ఇస్రో అంతరిక్ష ప్రయోగాల సంఖ్య గణనీయంగా పెంచుతోంది. గతంలో ఏడాదికి ఒకటి రెండు ప్రయోగాలు మాత్రమే చేసే ఇస్రో ఇప్పుడు నెలకో లాంచ్ చేస్తోంది. ఈ సంఖ్యను మరింత పెంచేందకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటిదాకా రాకెట్ ప్రయోగం అంటే కేవలం శ్రీహరికోట నుంచి మాత్రమే చేపట్టేది. కానీ ఇప్పుడు రాకెట్ లాంచ్ కోసం సెంటర్‌ను ఇప్రో ఏర్పాటు చేస్తోంది. దీనికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే భారత్‌కు రెండో రాకెట్ లాంచ్ సెంటర్ కూడా అందుబాటులోకి …
Read More »పాస్‌పోర్ట్ సేవల్లో కీలక మార్పులు.. పాస్‌పోర్ట్ జారీ మరింత ఈజీ
ఆధునిక కాలంలో ప్రపంచం కుగ్రామంగా మారింది. ఒక దేశం నుంచి మరో దేశానికి రాకపోకలు విపరీతంగా పెరిగాయి. దానికి అనుగుణంగానే వేల సంఖ్యలో విమానాలు నిత్యం వివిధ దేశాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. చదువు, వ్యాపారం, ఉద్యోగం, వివాహం, పర్యటన తదితర కారణాలతో చాలా మంది భారతీయులు విదేశాలకు వెళతున్నారు. ఆ ప్రయాణానికి ముందుగా పాస్ పోర్టు అవసరం.గతంలో పాస్ పోర్టు కావాలంటే నిబంధనల ప్రక్రియ చాాలా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం పాస్ పోర్టు సేవ 2.0 అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు వేగంగా, సులభంగా …
Read More »ఆపరేషన్ సిందూర్‌తో భారత ఆయుధాలకు పెరిగిన డిమాండ్.. “ఆకాశ్” క్షిపణి వ్యవస్థతో పాటు “గరుడ” ఫిరంగులపై బ్రెజిల్ ఆసక్తి!
గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ పరికరాలు, ఆయుధాల గురించి ప్రస్తావన వస్తే అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలు గురించే చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో ప్రపంచంలోనే జనాభాలో అతిపెద్ద దేశంగా, ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానంలో ఉన్న భారత్ గురించి చెప్పుకుంటున్నారు. అందుకు కారణం పాకిస్థాన్‌లోని ఉగ్రవాదు శక్తులను మట్టికలిపించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్. ఉన్న స్థలం నుంచే పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తీరుతో..ఈ ఆపరేషన్‌లో భారత్ ఉపయోగించిన ఆయుధాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. ఇదే ఇప్పుడు …
Read More »ఇక ఏపీ నగరాల దశ తిరిగినట్టే..! కేంద్ర నిధుల ప్రవాహంతో కొత్త శకం ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్‌లో నగరాల అభివృద్ధికి ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. రాష్ట్రంలో మున్సిపల్ శాఖ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిస్తున్న చొరవ, స్పష్టత నగర పాలనకు కొత్త ప్రాణం పోస్తోంది. తాజాగా ఆయన ఉండవల్లి నివాసంలో మంత్రి నారాయణతోపాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాలు, మున్సిపాలిటీలపై పెట్టుబడుల పరంపర ఏపీ పట్టణాల భవిష్యత్తును వెలుగులోకి తీసుకువస్తున్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కలిగి, డబుల్ ఇంజిన్ సర్కార్‌గా ఉండడం …
Read More »ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నాంపల్లి నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లు!
తెలుగు రాష్ట్రాల నుంచి కన్యాకుమారి వెళ్లాలనుకనే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కన్యాకుమారికి ప్రత్యేక రైళ్లను కేటాయించింది.ఇప్పటికే ఉన్న ట్రైన్‌లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 2 నుంచి 25వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వెళ్లే (హైదరాబాద్-కన్యాకుమారి- 07230) ట్రైన్ ప్రతి బుధవారం సాయంత్రం 5.20 గంటలకు నాంపల్లి స్టేషన్ …
Read More »ఆపరేషన్ సిందూర్‌లో ముఖ్యమైన పాత్ర పోషించిన ఐపీఎస్ అధికారికి కొత్త ‘రా’ చీఫ్‌గా బాధ్యతలు!
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ముఖ్యమైన నిఘా సమాచారాన్ని అందించిన ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) అధిపతి పరాగ్ జైన్‌ను కొత్త RAW చీఫ్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరాగ్ జైన్ 1989 బ్యాచ్ పంజాబ్ కేడర్ IPS అధికారి. చాలా కాలంగా కేబినెట్ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద నిఘా సంస్థ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) ప్రస్తుత అధిపతి రవి సిన్హా జూన్ 30న పదవీ విరమణ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, దేశ బాహ్య నిఘా బాధ్యతలను …
Read More »మరో 5 దేశాలను సందర్శించనున్న ప్రధాని మోదీ.. ముఖ్య లక్ష్యం అదే!
మరో నాలుగు దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు గురువారం (జూన్ 26) ఈ సమాచారాన్ని అందించారు. బ్రెజిల్‌తో పాటు, ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలను ప్రధాని మోదీ సందర్శిస్తారని తెలిపారు. అయితే, ప్రస్తుతానికి ప్రధాని మోదీ ప్రతిపాదిత పర్యటన గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పర్యటనలో ప్రధాన దృష్టి …
Read More »ఆరేళ్ల తరువాత తెరుచుకోబోతున్న కైలాష్ మానసరోవర్ యాత్ర.. చైనాతో రాజ్‌నాథ్ చర్చలు!
చైనాలోని కింగ్‌డావో నగరంలో జరిగిన SCO (షాంఘై సహకార సంస్థ) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక నిర్ణయంపై రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయంలో భారతదేశం- చైనా …
Read More »పిన్ కోడ్‌లోని ప్రతి డిజిట్‌కు ఒక అర్థముందని తెలుసా? దాన్ని ఎవరు కనిపెట్టారు? మొత్తం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోండి!
భారతీయ పిన్ కోడ్ వ్యవస్థ తపాలా సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. 6-అంకెల కోడ్ దేశాన్ని 9 జోన్లు, ఉప-జోన్లు, జిల్లాలు, పోస్టాఫీసులుగా విభజిస్తుంది. మొదటి అంకె జోన్‌ను, రెండవది ఉప-జోన్‌ను, మూడవది జిల్లాను, చివరి మూడు అంకెలు పోస్టాఫీసును సూచిస్తాయి. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..నేటి డిజిటల్ యుగంలో ఉత్తరాలు పంపడం తగ్గిపోయినప్పటికీ, చిరునామాపై రాసే ‘పిన్ కోడ్’ ఇప్పటికీ మన రోజువారీ లావాదేవీలలో అంతర్భాగం. ఆన్‌లైన్ షాపింగ్ నుండి బ్యాంకింగ్ వరకు, ప్రభుత్వ పథకాల నుండి అత్యవసర సేవల వరకు, ప్రతిచోటా …
Read More »ఫోన్ టాపింగ్ చేసే అధికారం ఎవరిది? టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెబుతోంది..?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతల వాంగ్మూలం తీసుకున్నా పోలీసులు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ టాపింగ్ గురించి చర్చ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది రాజకీయ నాయకులను మొదలుకుని జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను సైతం టాప్ చేశారంటూ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అసలు నిజంగానే ఇంతమంది ఫోన్లను టాప్ చేసే అధికారం ప్రత్యేక అధికారులకు ఉంటుందా..? ఎవరి అనుమతులు తీసుకొని ఇంత మంది ఫోన్లను …
Read More »