అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)దేశవ్యాప్తంగా విమానయాన భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అందువల్ల విమాన కంపెనీలు అనేక విమానాలను గ్రౌండ్ చేయాల్సి వచ్చింది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణాలపై పడింది. హైదరాబాద్ శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం(జూన్ 20) ఎయిర్ ఇండియా నాలుగు అంతర్జాతీయ, మూడు దేశీయ విమాన సర్వీసులను రద్దు …
Read More »థాయ్‌లాండ్‌లో కొడుకు పెళ్లి.. కథ మామూలుగా లేదుగా! ఏసీబీ కస్టడీకి నూనె శ్రీధర్..
కాళేశ్వరం ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ను కస్టడీకి తీసుకొని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. కరీంనగర్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ నివాసం కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు పది రోజుల క్రితం సోదాలు నిర్వహించి రూ.200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. అంతేకాకుండా కుమారుడి వివాహం థాయిలాండ్‌లో చేయగా రిసెప్షన్ హల్దీ ఫంక్షన్స్ రిసాట్లల్లో పలు హోటల్స్ లలో నిర్వహించారు. అధికారులు గుర్తించినటువంటి ఆస్తుల్లో తెల్లాపూర్ లోని విల్లా షేక్పేట్ లో గేటెడ్ కమ్యూనిటీ హాల్లో ప్లాట్, అమీర్‌పేట్‌లో కమర్షియల్, కాంప్లెక్స్ కరీంనగర్‌లో మూడు ప్లాట్లు, …
Read More »త్వరలోనే రాష్ట్రంలో మరో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్… అక్కడ ఏర్పాటుకు స్థల పరిశీలన
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మక రక్షణ రంగ ప్రాజెక్ట్ ఏర్పాటు పై ఆశలు రేకెత్తుతున్నాయి. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరణకు దేవరకద్ర మండలంలో అవకాశాలను పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు, అధికారులు. ఇందుకోసం ప్రభుత్వ తరఫున అన్ని విధాల సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.గడచిన కొన్నేళ్లుగా దేశ రక్షణ వ్యవస్థను బలోపేతంపై భారత్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణుల …
Read More »త్వరలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వైఫై…!
త్వరలో తెలంగాన ఆర్టీసీ బస్సుల్లో వై-ఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. ఢిల్లీకి చెందిన ప్రైవేటు సంస్థ, బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో ముందుగా అప్‌లోడ్ చేసిన సినిమాలు, పాటలు అందించడంపై ప్రతిపాదనలు చేసింది. వాటి మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం పంచుకోనే విధానంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది.ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ సంక్షేమంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ సర్కార్.. తాజాగా బస్సుల్లో సాంకేతికను పెంచే అంశంపై దృష్టి పెట్టింది. త్వరలో …
Read More »టోనీ బ్లెయిర్‌తో లోకేష్ భేటీ.. ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష
బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూడిల్లీలో భేటీ అయ్యారు. న్యూడిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో టోనీ బ్లెయిర్‌ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గతేడాది జులై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబాయిలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ …
Read More »సెల్‌ఫోన్ సమర్పించాలన్న ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై.. ఏమన్నారంటే?
ఫార్ములా-ఈ రేస్ కేసులో మొబైల్ ఫోన్ సమర్పించాలని కోరుతూ ACB జారీ చేసిన నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. ఏసీబీ అధికారుల తీరు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తుందని KTR తన లేఖలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసులలో అదే విషయాన్ని పేర్కొందని ఏసీబీకి రాసిన లేఖలో రాసుకొచ్చారు.తెలంగాణలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం …
Read More »పని చేస్తే సరే.. ఖాళీగా ఉంటే కుదరదు..టీసీఎస్ ఉద్యోగులకు కొత్త విధానం
ఏ సంస్థ అయినా ప్రగతి పథంలో పయనించడానికి ఉద్యోగుల పనితీరు చాలా కీలకం. వారందరూ ఆ సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించినప్పుడే ఉన్నత స్థానానికి చేరుకుంటుంది. దీని వల్ల ఆ కంపెనీతో పాటు ఉద్యోగులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దీనిలో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగుల కోసం కొత్త పని విధానం తీసుకువచ్చింది. దాని ప్రకారం ప్రతి ఉద్యోగికి ఏడాదికి కనీసం 225 రోజులు క్లయింట్ ప్రాజెక్టుల్లో పనిచేయాలి. గరిష్టంగా 35 రోజులు మాత్రమే బెంచ్ (ప్రాజెక్టు …
Read More »ఫాస్టాగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం..! ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. 3 వేలు చెల్లించి ఏడాది పాటు 200 ట్రిపులు జాతీయ రహదారులపై ప్రయాణించే అవకాశం కల్పించే కొత్త ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది. ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇది 200 ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది.వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తరచూ టోల్ రోడ్డు వారే వాడికి అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. జాతీయ రహదారులపై టోల్ కలెక్షన్ విధానంలో మరో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఫాస్ట్ …
Read More »నిర్మలా సీతారామన్ AI వీడియోతో భారీ స్కామ్! రూ.20 లక్షలు మోసపోయిన లేడీ డాక్టర్
హైదరాబాద్‌లోని ఓ వైద్యురాలు ఏఐ సాయంతో జరిగిన సైబర్ మోసానికి బలి అయ్యారు. నకిలీ వీడియోలు, లింకుల ద్వారా ఆమెను రూ.20 లక్షల రూపాయలు పోగొట్టారు. నిర్మలా సీతారామన్ గారి పేరుతో ఉన్న నకిలీ వీడియోను చూపించి నమ్మించి మోసం చేశారు.సైబర్ మోసాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత అవగాహన కల్పించినా, కేంద్రం నుంచి ఎన్ని సూచనలు సలహాలు వచ్చినా అవేమి పట్టించుకోకుండా బాధితులు మోసపోతున్నారు. ఇన్వెస్ట్మెంట్, ఫెడెక్స్ ఫ్రాడ్ అంటూ వివిధ రకాలుగా సైబర్ నేరస్థులు ప్రజలను బురిడీ కొట్టించి …
Read More »GMR ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు!
మే నెలలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో 27 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీ విమానాశ్రయంతో పోలిస్తే 15.3% అధిక వృద్ధిని సాధించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరుగుదలతో ప్రయాణికుల రద్దీ పెరిగింది.అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒకటి. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ విమానాశ్రయం నుంచి లక్షలాదిమంది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక …
Read More »