జాతీయం

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తన నిష్కపటమైన శైలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. సీఎం యోగి ఇప్పుడు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు. సి ఓటర్ సహకారంతో ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇది వెల్లడైంది. ఈ సర్వేలో 36 % మంది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఇష్టపడ్డారు. దీనితో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా …

Read More »

గేట్‌ 2026 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్ష తేదీల కొత్త షెడ్యూల్‌ ఇదే

ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2026) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది.. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌ 2026) …

Read More »

ఓరీ దేవుడో.. క‌ళాశాల‌ను ముంచేసిన వ‌ర‌ద.. విద్యార్థుల అవస్థలు చూస్తే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు విద్యార్థులు తమ బ్యాగులను తలపై మోసుకుంటూ వదల్లోంచి బయటకు వెళ్తున్నారు. హాస్టళ్లు, తరగతి గది భవనాలు వంటి లోతట్టు ప్రాంతాలలోకి నీరు ప్రవేశించటంతో సాధారణ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యా భవనాలకు ప్రవేశం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా జమ్మూలోని జీజీఎం సైన్స్ కళాశాల ప్రాంగణం మునిగిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. విద్యార్థులు కళాశాల నుంచి వ‌ర‌ద నీటిలో బ్యాగ్‌లు ప‌ట్టుకొని బ‌య‌ట‌కు …

Read More »

భారత్‌ అలా చేయకుంటే.. అమెరికా నుంచి మరో హెచ్చరిక! ఈ సారి ట్రంప్‌ సలహాదారు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్, భారత్ రష్యా నుండి ముడి చమురు దిగుమతిని ఆపకపోతే అమెరికా భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధిస్తుందని హెచ్చరించారు. భారత్ అమెరికన్ ఉత్పత్తులకు తన మార్కెట్లను తెరవడంలో మొండితనం చూపుతోందని ఆయన ఆరోపించారు. భారత్‌ రష్యా నుంచి ముడి చమురు వాణిజ్యాన్ని నిలిపివేయకుంటే భారత దిగుమతులపై విధించిన శిక్షాత్మక సుంకాలపై అమెరికా అధ్యక్షుడు తన వైఖరిని తగ్గించుకోరని డొనాల్డ్ ట్రంప్ ఉన్నత ఆర్థిక సలహాదారు హెచ్చరించారు. అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ …

Read More »

కొత్త పన్ను చట్టం.. ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుంది? పూర్తి వివరాలు..

భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను పూర్తిగా పునరుద్ధరించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పన్ను సంస్కరణ జరగడం ఇదే మొదటిసారి. 1961 నుండి అమలులో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టం ఇప్పుడు రద్దు చేశారు. ఆదాయపు పన్ను చట్టం 2025 ఇప్పుడు దాని స్థానంలో అమలు చేయనున్నారు. రాష్ట్రపతి కూడా ఈ చట్టాన్ని ఆగస్టు 21, 2025న ఆమోదించారు. ఈ కొత్త చట్టం 1 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తుంది. దీనిలో పన్ను రేట్లు మారలేదు, కానీ మొత్తం …

Read More »

PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..! 3.0 వచ్చేస్తోంది.. ఇక ఈ సేవల్ని సులభంగా..

EPFO 3.0 వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా PF ఖాతాదారులు ఏటీఎంల ద్వారా నేరుగా డబ్బును ఉపసంహరించుకోవచ్చు, UPI ద్వారా బదిలీ చేయవచ్చు. ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రక్రియ సరళీకృతం చేయబడింది, మరణ క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించబడుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల తన ప్లాట్‌ఫామ్‌ను మళ్ళీ అప్‌గ్రేడ్ చేసింది. కొత్త EPFO ​​3.0 వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుంది. ప్రావిడెంట్ ఫండ్ డబ్బు నిర్వహణ సులభతరం అవుతుంది. భారతీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, TCS …

Read More »

వరద బాధితులకు జియో, ఎయిర్‌టెల్‌ సాయం..! ఏ విధంగా అందిస్తున్నాయంటే..?

భారీ వర్షాలు, వరదలు అనేక కుటుంబాలను ప్రభావితం చేశాయి. వరద ప్రాంతంలో చిక్కుకున్న వారు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రముఖ టెలికామ్‌ సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ ఈ ప్రాంతంలో చిక్కుకున్న వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. దేశంలోని వర్షం, వరద ప్రభావిత ప్రాంతాలలోని అన్ని ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో 3 రోజుల చెల్లుబాటు పొడిగింపును ప్రకటించింది. దీనితో పాటు వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, మూడు రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను పొందుతారు. జియోహోమ్ వినియోగదారులకు, అంతరాయం …

Read More »

ట్రంప్‌ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!

భారత ఆర్థిక వ్యవస్థ 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం 20.7 ట్రిలియన్ డాలర్లు చేరుకోవచ్చు. అధిక పొదుపు, పెట్టుబడులు, అనుకూల జనాభా వంటి అంశాలు దీనికి కారణం. 2038 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 34.2 ట్రిలియన్‌ డాలర్ల GDPతో ‍ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని, 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం పరంగా 20.7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని …

Read More »

నిరుద్యోగులకు అలర్ట్‌.. దక్షిణ రైల్వేలో 3518 ఉద్యోగాలు! రాత పరీక్షలేకుండానే ఎంపిక

దక్షిణ రైల్వే.. చెన్నైలోని రైల్వే రీజియన్లలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాక్ట్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 3518 యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్‌, వెల్డర్‌, పెయింటర్‌, ఎంఎల్‌టీ, కార్పెంటర్‌, ఎంఎంవీ, ఎంఎంటీఎం, మెషినిస్ట్‌, టర్నర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, వైర్‌మెన్‌ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 26, 2025వ తేదీ …

Read More »

ఇంటలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు!

ఇంటలిజెన్స్ బ్యూరో (IB) ఇప్పటికే వరుసగా పలు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II, టెక్నికల్ (JIO-II/Tech) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల.. భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో (IB) ఇప్పటికే వరుసగా పలు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ …

Read More »