సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కర్తవ్య భవన్ లోకి దశలవారిగా కేంద్ర మంత్రుల కార్యాలయాలను తరలిస్తారు. ప్రస్తుతం హోంశాఖతో పాటు విదేశాంగ శాఖ కార్యాలయాలను నార్త్ బ్లాక్ నుంచి కర్తవ్య భవన్ లోకి మార్చారు. కర్తవ్యభవన్‌లో మంత్రుల కార్యాలయాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు. భారతదేశ పాలనకు గుండెకాయలా నిలిచిన కొన్ని భవనాలు వాటి స్థితి మార్చుకుంటున్నాయి. ఈ మధ్యనే భారత ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ …
Read More »వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేది అప్పుడే.. ప్రకటించిన రైల్వే మంత్రి..ఎలా ఉంటుందో తెలుసా?
మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఏ మార్గాల్లో నడుస్తుందో రైల్వేలు ఇంకా స్పష్టం చేయలేదు. రైల్వే బోర్డు త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. సుదూర ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఈ రైలు నడుస్తుందని భావిస్తున్నారు. భారతీయ రైల్వేలు త్వరలో తన సెమీ హై-స్పీడ్ రైళ్ల నెట్‌వర్క్‌కు కొత్త పేరును జోడించబోతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ దృష్ట్యా, రైల్వేలు ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని నిర్ణయించాయి. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రైల్వే మంత్రి అశ్విని …
Read More »ఏపీ ప్రజలకు బంగారంలాంటి వార్త.. ప్రభుత్వంతోపాటు మీరునూ..! అదేంటంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) ప్రత్యేక వెబ్‌సైట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. crda.ap.gov.in వెబ్‌సైట్‌లో ‘‘డొనేట్ ఫర్ అమరావతి’’ అనే కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రజలు నేరుగా విరాళాలు అందజేసే వీలును కల్పించింది. వెబ్‌సైట్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాల ప్రాసెస్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యూపీఐ ఆధారిత క్యూఆర్ కోడ్ …
Read More »రాష్ట్రానికి మరో మణిహారం.. యాదాద్రి పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ జాతికి అంకితం!
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్రానికి ఆశాదీపమైంది. దీంతో విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలువనుంది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అవతరించింది. దేశ విద్యుత్ రంగానికి దేశానికి కలికితురాయిగా నిలిచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ను ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. గత ఏడాది డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండవ యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. మొదటి, …
Read More »సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం.. ప్రధాని మోదీకి ఆహ్వానం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు మర్యాదపూర్వకంగా కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా రావాలని ఆహ్వానించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3 వార్షికోత్సవాల సందర్భంగా …
Read More »పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి.. సింగపూర్ పర్యటనలో పెట్టుబలడుకు ఏపీ సీఎం ఆహ్వానం!
సింగపూర్ పర్యటనలో చివరి రోజున దిగ్గజ సంస్థలు, ప్రముఖ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు అయ్యారు.పెట్టుబడులతో రండి, అవకాశాలు అందుకోండని ఆయా కంపెనీల సీవోలకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఈ భేటీల సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ప్రాంతాల వారీగా సీఎం వారికి వివరించారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలంటూ పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని. వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో …
Read More »అమరావతి క్వాంటం వ్యాలీకి సింగపూర్ కంపెనీల పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు
సింగపూర్‌లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు సింగపూర్‌లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరై తమ అభిప్రాయాలను తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకించి విశాఖలో దీనికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సింగపూర్‌లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం ఆ …
Read More »నేడు శ్రీహరికోట నుంచి GSLV-F16 రాకెట్ ప్రయోగం… నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో
మరొకొద్ది గంటల్లో శ్రీహరికోట నుంచి GSLV-F16 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం సాయంత్రం 5:40కి GSLV-F16 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన NISAR.. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్‌తో పనిచేసే ఉపగ్రహం. ఇది L -బ్యాండ్, S-బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్‌ను భూమికి పంపిస్తుంది. నిసార్‌కు పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో ఫొటోలను తీసే సామర్థ్యం …
Read More »జీఎస్ఎల్వీ F-16 రాకెట్ కౌంట్ డౌన్ షురూ… రేపు శ్రీహరికోట నుంచి ప్రయోగం
ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్ఎల్వీ F-16 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ పాడ్ నుంచి రేపు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. భూ పరిశీలన కోసం ఇస్రో, నాసా సంయుక్తంగా నిసార్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన NISAR.. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ …
Read More »మారు మూల ప్రాంత పాఠశాలలో AI పాటలు.. అద్భుతాలు సాధిస్తున్న విద్యార్థులు.
అదో అటవీప్రాంతం.. కానీ నగరాల్లోని కనిపించని తీరులో అక్కడి విద్యార్థినీ, విద్యార్థులు ఏఐ టూల్స్ వాడుతున్నారు. అధికవేగంతో తెలంగాణా సర్కార్ తీసుకొచ్చిన ఇంటర్నెట్ వేగంతో.. ఇప్పుడు మారుమూల పల్లెల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చొచ్చుకుపోతోంది. పెద్దపెల్లి జిల్లాలో ఓ మారుమూల పల్లెలో కనిపిస్తున్న ఆ విప్లవమే ఇప్పుడు చదువుతున్న వార్త. తెలంగాణా రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఆందోల్, నారాయణపేట, మద్దూర్ గ్రామాలతో పాటు.. పెద్దపెల్లి జిల్లాలోని ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ వంటి గ్రామాలు ఇప్పుడు ఇంటర్నెట్ విప్లవానికి కేరాఫ్ గా నిలుస్తున్నాయి. అయితే ఇంకొన్ని …
Read More »