టెక్నాలజీ

గుడ్‌న్యూస్‌.. సెట్-టాప్ బాక్స్ లేకుండా ఉచితంగా 500 కంటే ఎక్కువ HD టీవీ ఛానెళ్లు, OTT యాప్స్

Skypro అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ సర్వీస్ (IPTV) సర్వీస్ ప్రొవైడర్. ఇది అనేక ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్..ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యూజ‌ర్ల‌కు శుభవార్త చెప్పింది. ఎలాంటి కేబుల్ టీవీ అవ‌స‌రం లేకుండా సెట్-టాప్ బాక్స్ లతో ప‌నిలేకుండా ఏకంగా 500 కంటే ఎక్కువ హెచ్‌డీ టీవీ ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీసుల‌ను ప్రారంభించింది. ఇది దేశంలోని ఎంపిక …

Read More »

హమ్మయ్య.. ఎట్టకేలకు పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు..!

వరుసగా 8 వారాల క్షీణితకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) మళ్లీ పెరిగాయి. నవంబర్ 29తో ముగిసిన వారానికి విదేశీ మారకపు నిల్వలు 1.51 బిలియన్ డాలర్లు (రూ.12,500 లక్షల కోట్లు) పెరిగి.. 658.091 బిలియన్ డాలర్లు (రూ.55.27 లక్షల కోట్లు)కు చేరాయి.హమ్మయ్య.. ఎట్టకేలకు భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) మళ్లీ పెరిగాయి. వరుసగా గత 8 వారాలుగా ఫారెక్స్ నిల్వలు తగ్గుతుండగా.. నవంబర్ 29తో ముగిసిన వారానికి విదేశీ మారకపు …

Read More »

చౌక.. చౌక.. ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్ కనెక్షన్‌.. అతి తక్కువ ధరకు

గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనుంది తెలంగాణ సర్కార్. అది కూడా చౌక ధరకే. టీ-ఫైబర్ ఆధ్వర్యంలో దశలవారీగా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఇంటర్నెట్ అందించనున్నారు.ఇకపై తెలంగాణలో అత్యంత చౌకగా ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. టి ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ప్రభుత్వం 300 రూపాయలకే ఇవ్వనుంది. ఈ కనెక్షన్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న టీవీని కంప్యూటర్ మాదిరిగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా టీవీలోనే …

Read More »

సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేలా ఆర్బీఐ కీలక నిర్ణయం

టెక్నాలజీ యుగంలో సైబర్‌ నేరగాళ్ల బెడద రోజురోజుకీ పెరిగిపోతోంది. అమాయకులే లక్ష్యంగా సొమ్ములు కొల్లగొట్టి మోసాలకు పాల్పడటమే కాదు.. ఆ సొమ్మును ఫేక్‌ అకౌంట్లకు మళ్లిస్తున్నారు. ఆయా ఖాతాల నుంచి సొమ్మును తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ముఖ్యంగా నిరక్ష్యరాస్యులు, నిరుద్యోగులకు కమీషన్‌ ఆశ చూపి వారి పేరుతో ఖాతాలు తెరుస్తున్నారు. వీటినే మ్యూల్‌ అకౌంట్లు అంటారు. ఈ ఖాతాల్లోకి వెళ్లిన సొమ్మును గుర్తించడం, రికవరీ చేయడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మ్యూల్‌ ఖాతాల ఏరివేతే లక్ష్యంగా ఆర్‌బీఐ మ్యూల్‌ హంటర్‌ డాట్‌ ఏఐని …

Read More »

సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..

చంద్రయాన్ మంగళయాన్ తరువాత ఆదిత్య యాన్ పేరుతో ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రయాణించి పరిశోధనలను మొదలుపెట్టింది. తాజాగా యూరప్‌కు చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబ్ 3 పేరుతో మూడు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తూ ప్రయోగాన్ని చేపట్టింది. అయితే ఈ ప్రయోగం కోసం భారత్‌ను సాయం కోరింది. రెండు రోజుల క్రితమే ఇస్రో శ్రీహరికోట నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తలపెట్టిన ప్రోబ్ 3 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఈ ప్రయోగం కూడా సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు …

Read More »

వామ్మో.. కొత్త రకం సైబర్ నేరాల లిస్ట్ ఇది.. అలెర్ట్‌గా లేరంటే అంతే సంగతులు

రోజుకో కొత్త రకం నేరాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకరకంగా నమ్మించి వారి బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా ఖాళీ చేసేస్తున్నారు. ఈ విషయాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో బాగా చదవుకున్న వారు కూడా సైబర్ నేరగాళ్ల బుట్టలో పడి లక్షలు, కోట్లు కోల్పోతున్నారు. దీనికి సంబంధించి నిత్యం వార్తా కథనాలను మనం చూస్తూనే ఉన్నాం.. ట్రాయ్‌తో పాటు పోలీసులు సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆన్‌లైన్ వేదికగా పలు అవగాహన కార్యక్రమాలను సైతం చేపడుతోంది.  మరి ప్రస్తుతం ట్రెండింగ్‌లో …

Read More »

వడ్డీ రేట్లు యధాతథం.. రెపోరేటు 6.50 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్వహించింది. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయని ఆర్​బీఐ, రెపోరేటు 6.50 శాతంగా కొనసాగిస్తున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వసారి.దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని 4.50 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా …

Read More »

హైదరాబాద్​లో అతిపెద్ద​ సేఫ్టీ సెంటర్.. AP యువతకు నైపుణ్య శిక్షణ

తెలుగు రాష్ట్రాలతో గూగుల్‌ కీలక ఒప్పందాలు చేసుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు ఏపీ ప్రభుత్వంతో డీల్‌ కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం AP యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతోంది. అలాగే.. దేశంలోనే తొలి గూగుల్‌ సేఫ్టీ సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇంతకీ.. ఈ గూగుల్‌ సేఫ్టీ సెంటర్‌ ఉపయోగాలేంటి?.. ఏపీలో ఎలాంటి ఆవిష్కరణలు చేయబోతోంది?…ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దాని ద్వారా ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు …

Read More »

కుంకుడు రైతుకు పద్మారెడ్డికి మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారం..

నల్గొండ జిల్లాకు చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి వ్యవసాయానికి చేసిన విశేష సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా’గా సత్కరించింది. పద్మా రెడ్డి హార్టికల్చర్‌లో అధునాతన శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా విశేషమైన దిగుబడులు సాధించారు.వ్యవసాయం అంటే ఇష్టముండాలే కానీ.. బీడు భూమిలో కూడా బంగారం పండిచొచ్చు అని నిరూపిస్తున్నారు కొంత మంది అన్నదాతలు. అందుకు నిదర్శనమే ఈ రైతు కూడా. కరువు ప్రాంతంలో కృషిని నమ్ముకొని ధైర్యంగా వేసిన ఓ అడుగు.. 33 ఏళ్లుగా సిరులు కురిపిస్తోంది. అది …

Read More »

గృహాలకు ఉచిత విద్యుత్‌ పథకానికి విశేష స్పందన.. 1.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి విశేష స్పందన లభిస్తోంది. మన దేశంలోని పౌరుల ఇళ్ళకు ఉచిత విద్యుత్ ను అందించేందుకు ప్రవేశ పెట్టిన పథకం. ఈ పథకాన్ని ఫిబ్రవరి 15, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకంతో దేశంలో కోటి ఇళ్లలో సౌర ఫలకాలను అమర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. అప్పుడు ప్రభుత్వం విద్యుత్ కోసం చేస్తున్న ఖర్చు ఏడాదికి సుమారు 75,000 కోట్ల రూపాయలు అదా అవుతుందని కేంద్ర మంత్రి శ్రీపాద్ …

Read More »