త షెడ్యూల్‌ ఇదే

ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2026) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది.. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2026) …

Read More »

ఓరీ దేవుడో.. క‌ళాశాల‌ను ముంచేసిన వ‌ర‌ద.. విద్యార్థుల అవస్థలు చూస్తే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు విద్యార్థులు తమ బ్యాగులను తలపై మోసుకుంటూ వదల్లోంచి బయటకు వెళ్తున్నారు. హాస్టళ్లు, తరగతి గది భవనాలు వంటి లోతట్టు ప్రాంతాలలోకి నీరు ప్రవేశించటంతో సాధారణ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యా భవనాలకు ప్రవేశం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా జమ్మూలోని జీజీఎం సైన్స్ కళాశాల ప్రాంగణం మునిగిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. విద్యార్థులు కళాశాల నుంచి వ‌ర‌ద నీటిలో బ్యాగ్‌లు ప‌ట్టుకొని బ‌య‌ట‌కు …

Read More »

భారత్‌ అలా చేయకుంటే.. అమెరికా నుంచి మరో హెచ్చరిక! ఈ సారి ట్రంప్‌ సలహాదారు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్, భారత్ రష్యా నుండి ముడి చమురు దిగుమతిని ఆపకపోతే అమెరికా భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధిస్తుందని హెచ్చరించారు. భారత్ అమెరికన్ ఉత్పత్తులకు తన మార్కెట్లను తెరవడంలో మొండితనం చూపుతోందని ఆయన ఆరోపించారు. భారత్‌ రష్యా నుంచి ముడి చమురు వాణిజ్యాన్ని నిలిపివేయకుంటే భారత దిగుమతులపై విధించిన శిక్షాత్మక సుంకాలపై అమెరికా అధ్యక్షుడు తన వైఖరిని తగ్గించుకోరని డొనాల్డ్ ట్రంప్ ఉన్నత ఆర్థిక సలహాదారు హెచ్చరించారు. అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ …

Read More »

కొత్త పన్ను చట్టం.. ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుంది? పూర్తి వివరాలు..

భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను పూర్తిగా పునరుద్ధరించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పన్ను సంస్కరణ జరగడం ఇదే మొదటిసారి. 1961 నుండి అమలులో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టం ఇప్పుడు రద్దు చేశారు. ఆదాయపు పన్ను చట్టం 2025 ఇప్పుడు దాని స్థానంలో అమలు చేయనున్నారు. రాష్ట్రపతి కూడా ఈ చట్టాన్ని ఆగస్టు 21, 2025న ఆమోదించారు. ఈ కొత్త చట్టం 1 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తుంది. దీనిలో పన్ను రేట్లు మారలేదు, కానీ మొత్తం …

Read More »

PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..! 3.0 వచ్చేస్తోంది.. ఇక ఈ సేవల్ని సులభంగా..

EPFO 3.0 వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా PF ఖాతాదారులు ఏటీఎంల ద్వారా నేరుగా డబ్బును ఉపసంహరించుకోవచ్చు, UPI ద్వారా బదిలీ చేయవచ్చు. ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రక్రియ సరళీకృతం చేయబడింది, మరణ క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించబడుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల తన ప్లాట్‌ఫామ్‌ను మళ్ళీ అప్‌గ్రేడ్ చేసింది. కొత్త EPFO ​​3.0 వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుంది. ప్రావిడెంట్ ఫండ్ డబ్బు నిర్వహణ సులభతరం అవుతుంది. భారతీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, TCS …

Read More »

వరద బాధితులకు జియో, ఎయిర్‌టెల్‌ సాయం..! ఏ విధంగా అందిస్తున్నాయంటే..?

భారీ వర్షాలు, వరదలు అనేక కుటుంబాలను ప్రభావితం చేశాయి. వరద ప్రాంతంలో చిక్కుకున్న వారు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రముఖ టెలికామ్‌ సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ ఈ ప్రాంతంలో చిక్కుకున్న వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. దేశంలోని వర్షం, వరద ప్రభావిత ప్రాంతాలలోని అన్ని ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో 3 రోజుల చెల్లుబాటు పొడిగింపును ప్రకటించింది. దీనితో పాటు వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, మూడు రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను పొందుతారు. జియోహోమ్ వినియోగదారులకు, అంతరాయం …

Read More »