తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడిన ‘దానా’ తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుఫాను పరదీప్‌కు దక్షిణ తూర్పు దిశలో 330 కిలోమీటర్లు, ధమ్రాకు 360 కి.మీ., సాగర ద్వీపానికి (పశ్చిమబెంగాల్) 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాను ఉత్తర, పశ్చిమ దిశగా తీరానికి చేరువవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతోవాయువ్య దిశగా దూసుకొస్తున్న ఈ తుఫాను.. పశ్చిమ్ బెంగాల్-ఒడిశా మధ్య పూరీ-సాగర్ ఐల్యాండ్‌కు సమీపంలోని భితార్‌కనిక-ధమ్రా వద్ద గురువారం …
Read More »Insurance: దీపావళి గాయాలకూ ఉందో ఇన్సూరెన్స్.. ఈ షార్ట్ టర్మ్ పాలసీ తెలుసా?
Insurance: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, వాహన బీమా వంటివి అందరికి తెలుసినవే. అయితే వాటిల్లో తాత్కాలిక ఇన్సూరెన్స్ సైతం ఒకటి ఉంది. వీటినే షార్ట్ టర్మ్ పాలసీలుగా పిలుస్తారు. రోజుల వ్యవధి నుంచి ఏడాది కాలం లోపు ఉండే ఇన్సూరెన్స్ పాలసీలను షార్ట్ టర్మ్ ఇన్సూరెన్స్‌గా చెబుతారు. బీమా తీసుకున్నప్పుడు అది ఆర్థిక భద్రత కల్పిస్తుంది. అయితే దీపావళి వంటి పండగల సమయంలో టపాసులు కల్చినప్పుడు గాయాలైతే సైతం బీమా రక్షణ పొందవచ్చని మీకు …
Read More »Petrol Price: కేంద్రం కీలక నిర్ణయం.. విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దు.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!
Petrol Price: దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ముడి చమురుపై విధించే విండ్ ఫాల్ ట్యాక్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ముడి చమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు విండ్ ఫాల్ ట్యాక్స్ రద్దు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు మొదలు పెట్టిందని ప్రధాన మంత్రి సలహాదారు తరుణ్ కపూర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ విండ్ ఫాల్ ట్యాక్సుకు ప్రాధాన్యం తగ్గిపోయిందని …
Read More »దూసుకొస్తున్న ‘దానా’.. ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు ముప్పు.. అలర్ట్ చేసిన ఐఎండీ
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా అనంతరం బుధవారం ఉదయానికి తుఫానుగా మారింది. ఇప్పటికే ఈ తుఫానుకు ‘దానా’ అనే పేరును ఐఎండీ సూచించగా… గురువారం తెల్లవారుజామున (అక్టోబరు 24) ఇది తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని సాగర్ ఐల్యాండ్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 720 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ-ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉన్న ఈ తుఫాను గత ఆరు గంటలుగా గంటకు …
Read More »Cyclone Dana: దానా తుఫాను ఎఫెక్ట్.. 4 రోజులపాటు స్కూళ్లకు సెలవులు
Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి.. అల్పపీడనంగా మారి క్రమంగా వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఆ తర్వాత అతి తీవ్ర తుఫానుగా మారనుంది. దీనికి దానా తుఫాను అని ఇప్పటికే భారత వాతావరణ శాఖ పేరు పెట్టింది. ఇక ఈ దానా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఉండనుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే …
Read More »MK Stalin: ప్రతీ జంట 16 మంది పిల్లల్ని కనండి.. చంద్రబాబు వ్యాఖ్యలకు స్టాలిన్ మద్దతు
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన స్టాలిన్.. ప్రతీ ఒక్కరు 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేశాయని.. అయితే దాని వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయి, లోక్‌సభ నియోజకవర్గాలు కూడా తగ్గుతున్నాయని తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటులో …
Read More »SGB: ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు!
SGB: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక ప్రకటన చేసింది. తమ బ్యాంకులో సావెరిన్ గోల్డ్ బాండ్, ఆర్‌బీఐ బాండ్లు కొనుగోలు చేసిన వారికి కీలక సూచన చేసింది. ఇప్పటి వరకు వడ్డీ డబ్బులు రాని వారు, తమ బాండ్లు మెచ్యూరిటీ పూర్తయిన వారు, మెచ్యూరిటీ సమయానికి దగ్గరగా ఉన్న వారు వెంటనే తమ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి తమ బ్యాంక్ ఖాతాను వెరిఫై చేసుకోవాలని సూచించింది. అందుకు 5 రోజుల సమయం ఇచ్చింది. ఈ గడువులోపు …
Read More »CNG Price: వాహనదారులకు అలర్ట్.. ‘సీఎన్‌జీ గ్యాస్’ ధర పెంపు.. కిలోపై ఎంత పెరగనుందంటే?
CNG Price: ప్రస్తుతం పెట్రోల్ ధరలు రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. దీంతో చాలా మంది సీఎన్‌జీ గ్యాస్ వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే, ఇప్పుడు వారికి సైతం ధరల షాక్ తగలనుంది. దేశీయంగా వెలికి తీస్తున్న సహజ వాయువు (సీఎన్‌జీ) సరఫరా తగ్గిపోతోంది. దీంతో గిరాకీని అందుకునేందుకు విక్రయ సంస్థలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. విదేశాల నుంచి ఎక్కువ మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో దేశీయంగా ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడిందని రిటైల్ విక్రయ సంస్థలు చెబుతన్నాయి. విదేశాల్లో …
Read More »తమిళనాడులో వైసీపీ మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్.. హత్య కేసులో నిందితుడిగా, వీడియో వైరల్!
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొస్తున్నారు. శ్రీకాంత్‌ని కారులో ఎక్కిస్తున్న సమయంలో మాట్లాడారు. తాను డాక్టర్‌నని.. ప్రాణాలు పోయడమే తప్ప ప్రాణాలు తీయడం చేతకాదంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ …
Read More »శబరిమలకు వెళ్లలేని అయ్యప్ప భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త
శబరిమల అయ్యప్ప ఆలయంలో నవంబరు 16 నుంచి మండల పూజలు ప్రారంభం కానున్నాయి. నెలవారీ పూజల కోసం అక్టోబరు 17న ఆలయం తెరుచుకోగా.. వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. మూడు రోజుల అనంతరం ఆదివారం సాయంత్రం ఆలయాన్ని మూసివేశారు. ముందు రెండు రోజులతో పోల్చితే ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. ఇదిలా ఉండగా, అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రత్యేకంగా ఓ రేడియోను ప్రారంభించనుంది. ‘రేడియో హరివరాసనం’ పేరుతో ఆన్‌లైన్ రేడియో సర్వీసులను త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. భౌతికంగా శబరిమలకు రాలేని …
Read More »