జాతీయం

AP donation to Wayanad: కేరళకు అండగా ఏపీ.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం

కేరళలోని వయనాడ్‌లో ఇటీవల సంభవించిన విపత్తు.. వందల కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో సుమారుగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. మరెంతో మంది కనిపించకుండా పోయారు. ప్రకృతి ప్రకోపంలో అనాథలుగా, అభాగ్యులుగా మిగిలిన వారెందరో. అయితే ఈ విపత్తు వేళ కేరళ ప్రభుత్వానికి ఏపీ అండగా నిలిచింది. వయనాడ్ బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.10 కోట్లు విరాళంగా ప్రకటించింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి విరాళంగా అందించింది. అయితే …

Read More »

India Post GDS Merit List 2024 Live : తపాలశాఖలో 44,228 ఉద్యోగ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం..

India Post GDS Merit List 2024 Live : కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియా పోస్ట్ 2024 గత నెలలో 44,228 గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు.. తెలంగాణలో 981 Gramin Dak Sevak పోస్టుల వరకు ఉన్నాయి. అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 5వ తేదీన గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ …

Read More »

పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు.. మూడు దశల్లో పోలింగ్

రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి.. జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీల ఎన్నికల తేదీలను ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లో 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోలింగ్ సెప్టెంబరు 18న రెండో విడత సెప్టెంబరు 25న, మూడో విడత అక్టోబరు 1న నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ …

Read More »

TCS: ఏఐతో ఐటీ ఉద్యోగాలు పెరుగుతాయా? తగ్గుతాయా? భవిష్యత్తు సంగతేంటి? టీసీఎస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు

TCS President V Rajanna: గత కొంత కాలంగా దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థలు నియామకాలు తగ్గించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ఐటీకి డిమాండ్ తగ్గిన నేపథ్యంలోనే కొత్తగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ చేపట్టకపోగా.. ఉన్న ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకున్నాయన్న సంగతి తెలిసిందే. భారత దిగ్గజ ఐటీ సంస్థలు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా అన్ని సంస్థల్లోనూ గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా దీనికి ఒక కారణం. మరోవైపు …

Read More »

బాధితురాలిని హత్యాచారం చేసిన చోటును ఫోటోలతో సహా చూపించండి.. హైకోర్టు ఆదేశాలు

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై ఈ నెల 8 వ తేదీన జరిగిన రేప్, మర్డర్‌ ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా సీరియస్ అయింది. ఇక ఈ హత్యాచార ఘటనపై ఆ రాష్ట్రంలో మొదలైన ఆందోళనలు, నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బుధవారం అర్ధరాత్రి ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ …

Read More »

Tax Deductions: తెలుగు రాష్ట్రాల్లోని వారిపై ఐటీ శాఖ గుర్రు.. నోటీసులు, పెనాల్టీ.. ఐటీఆర్ ఫైలింగ్‌లో ఇలా చేస్తున్నారా?

Tax Notices: ఆర్థిక వ్యవస్థలో పన్ను అనేది చాలా కీలకం. పరిమితికి మించి ఆదాయం ఉన్నట్లయితే వారు ఆదాయపు పన్ను చట్టం కింద టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. దీనికి ఆదాయాన్ని బట్టి నిర్దిష్ట శ్లాబ్స్ ఉంటాయి. దాని ప్రకారం అంత శాతం మేర పన్ను కట్టాలి. అయితే ఈ పన్ను తగ్గించుకునేందుకు కొన్ని పెట్టుబడులపై టాక్స్ మినహాయించుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఇదే అదునుగా కొందరు తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టడం లేదా సరైన వివరాలు సమర్పించకుండా టాక్స్ క్లెయిమ్ చేస్తుంటారు. తప్పుడు టాక్స్ డిడక్షన్ (తగ్గింపు) …

Read More »

Reliance Share: అంబానీ కంపెనీ అదుర్స్.. అప్పుడు వందల కోట్ల నష్టం.. ఇప్పుడు సీన్ రివర్స్.. దూసుకెళ్తున్న స్టాక్!

Reliance Power Shares: దిగ్గజ పారిశ్రామిక వేత్త, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ నుంచి చాలానే స్టాక్స్ ఉన్నాయి. అయితే ఇవి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. తర్వాత అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోవడంతో దాదాపు చాలా కంపెనీలు దివాలా స్థాయికి కూడా పడిపోయాయి. బ్యాంకులకు అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తన దగ్గర సంపదేం లేదని ఆయన కూడా చేతులెత్తేశారు. దీంతో ఆయా స్టాక్స్ పడిపోయాయి. కానీ కొంతకాలంగా పరిస్థితి మారిపోతోంది. ఆయన కంపెనీలు క్రమక్రమంగా కోలుకుంటున్నాయి. వ్యాపారాలు మెరుగుపడుతున్నాయి. అంబానీ …

Read More »

జమ్మూ కశ్మీర్‌‌ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడే షెడ్యూల్

మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు మీడియాను సమావేశానికి ఆహ్వానించింది. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 30లోగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో మిగతా మూడు రాష్ట్రాలతో పాటు కశ్మీర్‌లోనూ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇక, హరియాణా అసెంబ్లీకి నవంబరు 3తోనూ.. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు …

Read More »

14 వేల మంది ఆదివాసీ చిన్నారులతో జాతీయ గీతాలాపన.. గిన్నిస్ రికార్డుల్లోకి భారతీయుడి ఆర్కెస్ట్రా

ప్రపంచ ప్రముఖ సంగీత దర్శకుడు, మూడుసార్లు గ్రామీ విజేత రిక్కీ కేజ్‌ (Ricky Kej).. స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొని అద్భుతమైన వీడియోను రూపొందించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా సహా సంగీత దిగ్గజాల సహకారంతో భారత జాతీయగీతం జనగణమనను (National Anthem) వైవిధ్యభరితంగా ఆలపించారు. బ్రిటిష్‌ ఆర్కెస్ట్రా, 14వేల మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించిన ఈ గీతాలాపన.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను రిక్కీ కేజ్‌ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్‌ చేశారు. పండిట్ హరిప్రసాద్‌ …

Read More »

ఢిల్లీకి చంద్రబాబు.. హడావిడిగా వెళ్తున్న ఏపీ సీఎం, రేవంత్ కూడా హస్తినలోనే.. ఎందుకంటే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజుల పాటూ ఆయన హస్తినలో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళతారు.. 16, 17న అక్కడే ఉంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటూ పలువుర్ని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుకు …

Read More »