Air India: ల్యాండింగ్ సమయంలో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. 135 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా.. బాంబు బెదిరింపు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు పైలట్‌ను అలర్ట్ చేశారు. అయితే ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన బయటికి రప్పించారు. అనంతరం ఆ విమానంలో గాలింపు చేపట్టారు. మరోవైపు.. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు మొత్తం పూర్తిస్థాయి ఎమర్జెన్సీ విధించారు. కేరళ …
Read More »TVK Party: విజయ్ పార్టీ జెండా చూశారా? ప్రజారాజ్యాన్ని గుర్తుచేసిన దళపతి
తమిళ రాజకీయాలు-సినిమాలు రెండింటినీ వేర్వేరుగా చూడటం అసాధ్యం. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ స్థాపించిన ఎంజీఆర్ నుంచి ఆ పార్టీని అదే రేంజ్‌లో ముందుకు తీసుకెళ్లిన జయలలిత వరకూ అందరూ సినీనటులే. అలానే డీఎంకే పార్టీని నడిపించిన కరుణానిధి నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఆయన మనవడు ఉదయనిధి స్టాలిన్ వరకూ అందరూ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లే. ఇక కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే ఇటీవల కోలీవుడ్ స్టార్ దళపతి కూడా రాజకీయ రంగప్రవేశం …
Read More »RC Renewal : ఆన్‌లైన్‌లో సులభంగా మీ వెహికల్ RC రెన్యువల్ చేసుకోవచ్చు.. ప్రాసెస్ ఇదే
Online Process for RC Renewal : సాధారణంగా వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ (RC) గడువు 15 సంవత్సరాలపాటు ఉంటుంది. కేంద్ర మోటార్ వెహికల్ చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేటు వాహనాల రిజిస్ట్రేషన్ గడువు 15 సంవత్సరాల వరకు ఉంటుంది. అనంతరం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ముగింపు తేదీకి ముందే రెన్యువల్ చేసుకోవడం ఉత్తమం. ఇందుకు ఆన్‌లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. RC రెన్యువల్‌కి అవసరమైన డాక్యుమెంట్స్: ఆర్సీ రెన్యువల్ ప్రకియలో …
Read More »అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రాణాలు …
Read More »ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు, వివరాలివే..
హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అలర్ట్ జారీ చేశారు. పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే డివిజన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో నిర్వహణ పనుల కారణంగా ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన ట్రైన్ల వివరాలను వెల్లడించారు. వరంగల్- హైదరాబాద్ మెమూ, కాజీపేట- బల్లార్ష, సికింద్రాబాద్- వరంగల్ ట్రైన్లు సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 30 వరకు మెుత్తం …
Read More »ఆ ఒక్క కారణంతోనే భారీగా దిగొస్తున్న ఇంధన ధరలు.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..
Easing Mideast Tensions: కొద్దిరోజుల కిందట అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాలు, ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం, అమెరికా చైనా ట్రేడ్ వార్, బంగ్లాదేశ్‌లో సంక్షోభం.. ఇలా ఎన్నో కారణాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపాయి. ఈ కారణంతోనే కొన్నాళ్లు బంగారం ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండటం.. ఇంధన ధరలు పెరగడం వంటివి జరిగాయి. అయితే ఇప్పుడు కొన్ని కారణాలతో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు పతనం అవుతున్నాయి. మంగళవారం రోజు కూడా పడిపోగా.. ఇప్పుడు 2 …
Read More »ఉక్రెయిన్‌లో మోదీ టూర్.. లగ్జరీ ట్రైన్‌లో ప్రయాణం.. ట్రైన్ ఫోర్స్ వన్ విశేషాలేంటంటే?
Train Force One: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటిపోయింది. అయితే సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఏ దేశమూ పై చేయి సాధించలేదు. అలాగని ఏ దేశమూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఎటూ సాగకుండా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ క్రమంలోనే యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. యుద్ధం విరమించాలని ఇప్పటివరకు పలుమార్లు ఇరు …
Read More »రాజకీయాల్లోకి వినేశ్ ఫొగాట్.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సోదరిపైనే పోటీ?
వినేశ్ ఫొగాట్. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పారిస్ ఒలింపిక్స్ 2024 లో మహిళల రెజ్లింగ్ విభాగంలో 100 గ్రాములు అధికంగా బరువు ఉన్న కారణంగా పతకానికి దూరమైన వినేశ్ ఫొగాట్ పట్ల దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకుని.. నెటిజన్ల వరకు అంతా వినేశ్ ఫొగాట్‌కు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో చేతివరకు వచ్చిన పతకం చేజారిపోయింది. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్న వినేశ్ ఫొగాట్.. రెజ్లింగ్ నుంచి …
Read More »కోల్‌కతా హత్యాచార ఘటన.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులతో పాటు ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ తీరుపై తీవ్రంగా మండిపడింది. అంత ఘోరం జరిగితే.. ఆమె ఆత్మహత్య చేసుకుందనిని ఎలా చెప్పారని మాజీ ప్రిన్సిపాల్‌ను నిలదీసింది. ఆయనను ఆ కాలేజీ నుంచి తొలగించి.. మరోచోట ప్రిన్సిపల్‌గా నియమించడంపై విస్మయం వ్యక్తం చేసింది. కొన్ని …
Read More »విజృంభిస్తోన్న మంకీపాక్స్.. ఎయిర్‌పోర్ట్‌లు, సరిహద్దుల్లో అలర్ట్ ప్రకటించిన కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (Mpox) వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ మిగతా ఖండాల్లోని దేశాలకు పాకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించి.. సమీక్షచేపట్టారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేశారు. తాజాగా, మంకీపాక్స్‌పై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు చేసింది. వీటితో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని పోర్టుల దగ్గర కూడా నిఘా పెంచాలని …
Read More »