జమ్మూకశ్మీర్ శాంతి భద్రతలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌లో ఈ మధ్య కాలంలో ఉగ్రదాడులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల దాడులను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్ స్పెషల్ డీజీగా నియమించింది. సెప్టెంబర్ 30వ తేదీ ప్రస్తుతం డీజీగా ఉన్న ఆర్ఆర్ స్వైన్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన రిటైర్‌మెంట్ తర్వాత నళిన్ ప్రభాత్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. …
Read More »మహిళా ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం కానుక.. ప్రతి నెలా ఒకరోజు నెలసరి సెలవు
Odisha Govt Announced menstrual leave: నెలసరి సమయంలో మహిళలు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే సాటి మహిళలే వాటిని అర్థం చేసుకోగలరు. పైపెచ్చు ఉద్యోగం చేసే వారయితే ఆ సమయంలో వచ్చే చిరాకుకు తోడు పని ఒత్తిడి వారిని మరింత చికాకు పెడుతూ ఉంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు ప్రతి నెలా ఒక రోజు నెలసరి సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒడిశాలోని ఉద్యోగినులకు ఆ …
Read More »కోల్‌కతాలో అర్ధరాత్రి అనూహ్య పరిణామం.. వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆస్పత్రి ధ్వంసం
కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచారం ఘటనపై మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం అర్ధరాత్రి 11.55 గంటలకు ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్ర్యం’ పేరుతో ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో ఆర్జీ కార్ హాస్పిటల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయాలయ్యాయి. డజన్లుకొద్దీ గుర్తుతెలియని వ్యక్తులు ఆస్పత్రిలోకి చొరబడే …
Read More »జగన్ ఆస్తుల కేసులో సంచలనం.. విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం కోర్టు జడ్జి
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసుల విచారణలో కీలక పరిణామం జరిగింది. జగన్ ఆస్తుల కేసులో ప్రమేయం ఉన్న భారతి సిమెంట్ కార్పొరేషన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలుచేసిన కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్‌కుమార్ తప్పుకొన్నారు. గతంలో తెలంగాణ హైకోర్టు జగన్ ఆస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్థతినే అనుసరించాలని తెలిపింది. …
Read More »భారత్ బలమేంటో తెలుసా.. ఒత్తిడి, అవరోధాలను జయించి విజయం సాధించే మార్గమిదే: శ్రీశ్రీ రవిశంకర్
భారత్ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న ఈ శుభ తరుణంలో.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ కీలక సందేశం ఇచ్చారు. యువతకు, ప్రతి పౌరుడికి స్ఫూర్తినిచ్చే సూచనలు చేశారు. దేశానికి ఇప్పుడు ‘ఆధ్యాత్మిక విప్లవం’ కావాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక విప్లవం అంటే ఏమిటో, ఒత్తిడిని, అవరోధాలను జయించి ఎలా ముందుకు కదలాలో వివరించారు. శ్రీశ్రీ రవిశంకర్ సందేశం పూర్తి పాఠం ఆయన మాటల్లో.. ‘మన దేశం సౌందర్యం దాని వైవిధ్యంలోనే ఉంది. భారత ఉపఖండం విభిన్న …
Read More »గురుకుల విద్యార్థినికి అరుదైన అవకాశం.. ఎర్రకోటలో వేడుకలకు కేంద్రం ఆహ్వానం
78వ స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. ఈ వేడుకలకు దేశం నలుమూల నుంచి ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. వివిధ రంగాల్లో ప్రత్యేక సేవలు అందించటం ద్వారా గుర్తింపు పొందిన సామాన్యులను.. అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించటం ఆనవాయితీ. అయితే.. ఆ ప్రత్యేక అతిథుల జాబితాలో తెలంగాణకు చెందినవాళ్లు కూడా ఉండటం విశేషం. అతిథుల జాబితాలో రైతు ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు.. అంగన్‌వాడీ కార్యకర్తలు.. ఆశా కార్యకర్తలు.. విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. సామాజిక కార్యకర్తలు.. ఇలా చాలామందే ఉన్నారు. దేశ …
Read More »ఎంతకు తెగించార్రా.. ఆయోధ్యలో రూ.50 లక్షలు విలువైన లైట్స్ చోరీ!
ఉత్తర్ ప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్యలో భారీ చోరీ చోటుచేసుకుంది. రామమందిర సమీపంలోని భక్తిపథ్, రామ్ పథ్‌లో ఏర్పాటుచేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రొజెక్టర్ లైట్స్‌తో పాటు వేలాది వెదురు బొంగులు చోరీకి గురయినట్టు తెలిపిన పోలీసులు.. వీటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. అత్యంత భద్రత ఉండే అయోధ్యలోనే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. దాదాపు 4 వేల లైట్స్‌ని దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. ఈ ఘటనపై రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఆగస్టు 9వ తేదీన కేసు …
Read More »గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియమాకం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామాకాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ ఎమ్మెల్సీల నియమాకాల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలన్న పిటిషనర్ అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే… గవర్నర్, ప్రభుత్వ హక్కులను హరించినట్లే అవుతుందని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్రల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడం ప్రభుత్వ విధి …
Read More »ఐటీఆర్- 1, 2, 3లో.. ఎవరికి ‘రీఫండ్’ త్వరగా వస్తుంది? ఆలస్యమైతే ఏం చేయాలి?
Tax Refunds: గత ఆర్థిక సంవత్సరం 2023-24 (అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి సంబంధించి 7 కోట్లకుపైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. వారంతా ఇప్పుడు తమ ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి రీఫండ్స్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే, చాలా మందికి ఇంకా రీఫండ్ జమ కావడం లేదు. ఐటీ రిటర్నులు దాఖలు చేసేందుకు ఐటీఆర్-1 ఫారం, ఐటీఆర్-2, ఐటీఆర్-3 ఫారం ఎంచుకుంటారు. మీరు ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 ఎంచుకున్నట్లయితే ఇప్పటి …
Read More »చెన్నై టు విశాఖపట్నం వయా సికింద్రాబాద్.. ఆ బ్యాగు అక్కడికి చేరింది, ఆ దొంగ మంచి చేసినట్లేనా!
చెన్నై టు సికింద్రాబాద్ ఏంటి.. బ్యాగు విశాఖకు చేరడం ఏంటి అనుకుంటున్నారా?.. అవును సినిమా రేంజ్‌లో ఓ స్టోరీ జరిగింది. ఓ ఉద్యోగికి సంబంధించి బ్యాగు కహానీ ఇది. చెన్నైలో మొదలై సికింద్రాబాద్ మీదుగా విశాఖపట్నానికి చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన కార్తికేయన్‌కు హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. ఈనెల 8న యువకుడు ఉద్యోగంలో చేరేందుకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో కాట్పాడి నుంచి సికింద్రాబాద్ బయలుదేరాడు. రైలులో కార్తికేయన్ నిద్రలోకి జారుకున్నారు.. ఆ తర్వాత కొంతసేపటికి లేచి చూస్తే అతడి బ్యాగు మాయమైంది. నిద్రలేచిన కార్తికేయన్.. …
Read More »