జాతీయం

పహల్గామ్‌లో పురుషులే లక్ష్యంగా ఉగ్రదాడి.. ముగ్గురు తెలుగు వారితో సహా మొత్తం ఎంత మంది మరణించారంటే..

ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ మంగళవారం జరిగిన ఉగ్రదాడితో ఒక్కసారిగా ఉల్కిపడింది. ప్రకృతి అందాల నడుమ సంతోషంగా కొన్ని రోజులు గడిపేందుకు వెళ్ళిన పర్యాటకుల జీవితంలో మరచి పోని రోజుగా మిగిలింది. పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 30 మంది మరణించినట్లు.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిని కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ గా చేసుకున్నారు. స్థానిక యువకుడితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళిన పర్యాటకులు మరణించారు. మరణించిన వారిలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందినవారున్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాల్లోకి వెళ్తే..జమ్మూ …

Read More »

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్‌ హస్తం.. టూరిస్టులపై కాల్పులు జరిపిన ముష్కరుడి ఫొటో విడుదల..

పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాది మొదటి చిత్రాన్ని పోలీసులు పంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం పర్యాటకులపై దాడి చేసిన వారిలో ఈ ఉగ్రవాది పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకరు.. అతను ఆయుధాలు పట్టుకుని పఠానీ సూట్ ధరించి కనిపించాడు.ఉగ్రదాడితో.. జమ్మూ కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, వాయుసేన బలగాలు కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. పహల్‌గామ్‌ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.. ఆర్మీ, డ్రోన్ల సాయంతో భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. …

Read More »

పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఆగ్రదేశాధి నేతలు.. ట్రంప్, పుతిన్‌ సహా పలువురి స్పందన ఇదే

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పుల్వామా దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌ లోయలో జరిగిన మరో అతి పెద్ద దాడి ఇదే. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. నిషేధిత లష్కరే తోయిబా …

Read More »

సౌదీ గగనతలంలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. 3 యుద్ధ విమానాల ఎస్కార్ట్‌తో అపూర్వ స్వాగతం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నారు. సౌదీలో ప్రధాని మోదీకి ఆపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని విమానానికి రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన F15 విమానం భద్రత కల్పించింది. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. సౌదీ అరేబియాను విశ్వసనీయ స్నేహితుడుగా, వ్యూహాత్మక మిత్రదేశంగా ఆయన అభివర్ణించారు. 2019లో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పడినప్పటి నుండి, ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన విస్తరణ …

Read More »

వావ్‌.. వాటే ఐడియా గురూ.. సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంట్లో మొక్కల అద్దె ట్రెండ్

ఈ వేసవిలో కొత్త గ్రీన్ ట్రెండ్ బాగా నడుస్తోంది. వేసవి వేడిని చల్లబరిచేందుకు హైదరాబాద్, విజయవాడలో ఇలాంటి ఓ సరికొత్త ఐడియా జనాలను ఆకర్షిస్తోంది. మొక్కల అద్దె సేవలు! ఇంటిని అందంగా, చల్లగా మార్చే ఈ ట్రెండ్ యువతలో సందడి చేస్తోంది? ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే మొక్కలు మీ ఇంటికి చేరతాయి.. సీజన్ తర్వాత తిరిగి తీసుకెళతారు. ఈ పర్యావరణ హిత ఆలోచన గురించి పూర్తిగా తెలుసుకోండి!మొక్కల అద్దె.. ఒక్క క్లిక్‌తో మీ ఇంటికి మొక్కలు డెలివరీ! Ugaoo, Greenly లాంటి వెబ్‌సైట్లు, స్థానిక …

Read More »

‘ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం’.. RSS చీఫ్ భగవత్ సామాజిక ఐక్యతా మంత్రం

అలీఘర్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్న RSS చీఫ్ మోహన్ భగవత్ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ కుల విభజన నిర్మూలనకు ‘అందరకీ ఒకే ఆలయం, ఒకే బావి, ఒకే శ్మశానం’ అనే సూత్రాన్ని అవలంభించాలని పిలుపునిచ్చారు. తద్వారా సామాజిక ఐక్యత సాధ్యమవుతుందని అన్నారు..హిందూ సమాజంలోని కుల విభజనలను తొలగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం (ఏప్రిల్‌ 20) ఓ కార్యక్రమంలో అన్నారు. కుల విభజన నిర్మూలనకు ‘అందరకీ ఒకే ఆలయం, ఒకే …

Read More »

యువనేతకు అరుదైన గుర్తింపు.. గ్లోబల్ యంగ్ లీడర్‌‌గా రామ్మోహన్ నాయుడు..!

భారతదేశపు అతి పిన్న వయస్కుడైన కేబినెట్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది.. 2025 సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) గ్లోబల్ యంగ్ లీడర్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈ జాబితాలో రామ్మోహన్ నాయుడుకు చోటు దక్కింది. ప్రపంచంలోని అత్యంత చైతన్యవంతమైన, దూరదృష్టి గల నేతగా నిలిచారు. ప్రభావవంతమైన మార్పుని కలిగించే వినూత్న పాలన ఉద్దేశ్యంతో ప్రజా సేవలో …

Read More »

నేడే జేఈఈ మెయిన్‌ తుది ర్యాంకుల విడుదల.. కటాఫ్‌ ఎంత ఉంటుందంటే?

జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌-1 (బీఈ/ బీటెక్‌) పరీక్షలు, ఏప్రిల్‌ 9వ తేదీన పేపర్‌-2ఏ, 2బీ (బీఆర్క్‌/బీ ప్లానింగ్‌) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని …

Read More »

వేసవిలో ముక్కు నుంచి రక్తం ఎందుకు కారుతుంది?.. దీన్ని నిర్లక్ష్యం చేస్తే డేంజర్

వేసవిలో ముక్కు నుంచి రక్తం కారడానికి ప్రధాన కారణం వేడి. వేడి గాలి వల్ల ముక్కు లోపలి పొరలు ఎండిపోతుంటాయి. ఇది పగుళ్లకు దారితీస్తుంది. తక్కువ తేమ, అలెర్జీలు, డీహైడ్రేషన్ లేదా ముక్కు గోకడం కూడా కారణాలు కావచ్చు. అయితే, ఇలా ఎక్కువ రోజులు జరుగుతున్నా, రక్తస్రావం ఎక్కువగా అనిపించినా వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సమస్యకు కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..వేసవిలో ముక్కు నుంచి రక్తస్రావం నివారించడానికి రోజూ 2-3 లీటర్ల నీరు, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం …

Read More »

ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ కోసం ప్రధాన మంత్రి ముద్ర యోజన ఎలా ఉపయోగపడుతోంది?

ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) భారత మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించడం ద్వారా, ఈ పథకం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. పేదరికాన్ని తగ్గించడంలోనూ, దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను పెంచడంలోనూ PMMY కీలక పాత్ర పోషిస్తోంది. ఇది మహిళలకు ఆర్థిక గౌరవాన్ని అందిస్తుంది.భారత దేశంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. …

Read More »