జాతీయం

జీవిత, ప్రమాద బీమాపై జీఎస్టీ ఎత్తేయండి… నిర్మలా సీతారామన్‌కు గడ్కరీ రిక్వెస్ట్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌పై అనేక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై విధించిన జీఎస్టీని ఉప-సంహరించుకోవాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన విజ్ఞ‌ప్తి మేరకు ఆర్థిక మంత్రికి ఈ లేఖ రాస్తున్నట్లు గడ్కరీ …

Read More »

161కి చేరిన వాయనాడ్ మృతులు.. వారికోసం రంగంలోకి ఆర్మీ జాగిలాలు

ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ వయనాడ్‌లోని మెప్పడిలో నాలుగు గ్రామాలపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకూ 161 మంది చనిపోయారు. శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నారు. ఈ బాధితులను కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సహా రాష్ట్ర యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద, బురద ప్రవాహంలో కొందరు కొట్టుకుపోగా.. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్లంతైన వారికోసం డ్రోన్లు, జాగిలాలతో అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో …

Read More »

ఐటీఆర్ గడువు పొడిగింపుపై.. ఐటీ శాఖ కీలక ప్రకటన.. 

 ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు ఇవాళ్టితో గడువు పూర్తవుతుంది. తమ అకౌంట్ ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులందరూ జులై 31, 2024లోపు రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది. జులై 30వ తేదీ వరకు 6 కోట్లకుపైగా ట్యాక్స్ పేయర్లు తమ రిటర్నులు ఫైల్ చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ ఇంకా చాలా మంది తమ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అయితే, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తడం ద్వారా రిటర్న్స్ దాఖలు చేయలేకపోతున్నట్లు గత కొన్ని రోజులుగా ట్యాక్స్ …

Read More »

పెన్షన్ల విషయంలో మోదీ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రూ.2 లక్షలు ఫైన్

Supreme Court: కేంద్ర ప్రభుత్వం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయడంలో చేస్తున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన సైనిక అధికారులకు వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌ పథకం ప్రకారం.. పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా మండిపడింది. ఈ వన్ ర్యాంక్ వన్ పెన్షన్లపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని సుప్రీం కోర్టు తీవ్రంగా విమర్శించింది. ఈ వ్యవహారంలో నరేంద్ర మోదీ సర్కార్‌కు చివరి అవకాశం ఇస్తున్నట్లు …

Read More »

బడ్జెట్‌లో చిన్నారుల కోసం కేంద్రం కొత్త స్కీమ్..

NPS Vatsalya Tax Benefits: 2024 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కొత్త స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం NPS వాత్సల్య పథకం తీసుకొచ్చారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ అకౌంట్ తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయిన తర్వాత ఈ అకౌంట్ సాధారణ ఎన్‌పీఎస్ అకౌంట్‌గా మారుతుంది. పిల్లల భవిష్యత్ కోసం ముందు నుంచే పెట్టుబడుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీం తీసుకొచ్చారు. …

Read More »

ఆర్‌బీఎల్ బ్యాంకు కీలక నిర్ణయం..?

ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఆర్‌బీఎల్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. రూ. 3 కోట్లకు లోబడిన బ్యాంకు డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను తీసుకొచ్చింది. 2024, జులై 29 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపైనా వడ్డీ రేట్లు సవరించింది. ఇది మాత్రం జులై 1 నే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు సవరించిన తర్వాత ఈ బ్యాంకులో అత్యధికంగా 500 రోజుల …

Read More »

తుడిచిపెట్టుకుపోయిన 4 గ్రామాలు.. వయనాడ్ కొండ చరియల విధ్వంసం.. ఆ 250 మంది సంగతేంటో?

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు చేపట్టి.. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇక తమ కుటుంబ సభ్యులు, బంధువుల ఆచూకీ తెలియక చాలా మంది దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్నారు. మరోవైపు.. శిథిలాల కింద చిక్కుకున్న వారు కూడా తమను కాపాడాలంటూ ఫోన్లు చేస్తుండటం గమనార్హం. సహాయక సిబ్బందికి తోడు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగడంతో.. వయనాడ్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. …

Read More »

దుబాయే కాదు భారత్‌లోనూ టాక్స్ ఫ్రీ స్టేట్.. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సందర్భంగా.. కొత్త ఆదాయపు పన్ను విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. స్టాండర్డ్ డిడక్షన్ పెంచి.. ఇదే సమయంలో పన్ను శ్లాబుల్లోనూ మార్పులు చేసింది. ఇక దేశంలో ఒక పరిమితి దాటి సంపాదించే డబ్బుపై.. ప్రభుత్వానికి ఇన్‌కంటాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పాత, కొత్త ఆదాయపు పన్ను విధానాల్లో.. ఎంత ఆదాయానికి ఎంత పన్ను అని టాక్స్ శ్లాబులు ఉంటాయి. ఆ రేట్లను బట్టి పన్ను చెల్లించాలి. ఎంత ఎక్కువ సంపాదిస్తే కట్టాల్సిన టాక్స్ అలా పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే …

Read More »

విద్యుత్ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌గా.. ఏపీ మాజీ ప్రధాన న్యాయమూర్తి.. 

తెలంగాణలో ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఛైర్మన్‌గా గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమిస్తూ.. మంగళవారం (జులై 30న) ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ మదన్ బీ లోకూర్.. 2011లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. మొదట నియమించిన జస్టిస్ నర్సింహా రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్‌‌గా జస్టిస్ మదన్ …

Read More »

మను భాకర్ ఖాతాలో మరో పతకం.. 

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ మరోసారి మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. సరబ్జోత్ సింగ్‌తో కలిసి బరిలోకి దిగిన భాకర్.. వరుసగా రెండో ఈవెంట్‌లోనూ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కాగా.. ఈ రెండూ మను భాకర్ సాధించినవే కావడం విశేషం. సోమవారం జరిగిన …

Read More »