జాతీయం

గాడిద పాల పేరుతో రైతులకు కుచ్చు టోపీ.. రూ.9 కోట్లు దోచేసిన ఏపీకి చెందిన సంస్థ

గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థ నిండా ముంచేసింది. మొత్తం 200 మంది సామాన్య రైతుల నుంచి ఏకంగా రూ.9 కోట్లు దండుకుంది. చివరకు ఇది బోగస్ అని తేలడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి.. మూడు నెలల కిందట ‘జెన్ని మిల్క్‌’ అనే పేరుతో ఓ సంస్థ ఏర్పాటుచేశాడు. హొసపేటెలోని హంపీ రోడ్డులో హంగూ ఆర్భాటాలతో దీనిని ప్రారంభించి.. ఉద్యోగులను నియమించుకున్నాడు. గాడిద పాల వ్యాపారం చేస్తే లక్షాధికారులు …

Read More »

కేంద్రం కీలక నిర్ణయం.. పీఎఫ్ విత్ డ్రా లిమిట్ పెంపు.. ఒకేసారి రూ.1 లక్ష తీసుకోవచ్చు!

PF Withdrawal: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లకు అదిరే శుభవార్త అందించింది కేంద్రం. ఉద్యోగులు ఇకపై తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా మంగళవారం వివరాలు వెల్లడించినట్లు హిందుస్తాన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతా నుంచి ఒకసారి గరిష్ఠంగా రూ.50 వేలు మాత్రమే ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని రూ.1 లక్షకు …

Read More »

జమ్మూ కశ్మీర్‌‌ అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు.. మొదలై తొలి విడత పోలింగ్

జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిసారిగా 2014లో అక్కడ శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 స్థానాలుండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడతలో 24 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొదటి విడతలో వివిధ పార్టీలకు చెందిన 219 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 23 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో భద్రతా …

Read More »

హమ్మయ్యా.. తగ్గిన బంగారం ధర.. వెండి రూ.1000 డౌన్.. 

బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. నాలుగు రోజుల పాటు వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన పసిడి ధరలు ఇవాళ దిగివచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు రికార్డ్ గరిష్ఠాల నుంచి తగ్గుముఖం పడుతున్న క్రమంలో దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతోనూ కొనుగోళ్లు కాస్త స్తబ్దుగా కొనసాగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పండగల సీజన్ మొదలైన క్రమంలో దేశీయంగా బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఆగస్టు …

Read More »

కేంద్రం కీలక నిర్ణయం.. విండ్ ఫాల్ ట్యాక్స్ ఎత్తివేత.. 

Petrol Price: అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టిన క్రమంలో దేశీయం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న క్రూడ్ పెట్రోలియంపై (ముడి చమురు)పై విండ్ ఫాల్ ట్యాక్స్ ఎత్తివేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటన చేసింది. అంటే దేశీయంగా ఉత్పత్తి చేసిన ముడి చమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకు చేస్తు సవరణలు …

Read More »

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు..

మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుపై రూ.2 చొప్పున కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అప్పటి నుంచి లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.107.41 వద్ద కొనసాగుతోంది. ఇక లీటర్ డీజిల్ ధర రూ.95.65 వద్ద స్థిరంగా ఉంది. ప్రాంతాలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో కాస్త తేడాలు ఉంటాయి.

Read More »

ఎఫ్‌డీ చేసే వారికి బెస్ట్ ఆప్షన్.. ఈ బ్యాంకుల్లో 9 శాతం వడ్డీ.. రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?

FD Rates: స్థిరమైన రాబడి పొందాలనుకునే వారికి వెంటనే గుర్తుకు వచ్చేది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits). ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేని రాబడిని అందించే మదుపు మార్గం ఫిక్స్‌డ్ డిపాజిట్లు అని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో డిపాజిట్లను పెంచుకునేందుకు బ్యాంకులు సైతం మంచి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా 60 ఏళ్ల వయసు లోపు ఉండే జనరల్ కస్టమర్లకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తూ.. 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు …

Read More »

3 నెలల్లో 4 కొత్త సర్వీసులు ప్రారంభం.. రామ్మోహన్ నాయుడా మజాకా!

ఏపీ వాసులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మో్హన్ నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే గన్నవరం నుంచి దుబాయి, సింగపూర్‌లకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి మీద స్పెషల్ ఫోకస్ పెడతామన్న మంత్రి.. విజయవాడ నుంచి విమాన ప్రయాణికుల సంఖ్యను పెంచుతామన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో అప్రోచ్ రహదారిని, విజయవాడ- ఢిల్లీ ఇండిగో సర్వీసును మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్లు …

Read More »

3 ఏళ్లకే లక్షకు రూ.7 లక్షలొచ్చాయ్.. ఇప్పుడు 3 షేర్లకు 1 షేరు ఫ్రీ..

టెక్స్ టైల్ సెక్టార్ కంపెనీ అక్షిత కాటన్ లిమిటెడ్ ( Axita Cotton Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. బోనస్ షేర్ల జారీ ప్రకటన చేసింది. ఈ బోనస్ షేర్లు జారీకి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించిది. అలాగే గతంలో నిర్ణయించిన రికార్డు తేదీ సెప్టెంబర్ 16ను సెప్టెంబర్ 20 కి మార్చినట్లు పేర్కొంది. అలాగే ఈ కంపెనీ షేరు గత మూడేళ్లో 561 శాతం మేర పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ …

Read More »

అంబానీ, అదానీ కానేకాదు.. దేశంలో బెస్ట్ కంపెనీగా ఆ టెక్ సంస్థ..!

ఈ సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాను విడుదల చేసింది టైమ్స్ మ్యాగజైన్. టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024 పేరుతో లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1000 కంపెనీలను చేర్చింది. టైమ్ బెస్ట్ కంపెనీల లిస్టులో ఈసారి భారత్‌ నుంచి మొత్తంగా 22 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. అయితే, దేశీయ కంపెనీలలో బెస్ట్ కంపెనీగా ఏ అదానీ సంస్థనో, ముకేశ్ అంబానీ సంస్థనో ఉంటుందని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. దిగ్గజ సంస్థలన్నింటినీ వెనక్కి నెట్టి ఓ …

Read More »