జాతీయం

ఆ రంగంలో కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఐదు లక్షల కొత్త ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపుదలపై ఆయా రాష్ట్రాలు దృష్టి సారించాలని కిషన్ రెడ్డి కోరారు.విద్యుదుత్పత్తిలో బొగ్గు వినియోగం దాదాపుగా తగ్గినా, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడం వల్ల బొగ్గు రంగం రాబోయే కొన్నేళ్లలో ఐదు లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఈ …

Read More »

నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం.. శబరిమలకు పోటెత్తిన భక్తులు

Sabarimala: అయ్యప్ప స్వామి వార్షిక ఉత్సవాల్లో కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. శబరిమలలోని కందమల శిఖరంపై అయ్యప్ప మకరజ్యోతి దర్శనం ఇచ్చేందుకు సమయం ఆసన్నం అయింది. ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో కనిపించే ఈ మకరజ్యోతిని కళ్లారా చూసేందుకు వేలాది మంది అయ్యప్ప భక్తులు.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి.. శబరి కొండకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ శబరిమలలో కనిపించే మకరజ్యోతిని చూసేందుకు అక్కడ ఉన్నవారే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టీవీలు, సోషల్ మీడియాల్లో …

Read More »

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎప్పుడంటే..?

భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య మరింత బంధం బలపడనుంది. రెండు భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కానున్నాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో పారిస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ఈ పర్యటన జరగవచ్చని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం.రష్యా తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్ కూడా భారత్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. 2025 ఫిబ్రవరిలో …

Read More »

భారతదేశపు అత్యంత చౌకైన ఏసీ రైలు.. కి.మీ కేవలం 68 పైసలే..!

భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉంది. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌లో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా ఈ ఒక్క ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. భారతీయ రైల్వే రైళ్లలో టికెట్ ఛార్జీలు కోచ్, సౌకర్యాలను బట్టి మారుతూ ఉంటాయి. స్లీపర్, జనరల్ కోచ్‌లతో పోలిస్తే AC కోచ్‌ల ఛార్జీలు ఎక్కువ. AC కోచ్‌లో ఏసీ రైళ్ల ఛార్జీలు స్లీపర్ కంటే రెండింతలు …

Read More »

ఎలాంటి రాత పరీక్షలేకుండా ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ. లక్ష వరకు జీతం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నెలకు రూ.లక్ష వరకు జీతం అందివచ్చే ఉద్యోగాలను ప్రకటించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 23. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)..  ఆధ్వర్యంలో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ …

Read More »

ఫార్మా జీసీసీలకు కేంద్రబిందువుగా హైదరాబద్‌.. వచ్చే ఐదేళ్లలో 25లక్షల ఉద్యోగావకాశాలు

హైదరాబాద్ ఐటీ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణలో ఉన్నతస్థానాన్ని దక్కించుకున్నట్లే, ఇప్పుడు ఫార్మా రంగంలోనూ అగ్రగామిగా ఎదుగుతోంది. బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీలు) తమ వ్యాపార విస్తరణకు, సమర్థవంతమైన నిర్వహణకు ఈ కేంద్రాలను స్థాపిస్తున్నాయి. ఇటీవల, హైదరాబాద్ ఫార్మా జీసీసీలకు కీలక హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఎలీ లిల్లీ, మెర్క్ సంస్థల జీసీసీలు ప్రారంభం 700 బిలియన్ డాలర్ల విలువైన లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో ప్రముఖ సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌ను తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కోసం ఎంచుకుంది. మెర్క్ (ఎంఎస్), …

Read More »

వై దిస్ వైరస్ వర్రీ.. అమ్మబాబోయ్.! పెట్రేగిపోతున్న మాయదారి రోగాలు

కరోనా కల్లోలాన్ని మర్చిపోలేదెవరూ. జీవితాంతం వెంటాడే పీడకల ఆ మహమ్మారి. అందుకే కొత్తగా ఏ వైరస్‌ పేరు విన్నా.. ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఈ సీజన్‌లో ఎవరి నోట విన్నా హ్యూమన్‌ మెటా న్యూమో వైరస్‌ మాటే. మరోవైపు మనం ఎప్పుడో చూసిన నోరో వైరస్‌ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని భయపెడుతోంది. పశుపక్ష్యాదులకే పరిమితమనుకున్న బర్డ్‌ ఫ్లూ అమెరికాలో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏమిటీ మాయరోగాలు? మనిషి రోగ నిరోధక సామర్థ్యం తగ్గుతోందా? మాయదారి క్రిముల కోరలు పదునెక్కుతున్నాయా?వైరస్‌ పుట్టినిల్లు చైనాలో మరో మహమ్మారి జడలు విప్పింది. …

Read More »

5 దశాబ్ధాల తర్వాత AICC హెడ్‌క్వార్టర్స్ అడ్రస్ మారనుంది.. ఎందుకంటే..!!

దేశ రాజధాని ఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయం చిరునామా మారనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌గా అక్బర్ రోడ్‌లోని 24వ నెంబర్ బంగ్లా సేవలందిస్తోంది. ఇప్పుడు మరో ప్రాంతానికి పార్టీ కార్యాలయం తరలిపోనుంది. ల్యూటెన్స్ ఢిల్లీగా వ్యవహరించే సెంట్రల్ ఢిల్లీ నుంచి పార్టీ కార్యాలయం 9A, కోట్లా మార్గ్ చిరునామాకు మారనుంది.దేశ రాజధాని ఢిల్లీలోని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యాలయం చిరునామా మారనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌గా సేవలందించిన అక్బర్ రోడ్‌లోని 24వ నెంబర్ బంగ్లా నుంచి మరో ప్రాంతానికి …

Read More »

థర్డ్‌ పార్టీ యాప్‌ అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్ల స్కాన్!

వాట్సాప్‌ అనేది ప్రతి ఒక్కరికి ఒక సాధనంగా మారింది. రకరకాల ఫీచర్స్‌తో ఎన్నో పనులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. సరికొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెడుతోంది వాట్సాప్‌. ఎవరైనా డాక్యుమెంట్‌ని పంపాల్సిన అవసరం వచ్చినప్పుడు, ముందుగా అది మరొక యాప్ సహాయంతో స్కాన్ చేసి పంపుతుంటారు..వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. Meta యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ ఎల్లప్పుడూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకువస్తుంటుంది. వాట్సాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు వినియోగదారులు డాక్యుమెంట్‌లను స్కాన్ చేయడానికి థర్డ్-పార్టీ …

Read More »

ముంబైలో ఆరు నెల పాపకి HMPV పాజిటివ్.. తెలంగాణాలోనూ గత నెలలో 11 కేసులు

Hyderabad HMPV Cases: కరోనా సృష్టించిన విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం బయట పడుతోన్న వేళ.. చైనాలో మరో వైరస్ విలయతండంవం సృష్టిస్తోంది. అంతేకాదు HMPV వైరస్ మన దేశంలో కూడా అడుగు పెట్టింది. ఇప్పటికే దేశంలో క్రమంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్…ఈ వైరస్ చిన్న పిల్లలకు సోకుతుంది. భారత్‌లోనూ ఈ కేసులు నమోదవుతున్నా ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో దీని ప్రమాదాన్ని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.దేశంలో …

Read More »