జాతీయం

సిబిల్ స్కోర్ నిబంధనలలో మార్పు.. ఆర్బీఐ యాక్షన్ ఆర్డర్!

ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు పొందాలంటే CIBIL స్కోర్ తప్పనిసరి. చాలా బ్యాంకులలో బ్యాంకు రుణాలను నిర్ణయించడానికి సిబిల్‌ స్కోర్‌ని ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆర్బీఐ కొన్ని కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త ఆర్‌బిఐ నిబంధనలతో సిబిల్ స్కోర్‌లను పొందడంలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని అంటున్నారు. ఈ దశలో సిబిల్‌ స్కోర్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రధాన మార్పులు ఏమిటో చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త నియమం ప్రకారం, బ్యాంకులు, …

Read More »

ఫేమస్‌ రెస్టారెంట్‌లో మంటలు.. భవనం పై నుంచి దూకిన ప్రజలు..

ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో గల ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించటంతో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడ నుండి దూకడం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 10కి పైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హుటాహుటిన మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. రాజౌరీ గార్డెన్‌ మెట్రో స్టేషన్‌కు ఎదురుగా ఉన్న జంగిల్‌ జంబోరీ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. నివేదికల ప్రకారం, …

Read More »

ఇలాంటి వారితో జాగ్రత్త.. ఫ్రెండ్‌షిప్‌ చేశారో బతుకు బస్టాండే! బీ కేర్ ఫుల్

నిత్యం మన జీవితంలో రకరకాల వ్యక్తులు తారసపడుతుంటారు. కానీ వీరిలో కొందరితోనే మనం కనెక్ట్ అవుతాం. మరికొందరిని దూరం నుంచే చూసి తప్పుకుంటారు. ఇంకొందరుంటారు.. ఇలాంటి వారితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పొరబాటున ఫ్రెండ్ షిప్ చేశారో బతుకు బస్టాండే..ధన సముపార్జన ద్వారా ఏ మనిషీ జ్ఞాని కాలేడు. కొందరైతే ఉన్నత పదవుల్లో ఉండి చాలా సంపాదిస్తారు.. కానీ ఎప్పుడూ తెలివితక్కువ పనులు చేస్తుంటారు. ఈ కారణంగా వీరిని ఎల్లప్పుడూ మూర్ఖులుగా పరిగణించబడతారు. కాబట్టి మన చుట్టూ ఈ ఐదు గుణాలున్న వ్యక్తులు ఉంటే …

Read More »

ఏఐ జమానా.. ఎగబడి కోర్సుల్లో జాయిన్ అవుతున్న విద్యార్థులు

2024-25 అకడమిక్ సెషన్‌లో 4,538 పాఠశాలల నుండి దాదాపు 7,90,999 మంది విద్యార్థులు సెకండరీ స్థాయిలో (IX , X తరగతులు కలిపి) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సుల కోసం నమోదు చేసుకున్నారు. సీనియర్ సెకండరీ స్థాయిలో (XI, XII తరగతులు కలిపి), 944 పాఠశాలల నుండి 50,343 మంది విద్యార్థులు AIని ఎంచుకున్నారు. ఈ గణాంకాలను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. AI విద్య యొక్క ప్రాముఖ్యతను కేంద్రమంత్రి జయంత్ చౌదరి వివరించారు. 2019లో …

Read More »

సేవింగ్‌ ఖాతాలో ఎంత డిపాజిట్‌ చేయొచ్చు.. ఆదాయపు పన్ను కొత్త నిబంధనలు

సేవింగ్స్ ఖాతాలలో పెట్టుబడి పెట్టే ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను శాఖ పైన పేర్కొన్న నిబంధనలను అనుసరించి డిపాజిట్ చేయాలి. ఈ పరిమితులకు మించి లావాదేవీలు జరిగితే సంబంధిత బ్యాంకులు ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తాయి.. ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రజలు తమ బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో రోజుకు ఎంత డబ్బు జమ చేసుకోవచ్చో.. ఏడాదిలో ఎంత డబ్బు జమ చేసుకోవచ్చో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో …

Read More »

ఆధార్ కార్డులాగా విద్యార్థులకు అపార్‌ కార్డ్‌.. దీని ప్రయోజనం ఏంటి?

APAAR ID Card: సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్‌ కార్డును అందజేయాలని యోచిస్తున్నారు. ఈ అపార్‌ చాట్‌లో ఆధార్ కార్డ్ వంటి 12 అంకెల సంఖ్య ఉంటుంది. కార్డులో విద్యా సమాచారాన్ని నిల్వ చేస్తుంది..ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు. ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు.. ప్రతి పనికి ఆధార్‌ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా కొన్ని పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు …

Read More »

మందుబాబులరా.. విస్కీలో బీరు కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..?

ఇలా చాలా మంది మద్యానికి బానిసలుగా మారుతున్నారు. అయితే, మీరు కూడా మరీ బానిసలు కాకపోయినా అప్పుడప్పుడు మందు తీసుకుంటున్నారా..? అయితే, ఇది మీకు తెలుసా..? బీరుతో విస్కీ లేదా వైన్ మిక్స్ చేస్తే ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే.. మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, మందుబాబులు మాత్రం ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అది వైన్, విస్కీ …

Read More »

హమ్మయ్య.. ఒక్క రోజే రెండు విమానాల్లో సాంకేతిక లోపం.. సేఫ్ ల్యాండింగ్

సోమవారం ఒక్కరోజే రెండు విమానాల్లో సాంకేతిక సమస్య ఏర్పడగా.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. రెండు ఘటనల్లోనూ ప్రయాణీకులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయలుదేరిన ఓ ప్రైవేటు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. గగనతలంలో స్పైస్ జెట్ విమానం ఓ పక్షిని ఢీకొంది. దీంతో విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో పట్నా‌లోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ఉదయం 8.52 గంటంలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. విమానంలోని ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రయాణీకులను షిల్లాంగ్‌కు పంపేందుకు …

Read More »

ఏం మనుషులురా బాబు.. దేవుడు కూడా భరించలేని బాధ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆంజనేయస్వామి శిలా విగ్రహం!

స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీ మందిర్‌లో రికార్డ్ చేయబడిందని సమాచారం. వీడియో వైరల్ కావడంతో ఈ అద్భుతాన్ని చూడటానికి భక్తులు పోటెత్తారు. ఈ వీడియో నిజమా లేదా నకిలీదా అని తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజలలో తారాస్థాయికి చేరుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఈ ఆలయానికి చేరుకుని ఘటనను పరిశీలించారు.సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోలు చాలా వరకు ప్రజల్ని ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. వాటిలో కొన్ని మనల్ని షాక్‌కు గురిచేసేవిగా కూడా ఉంటాయి. ఇప్పుడు అలాంటి …

Read More »

IRCTC వెబ్‌సైట్‌ సేవలకు అంతరాయం.. రైల్వే ప్రయాణీకుల అవస్థలు

IRCTC ఆన్‌లైన్ ఈ-టికెట్ బుకింగ్ సేవలకు సోమవారం ఉదయం తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటకు పైగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐఆర్‌సీటీసీకి చెందిన వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లో రైల్వే టిక్కెట్ల బుకింగ్ కుదరలేదు. టిక్కెట్ల క్యాన్సలేషన్ కూడా సాధ్యంకాలేదు. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే IRCTC వెబ్‌సైట్ నిలిచిపోయింది. దీంతో తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురైయ్యారు. వెబ్‌సైట్‌లో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని, అందువల్ల మరో 1 గంట వరకు …

Read More »