టెక్నాలజీ

 రైల్వే స్టేషన్‌లో స్టార్ హోటల్‌ను మించి.. మ్యాటర్ తెలిస్తే ప్రయాణీకులు క్యూ కట్టేస్తారంతే

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే జర్నీ సౌకర్యవంతంగా ఉండాలి. అలసిపోయే ప్రయాణికుడికి కాస్త రిలాక్స్ కుదిరితే శారీరకంగా, మానసికంగా ఆ సంతృప్తే వేరు. ట్రైన్ దిగిన తర్వాత.. గమ్యస్థానానికి వెళ్లే ముందు గాని.. రైల్వే స్టేషన్‌కు వెళ్లి గంటల తరబడి రైలు కోసం వేచి చూస్తున్నప్పుడు గానీ.. కాస్త విశ్రాంతి దొరికితే చాలు అన్నట్టుగా ఉంటుంది. చాలామంది ప్రయాణికులు.. తమ జర్నీలో మిగిలిన సమయం కాస్త రిలాక్స్ అవ్వాలని చూస్తూ ఉంటారు. అటువంటివారు ఫ్లాట్‌ఫార్మ్‌పై ఉన్న కుర్చీ పైనో.. లేక …

Read More »

ఆ దేశాలకు చుక్కలే.. ప్రతి కదలికపై నిఘా.. వాటి కొనుగోలుకు కేంద్రం రెడీ..!

ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సైనిక శక్తిని మరింత బలోపేతం చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా శత్రు దేశాల కదలికపై నిఘా పెట్టేందుకు MALE డ్రోన్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా వీటిని రూపొందించనుంది. వీటితో చైనా, పాకిస్థాన్ వంటి శత్రు దేశాల కదలికలను అత్యంత కచ్చితత్వంతో గమనించడం సాధ్యపడుతుంది. దేశ సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఓవైపు సొంత శాటిలైట్ల ద్వారా అంతరిక్ష నుంచి నిఘా …

Read More »

జియోలో దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

రిలయన్స్‌ జియోలో రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఉన్నాయి. ఇటీవల మొబైల్‌ రీఛార్జ్‌ ధరలను భారీగా పెంచగా, చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్లారు. మళ్లీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకువస్తోంది. ఇప్పుడు తక్కువ ధరల్లోనే ఏడాది పాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్‌ కూడా ఉంది. ఈ ప్లాన్‌ ఏంటో తెలుసుకుందాం.. కొన్ని రోజుల క్రితం TRAI అన్ని టెలికాం కంపెనీలను కాలింగ్, SMS లతో మాత్రమే చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. ట్రాయ్‌ ఈ నియమం తర్వాత …

Read More »

ఇక ఇండియాలోనే.. అడ్వాన్స్‌డ్ ఫైటర్ జెట్స్‌తో డిఫెన్స్ దద్దరిల్లాల్సిందే

IAF అవసరాలకు అనుగుణంగా మల్టీ- రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA) టెండర్ లో భాగంగా మొత్తం 114 Su-35M ఫైటర్ జెట్లను రష్యా నేరుగా సరఫరా చేయనుంది. ఇప్పటికే భారత వాయుసేన వద్ద ఉన్న Su-30MKIతో పోల్చితే.. Su-35Mలో దాదాపు 70-80% సాంకేతిక సామాన్యత ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే కాదు.. సైనిక శక్తిలోనూ అగ్రరాజ్యాల సరసన నిలిచేందుకు భారత్ నిరంతరం ప్రయత్నిస్తోంది. భారత్‌తో సరిహద్దులు పంచుకుంటూ శత్రువైఖరిని ప్రదర్శిస్తున్న చైనా, పాకిస్తాన్ దేశాలు ఇప్పటికే 5వ తరం యుద్ధ విమానాలను కలిగి ఉండగా.. …

Read More »

రూ.100 చెల్లిస్తే చాలు వారసత్వ భూములకు సెక్షన్‌ సర్టిఫికెట్‌… అక్టోబర్‌ 2లోగా భూ సమస్యల పరిష్కారం

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్‌. ఆధార్‌, సర్వే నెంబర్లను అనుసంధానించి భూ సమస్యల చిక్కుముళ్లను విప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 2ని డెడ్‌లైన్‌గా పెట్టుకుని పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో వారసత్వ భూములకు సెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెవెన్యూ శాఖపై సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.10లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో రూ.100 చెల్లించి సెక్షన్‌ సర్టిఫికెట్లు …

Read More »

హైదరాబాద్ వీధుల్లో గస్తీ కోసం శివంగులు… నయా డ్రెస్, స్పెషల్ ట్రైనింగ్..

హైదరాబాద్‌లో ఇకపై మహిళా పోలీసులు గస్తీ కాయనున్నారు. ఇప్పటికే స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు.. 2 నెలల పాటు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. ధర్నాలు, ర్యాలీలు సహా ఇతర సమయాల్లో ఈ టీమ్స్‌ను మొహరించనున్నారు. తొలిసారిగా ఈ టీమ్ సచివాలయం వద్ద విధులు నిర్వహించింది. శాంతిభద్రతల పరంగా హైదరాబాద్ చాలా సెన్సిటివ్ ప్రాంతం. ఇక్కడ సెక్యురిటీ బాధ్యతలు పోలీసులకు పెద్ద సవాల్. నిత్యం ఆందోళనలు, ధర్నాలు, రాస్తారొకోలు జరుగుతుంటాయి. చిన్న ఆందోళన లేదా అల్లర్లు జరిగినా అది రాష్ట్రం మొత్తం పాకే అవకాశం …

Read More »

9 నెలలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. రికార్డు స్థాయికి భారత్..!

ప్రపంచంలో అత్యధిక ఫారెక్స్ నిల్వలు కలిగిన నాల్గవ దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ మాత్రమే భారతదేశం కంటే ముందు ఉన్నాయి. భారతదేశ కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి గణాంకాలను విడుదల చేసింది. మరోవైపు, భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు భారీగా పెరిగాయి. భారతదేశం గత 9 నెలలుగా ఎదురుచూస్తున్న రోజు చివరకు రానే వచ్చింది. అక్టోబర్ 2024 తర్వాత మొదటిసారిగా, దేశ ఫారెక్స్ నిల్వలు 700 బిలియన్ డాలర్లను దాటాయి. జీవితకాల గరిష్ట రికార్డును బద్దలు …

Read More »

కథన సీమలో కొదమ సింహం.. మన ‘ఆకాష్’ వైపు బ్రెజిల్ చూపు..!

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ రక్షణ సాంకేతికతలపై ఆసక్తిని వ్యక్తం చేసింది. బ్రెజిల్ ప్రభుత్వం యుద్ధభూమి సాంకేతికత, జలాంతర్గాములు, తీర రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేసింది. ఉగ్రవాదలుపై దాడికి ప్రతిదాడిగా భారత్‌పై పాకిస్థాన్‌ దాడులకు …

Read More »

ఆఫ్ట్రాల్ ఏసీ టెక్నిషియన్ అనుకోకండి.. ఇంత పెద్ద టాలీవుడ్‌ను షేక్ చేశాడు

సినిమా రిలీజ్‌య్యే రోజే టెలిగ్రామ్‌ గ్రూపుల్లో లీక్ చేస్తున్న కిరణ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 65కు పైగా సినిమాలను పైరసీ చేసిన అతడు, ఒక్కో సినిమాకు 300 డాలర్లు వసూలు చేసేవాడిగా తేలింది. క్రిప్టో కరెన్సీలో కమిషన్లు తీసుకుంటూ నెలకు లక్షలోపల సంపాదించేవాడని అధికారులు వెల్లడించారు. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో పట్టుబడ్డ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. తెలుగు చిత్రసీమను వణికిస్తున్న పైరసీ మాఫియాలో కీలక నిందితుడైన కిరణ్‌కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. …

Read More »

కొంప ముంచిన SBI క్రెడిట్‌ స్కోర్.. చేతికందిన బ్యాంకు ఉద్యోగం హుష్‌..! కోర్టు షాకింగ్ ట్విస్ట్..

బ్యాంకింగ్‌ ఉద్యోగార్ధులకు క్రెడిట్ కార్డు హిస్టరీ గండంగా మారింది. పేలవమైన క్రెడిట్‌ కార్డు హిస్టరీ కలిగిన వారికి నిర్మొహమాటంగా ఉద్యోగ ఆఫర్‌లను రద్దు చేస్తున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పూర్ క్రెడిట్‌ కార్డు హిస్టరీ కలిగిన వారికి ఉద్యోగం ఉచ్చేందుకు నిరాకరించింది. ఎస్బీయే నిర్ణయాన్ని ఇటీవల మద్రాస్ హైకోర్టు తీర్పు సమర్థించడం విశేషం. ఉద్యోగార్థులకు, ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో ఈ తీర్పు స్పష్టం చేసింది..క్లీన్ క్రెడిట్ రికార్డ్, అధిక క్రెడిట్ స్కోరు, స్థిరమైన …

Read More »