జాతీయం

బంగారం కొనాలనుకునే వారికి భారీ షాక్..

అనుకున్నదే జరిగింది. ఊహించినట్లుగానే.. బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని అనుకున్నట్లుగానే చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్క ప్రకటనతోనే గోల్డ్ రేట్లు ఎగబాకుతున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు.. కిందటి రోజు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ద్రవ్యోల్బణం అదుపలోకి వస్తున్న క్రమంలో.. కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో త్వరలోనే చైనా కేంద్ర బ్యాంకు కూడా ఇదే బాటలో వడ్డీ రేట్లను తగ్గించనుంది. ఇక ఇప్పటికే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను సెప్టెంబర్ సమీక్షలోనే తగ్గించనున్నట్లు ఇప్పటికే …

Read More »

రాజీనామాకు సిద్ధం!

కొందరికి కుర్చీపైనే ఆశ.. బెంగాల్‌ సీఎం మమత వ్యాఖ్యలు మెడికోల ఆందోళన వెనక రాజకీయాలు ఉన్నాయని విమర్శ కోల్‌కతా, సెప్టెంబరు 12: స్థానిక ఆర్‌జీ కర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై ఆందోళన చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు గురువారం కూడా తమ వైఖరిని సడలించుకోలేదు. చర్చలకు రావాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానించినప్పటికీ వారు సానుకూలంగా స్పందించలేదు. వరుసగా మూడో రోజు కూడా ప్రభుత్వం, జూనియర్‌ డాక్టర్ల మధ్య చర్చలు జరగలేదు. దీనిపై మమత స్పందిస్తూ ”సామాన్యులకు న్యాయం చేయడం కోసం పదవిని వదులుకోవడానికి …

Read More »

పిల్లల చదువు, పెళ్లికి బెస్ట్ ప్లాన్.. ఒకేసారి చేతికి రూ.28 లక్షలు.. సెప్టెంబర్ 30 వరకే ఛాన్స్

పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారమనే చెప్పాలి. ఈ క్రమంలో చాలా మంది పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పాలసీ అందిస్తోంది. అదే ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్. ప్రస్తుతం ఈ పాలసీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే ఇందులో సేవింగ్స్ బెనిఫిట్స్‌తో పాటు బీమా కవరేజీ లభిస్తోంది. ఇందులో మనీ బ్యాంక్ …

Read More »

మాజీ ప్రిన్సిపల్ భారీ కుట్రదారు.. సీబీఐ సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై మాజీ ప్రిన్సిపల్‌ ప్రొ. సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సందీప్ ఘోష్‌‌పై సీబీఐ తరఫు లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని తవ్వితీయాల్సిన అవసరం ఉందని వివరించారు. సందీప్ ఘోష్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన …

Read More »

‘నచ్చింది కొనుక్కోండి.. నా క్రెడిట్ కార్డు వివరాలివే’.. వ్యాపారవేత్త ఆఫర్ కోసం ఎగబడిన జనం!

Bold Care: ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. దీంతో మోసాలు సైతం పెరిగాయి. ఈ క్రమంలో తమ కార్డుల వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని ప్రభుత్వాలు, బ్యాంకులు, ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి. తమ కార్డు వివరాలు బహిర్గతమయితే వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి బ్లాక్ చేయిస్తుంటారు. కానీ, ఓ వ్యాపారవేత్త ఏకంగా తన క్రెడిట్ కార్డు వివరాలను ఆన్‌లైన్‌లోనే పెట్టేశాడు. తన కార్డును ఉపయోగించుకుని మీకు నచ్చింది కొనుక్కోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో …

Read More »

తోడేళ్లు కనిపిస్తే కాల్చిపారేయండి.. యోగి సర్కార్ సంచలన ఆదేశాలు

UP Govt: గత కొన్ని రోజులుగా ఉత్తర్‌ప్రదేశ్‌లో తోడేళ్ల దాడులు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. కనిపించిన వారిపై కనిపించినట్లే దాడులు చేయడంతో ఇప్పటివరకు 10 మంది మృత్యువాతపడ్డారు. మరో 30 మందికిపైగా తోడేళ్ల దాడుల్లో గాయపడ్డారు. ఇక చనిపోయిన 10 మందిలో 9 మంది చిన్న పిల్లలే కావడం తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా తోడేళ్లు చేస్తున్న దాడులను నివారించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని తోడేళ్లను అధికారులు పట్టుకోగా.. మరికొన్ని మాత్రం …

Read More »

ఆ 2000 నోట్లన్నీ ఇక చిత్తు కాగితాలేనా? RBI మరో కీలక ప్రకటన.. 

Rs 2000 Notes: రూ.2 వేల కరెన్సీ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి కీలక ప్రకటన చేసింది. చలామణి నుంచి ఉపసంహరించుకున్నప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి 97.96 శాతం రూ.2000 కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపింది. ఇంకా ప్రజల వద్ద రూ.7261 కోట్లు విలువైన పెద్ద నోట్లు ఉన్నాయని తెలిపింది. మే 19, 2023 రోజున చలామణి నుంచి 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాటిని మార్చుకునేందుకు …

Read More »

కేంద్రం నుంచి రూ.250 కోట్ల ఆర్డర్.. దూసుకెళ్లిన స్టాక్.. లక్ష పెడితే రూ.6 లక్షలు!

Oriana Power: స్మాల్ క్యాప్ కేటగిరి పవర్ సెక్టార్ స్టాక్ ఒరియానా పవర్ లిమిటెడ్ షేరు ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో 5 శాతం మేర లాభపడి అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ నుంచి భారీ ఆర్డర్ దక్కించుకున్నట్లు ప్రకటించిన క్రమంలో ఈ కంపెనీ షేర్ పరుగులు పెట్టింది. కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. అలాగే ఈ కంపెనీ షేరు గత ఆరు నెలల కాలంలోనే ఏకంగా 171 …

Read More »

ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. ఈ వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటాక శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో 10 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం భూభాగంలోకి వచ్చాక వేగం 20 కిలోమీటర్లకు పెరిగింది. ప్రసుత్తం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ (మహారాష్ట్ర) వైపు కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రుతుపవన ద్రోణి వాయుగుండం కేంద్రం …

Read More »

సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్.. వరదలపై ఆరా, ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుందని, తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. కేంద్ర …

Read More »