జాతీయం

కర్ణాటక సీఎంపై ఈడీ కేసు.. సిద్ధరామయ్య భార్య సంచలన నిర్ణయం

ముడా భూముల (MUDA Scam) వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి బీఎన్ పార్వతి (BN Parvathi) కీలక ప్రకటన చేశారు. తమకు ముడా పరిధిలో కేటాయించిన స్థలాలను తిరిగి అప్పగించేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అవినీతి మరకలేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న 14 స్థలాలను తిరిగి ముడాకు ఇచ్చేస్తున్నట్లు పార్వతి వెల్లడించారు. అంతేకాదు, ముడా భూముల వ్యవహారంలో వస్తోన్న అన్ని ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని …

Read More »

ఐఐటీ, నీట్‌లాంటి ప్రఖ్యాత సంస్థల్లో చదివి.. సాఫ్ట్‌వేర్ జాబ్‌లు కాదని.. ఏఈఈ ఉద్యోగాలకు మొగ్గు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. కార్పొరేట్ సెక్టార్‌లో ఐదంకెల జీతం.. హైఫై లైఫ్.. వారంలో రెండ్రోజులు హాలీడే, విదేశీ ట్రిప్పులు ఇలా చాలా సౌకర్యాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఉంటాయి. దీంతో చాలా మంది యువత బీటెక్‌లు చదివి సాఫ్ట్‌వేర్ రంగం వైపు మెుగ్గుచూపుతారు. గత పదేళ్లుగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సాఫ్ట్‌వేర్ రంగంపై వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీన్ మారుతోంది. కోట్ల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే.. సెక్యూరిటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగాల వైపు యువత …

Read More »

ఆధునిక హంగులతో కొత్త ఎన్‌సీఏ.. బెంగళూరులో ప్రారంభించిన బీసీసీఐ

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐ.. బెంగళూరులో తమ కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. అయితే ఈ కొత్త ఎన్‌సీఏకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (బీసీఈ)గా పేరుపెట్టారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి జైషా పలువురు ఇతర ఆటగాళ్లతో కలిసి ఈ సెంటర్‌ను ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వాస్తవానికి ఇప్పటివరకు జాతీయ క్రికెట్ అకాడమీని.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో నిర్వహించేవారు. కానీ తాజాగా కెంపెగౌడ విమానాశ్రయానికి …

Read More »

భారీగా పెరిగి ఒక్కసారిగా పతనమైన అంబానీ స్టాక్స్.. మళ్లీ లోయర్ సర్క్యూట్.. ఇన్వెస్టర్లకు నష్టం!

Anil Ambani’s Reliance Shares: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి అలర్ట్. దిగ్గజ కంపెనీ స్టాక్స్ ఇవాళ ఒక్కసారిగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ.. రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (ADAG) షేర్లు పడిపోతున్నాయి. ఇటీవల అప్పుల్ని తీర్చేయడం సహా నిధుల సమీకరణ వంటి ఇతర ప్రణాళికల నేపథ్యంలో.. గ్రూప్ స్టాక్స్ అన్నీ వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. రిలయన్స్ పవర్ స్టాక్ ప్రతి రోజూ అప్పర్ సర్క్యూట్ …

Read More »

అంతా అద్దెలకే పోతుంది.. అక్కడ 2Bhk రెంట్ నెలకు రూ. 1.35 లక్షలు.. అడ్వాన్స్ 4 లక్షలు.. ఎలా కట్టేది?

2BHK Apartment Rents: దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడితే ముందుగా ముంబై గురించి మాట్లాడుతుంటారు. అక్కడ బహుళ అంతస్తుల భవనాలే దర్శనం ఇస్తుంటాయని చెప్పొచ్చు. ఇక ఇళ్ల లేదా ఫ్లాట్స్ అమ్మకాలు అక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి. ధరలు కూడా భారీగానే పలుకుతుంటాయి. ముంబై తర్వాత ఢిల్లీ- NCR, బెంగలూరు, పుణె, చెన్నై ఇలా మాట్లాడుకుంటుంటారు. అయితే కొంత కాలంగా ఈ పరిస్థితి మారిపోయింది. బెంగళూరులో మార్కెట్ క్షీణిస్తూ వస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ అమాంతం పుంజుకొని దేశ ఆర్థిక రాజధాని అయిన …

Read More »

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు.. ముడా స్కామ్‌లో అరెస్ట్ తప్పదా!

MUDA Case: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ-ముడా భూముల కుంభకోణం.. కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో స్వయంగా సీఎం సిద్ధరామయ్యపైనే కేసు నమోదు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముడా కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యను తాజాగా ఈ కేసులో నిందితుడిగా లోకాయుక్త పేర్కొంది. ఈ కేసులో ఏ1గా సిద్ధరామయ్య పేరును ఎఫ్ఐఆర్‌లో పేరు నమోదు చేశారు. సిద్ధరామయ్యతోపాటు ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామితోపాటు మరో వ్యక్తి పేరును నిందితుల జాబితాలో చేర్చింది. ఈ …

Read More »

కేంద్రంలో టీడీపీ ఎంపీకి కీలక పదవి.. మరో బీజేపీ ఎంపీకి అవకాశం

ఏపీలో కూటమికి చెందిన ఇద్దరు ఎంపీలకు రెండు కీలకమైన పదవులు దక్కాయి. ఇద్దరికి పార్లమెంటు స్థాయీసంఘాల ఛైర్మన్‌ పదవులు దక్కాయి. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల స్థాయీసంఘం ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని నియమించారు. రైల్వేశాఖ స్థాయీసంఘం ఛైర్మన్‌గా అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ను విడుదల చేసింది. అలాగే పర్యాటక, రవాణా, సాంస్కృతిక స్థాయీసంఘం ఛైర్మన్‌గా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈసారి ఆ పదవి కోల్పోయారు. టీడీపీ ఎంపీ కేశినేని …

Read More »

ఇక ఈజీగా లోన్లు.. క్రెడిట్ స్కోరు, శాలరీతో పనిలేదు.. ఇన్‌కం ప్రూఫ్ అక్కర్లేదు.. ఆర్బీఐ కీలక ప్రకటన!

RBI Loans: ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కోసం చాలా మంది లోన్ల వైపు చూస్తుంటారు. కొన్నింట్లో ప్రాసెస్ ఈజీగానే ఉన్నప్పటికీ.. కొన్నింట్లో మాత్రం లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇంకా డాక్యుమెంటేషన్ అవసరం పడుతుంది. అర్హతలు సరిపోవు. ఆదాయం సరిపోదు. సిబిల్ స్కోరు సరిగా లేదన్న కారణంతో లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురికావొచ్చు. ఈ రోజుల్లో చాలా మంది లోన్లు ఈజీగానే వేగంగానే పొందుతున్నారు. అయితే అందరు మాత్రం కాదు. అన్ని డాక్యుమెంట్లు లేకుండా.. సరైన క్రెడిట్ హిస్టరీ లేకుండా …

Read More »

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.లడ్డూ తయారీ కల్తీ బాధకరమ్నారు. వక్ప్‌ బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదేనన్నారాయన. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ పర్యటనల క్రమంలో ఆయన కామెంట్స్‌ కలకలం రేపాయి. 28న JPC హైదరాబాద్‌కు రాబోతుంది. వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఇవ్వాళ్టి నుంచి అక్టోబర్‌ 1 వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు …

Read More »

వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ చలాన్లు ఎక్కువగా ఉన్నాయా, అయితే షాక్!

Traffic Violations: రోడ్లపై ట్రాఫిక్‌ రూల్స్‌ను ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తున్నా కొందరు వాహనదారులు మాత్రం దారికి రావడం లేదు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ వేల రూపాయల ఫైన్లు బండిపై ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి.. వాహనదారుల నుంచి ట్రాఫిక్ చలాన్ల సొమ్ము వసూలు చేస్తున్నాయి. తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన పంపించారు. ట్రాఫిక్ చలాన్లు …

Read More »