ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి కాశ్మీర్ లోయలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గతంలో మాదిరిగా ప్రస్తుతం పర్యాటకుల రావడంలేదని స్థానికులు చెబుతున్నారు. ఈనెల 17 నుంచి మూసీవున్న ప్రాంతాలను తిరిగి పర్యాటకుల సందర్శనార్థం అనుమతిస్తే కొంత మేర పరిస్థితి మెరుగవుతుందని అక్కడి స్థానికులు, చిరు వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు.జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత అక్కడి పర్యాటక ప్రదేశాలన్నీ మూతపడ్డాయి. భద్రతా చర్యల కారణంగా మూసివేసిన పర్యాటక ప్రాంతాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మళ్లీ తెరిచింది. దాదాపు రెండు నెలల …
Read More »రెండు విడతల్లో కుల-జనగణన.. గెజిట్ విడుదల.. ఎప్పటివరకు వరకు పూర్తవుతుందంటే..
15 ఏళ్ల తర్వాత దేశంలో జన గణన జరగనుంది. దీనికి సంబంధించింది కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 1948 జనాభా లెక్కల చట్టం (1948లో 37)లోని సెక్షన్ 3 ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుంటూ జనగణన చేపట్టాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో రెండు విడుతల్లో జన గణన జరగనుంది. 2026 అక్టోబర్ 1 నాటికి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్ లో జన గణన ప్రక్రియ ముగియనుంది. మిగతా రాష్ట్రాల్లో 2027 మార్చి 1 నాటికి జన గణన …
Read More »ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న టైమింగ్..
డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ, భారతదేశంలో దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది. నగదు రహిత లావాదేవీలను సులభతరం చేస్తూ, కోట్లాది మంది ప్రజల ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఇప్పుడు యూపీఐ వినియోగదారులకు మరో శుభవార్త. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయంతో, జూన్ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా, సమర్థవంతంగా జరగనున్నాయి. ఈ మార్పులు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లావాదేవీలు జరిపే వారికి …
Read More »నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యత, ఈ ఏడాది రక్తదాతల దినోత్సవం థీమ్ ఏమిటంటే..
రక్తదానం చేయండి.. ప్రాణదాత కండి ఈ నినాదం గురించి అందరికీ తెలిసిందే. రక్తదానాన్ని గొప్ప దానంగా భావిస్తారు. ఒక యూనిట్ రక్తంముగ్గురు జీవితాలను కాపాడుతుంది. ఇలా రక్తం దానం చేయడం వలన ప్రాణం కాపాడడమే కాదు.. ఆరోగ్యానికి కూడా లాభం. అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయంలో రక్తం అందుబాటులో లేకపోతే.. అది రోగి జీవితానికి ప్రాణాంతకం కావచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.ప్రస్తుతం అన్ని దానాల్లో కెల్లా రక్తదానం గొప్ప దానంగా పరిగణించబడుతుంది. శరీరంలో తగినంత రక్తం …
Read More »డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా.. మార్క్రామ్ కీలక ఇన్సింగ్స్‌తో 27 ఏళ్ల కల సాకారం
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లో ఆస్ట్రేలియా అందించిన 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సౌతాఫ్రికా, ఎట్టకేలకు ఐసీసీ ట్రోఫీల్లో బ్యాడ్ లక్ ముద్రను చెరిపేసుకుంది. ఈ విజయానికి హీరోగా ఐడెన్ మార్క్రామ్ (136) నిలిచాడు. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా (66)తో కలిసి 147 పరుగుల కీలక భాగస్వామ్యంతో 27 ఏళ్లను సుగమం చేశాడు. దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. శనివారం సౌతాఫ్రికా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్ ఏ ఫార్మాట్‌లోనైనా మొదటిసారి …
Read More »రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు.. విమాన ప్రమాదంపై కమిటీ
విమాన ప్రమాదం, దర్యాప్తు పురోగతి వివరాలను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అందరినీ షాక్‌కి గురి చేసిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి ముందు పైలట్ మేడే కాల్ చేశారని తెలిపారు.అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం 241 మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే.. ఈ విమాన ప్రమాదంపై విమానయాన శాఖ వివరణ ఇచ్చింది. విమాన ప్రమాదం, దర్యాప్తు పురోగతి వివరాలను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాకు …
Read More »మరోసారి ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే?
ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న గడువును మళ్లీ పొడిగించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న గడువు నేటితో (జూన్ 14) ముగియనుండగా దానిని మరో సంవత్సరం పాటు పొడగిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2026 జూన్ 14వ వరకు అదార్ ఉచిత అప్‌డేట్ గడువును పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ సంస్థ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా ప్రకటన జారీ చేసింది ఈ ప్రకటనకు సంబంధించిన …
Read More »కరోనా కేసులు పెరుగుతున్నాయ్.. జర జాగ్రత్త..! రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..
కనుమరుగై పోయిందనుకుంటున్న వేళ కరోనా రీ ఎంట్రీ మళ్లీ కలకలం రేపుతోంది. కొత్త రూపంలో పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులే అందుకు నిదర్శనం. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. NB.1.8.1, LF.7 అనే కరోనా వేరియంట్స్ ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే.. జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో …
Read More »దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి.. భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించిన భారత్!
దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ అడుగుపెట్టింది. డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ ‘భార్గవాస్త్రను భారత్ విజయంతంగా పరీక్షించింది. డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు భారత్ ఈ వ్యవస్థ రూపొందించింది. గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి దీనిని విజయవంతంగా పరీక్షించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఇది ఫిక్స్ చేసిన టార్గెట్‌లను విజయవంతంగా చేరుకుందని అధికారులు వెల్లడించారు.భార్గవాస్త్ర అనేది సూక్ష్మ క్షిపణి ఆధారిత కౌంటర్-డ్రోన్ సిస్టమ్, ఇది డ్రోన్ల నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి రూపొందించబడింది. ఈ బార్గవాస్త్ర రక్షణ రంగంలో …
Read More »వాయిదా వేసిన సీఏ పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్.. మే 16 నుంచి పునఃప్రారంభం
దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల మే 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తాజాగా ప్రకటించింది. తాజాగా దేశంలో భద్రతా పరిస్థితులకు సంబంధించి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో..ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల …
Read More »