UPI Transactions: దేశీయ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ పేమెంట్లు అగ్రస్థానంలో ఉన్నాయి. కిరాణా దుకాణం నుంచి హాస్పిటల్స్ బిల్లుల వరకు యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం రోజువారీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఎక్కుగా వాడుతోంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ పద్ధతే. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా క్యూఆర్ కోడ్, మొబైల్ నంబర్ ఉపయోగించి ఉచితంగా ఒకరి నుంచి మరొకరు డబ్బులు పంపించుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో చిల్లర సమస్యకు ఓ పరిష్కారం దొరికిందని చెప్పవచ్చు. రోజుకు కోట్లలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్న క్రమంలో యూపీఐ …
Read More »మళ్లీ తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. నిధిపై రెండో విడత సర్వే
Puri Jagannath Temple: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. ఇప్పటికే కొన్ని నెలల క్రితం పూరీ ఆలయంలో తొలి విడత సర్వే నిర్వహించగా.. తాజాగా రెండో విడత సర్వేను భారత పురావస్తు శాఖ-ఏఎస్‌ఐ అధికారులు శనివారం ప్రారంభించారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సర్వేలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేవతల దర్శనం కోసం వచ్చే భక్తులను నిలిపివేయనున్నారు. ఒడిశా రత్న భాండాగారంలోని నిధి నిక్షేపాలను వెలికితీయడం, సంపద …
Read More »తిరుపతి లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా.. దేశంలో వేరే సమస్యలు లేవా, సీమాన్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ ఇటీవల వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోకి తిరుమల లడ్డూ వివాదం తెగ చర్చనీయాంశంగా మారింది. దీంతో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు తిరుపతి లడ్డూపైనే చర్చ జరుగుతోంది. దేశంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, తిరుమల పవిత్రతకు భంగం కల్గించారని తీవ్ర …
Read More »తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతోంది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో.. జాతీయస్థాయి నేతలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా ఈ వివాదంపై స్పందించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల బాలాజీ భారత్‌పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడని.. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ ప్రతి భక్తుడినీ ఆందోళన కలిగిస్తుంది అన్నారు. ఈవిషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై క్షుణ్ణంగా …
Read More »తిరుపతి లడ్డూ వ్యవహారం.. ఏఆర్ డెయిరీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ అంశం హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ . ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన ట్యాంకర్లలోనే కల్తీ నెయ్యి వచ్చినట్లు తేలిందని.. స్వయానా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడించారు. ల్యాబ్ టెస్టుల్లో ఈ విషయం తేలిందన్నారు. …
Read More »విండ్‌ఫాల్ టాక్స్ ఎత్తివేత.. నెక్ట్స్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపే! పెట్రోలియం శాఖ అధికారి క్లారిటీ..
ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా తగ్గి సుమారు 3 సంవత్సరాల దిగువకు కూడా పడిపోయాయి. పలు అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు దోహదం చేశాయి. అక్కడ చమురు రేట్లు భారీ స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు ఉత్పత్తులపై విండ్‌ఫాల్ టాక్స్ సున్నాకు చేర్చింది. అంతకుముందే పెట్రోల్, డీజిల్ సహా ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ సున్నాగా ఉండగా.. క్రూడాయిల్‌పై మాత్రం విండ్‌ఫాల్ టాక్స్ …
Read More »మహిళలకు శుభవార్త.. ప్రతీ నెల అకౌంట్లలోకి రూ.2100, విద్యార్థినులకు స్కూటీలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 7 గ్యారెంటీల పేరుతో ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేయగా.. తాజాగా బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించింది. హర్యానా వాసులకు కాంగ్రెస్ 7 గ్యారెంటీలు ఇవ్వగా.. బీజేపీ 20 హామీల వర్షం కురిపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా.. సంకల్ప్ పత్ర పేరుతో 20 పాయింట్ల వాగ్దానాలను ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను పూర్తిగా …
Read More »తగ్గేదేలా అంటున్న బీఎస్‌ఎన్‌ఎల్.. హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం BSNL సర్వత్రా పేరిట కొత్త టెక్నాలజీ ఆగయా!
BSNL Sarvatra Technology : టెలికాం ఇండస్ట్రీలో BSNL దూసుకుపోతోంది. తమ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. సుదూర ప్రాంతాల వినియోగదారులకు కూడా హోమ్ ఫైబర్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు కృషి చేస్తోంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి ప్రధాన ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇప్పటికే తమ టెలికాం, ఫైబర్ వినియోగదారులకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. ఈ టెలికం ప్రొవైడర్లకు పోటీగా BSNL ‘సర్వత్ర’ టెక్నాలజీ (Sarvatra Technology) పేరిట మరో టెలికార రంగంలో మరో విప్లవం సృష్టించాలని ప్రయత్నాలు …
Read More »జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో వేలు పెట్టిన పాక్.. తమదీ, కాంగ్రెస్‌దీ ఒకే వైఖరి అని వెల్లడి
జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. అందులో ఏ దేశం జోక్యం అవసరం లేదని భారత్ ఎన్నిసార్లు చెప్పినా.. పాకిస్తాన్ మాత్రం తన మంకుపట్టు వీడటం లేదు. తరచూ భారత్‌కు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకుంటూ.. చీవాట్లు తింటోంది. అయినా మళ్లీ మళ్లీ మన దేశ అంతర్గత విషయాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ …
Read More »అమెరికా కోర్టు సంచలన నిర్ణయం.. భారత్‌కు సమన్లు జారీ!
ఖలీస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో సివిల్ దావా వేశారు. ఈ దావాను విచారణకు చేపట్టిన అమెరికా కోర్టు.. భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. సదరన్ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు.. భారత ప్రభుత్వం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ సమత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాలకు సమన్లు జారీ అయినట్టు అంతర్జాతీయ …
Read More »