అనుకున్నంతా అయ్యింది… బీఆర్ఎస్లో కవిత ప్రస్థానం ముగిసింది. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఆమె వ్యవహరిస్తున్న తీరును.. ఇక ఎంతమాత్రం ఉపేక్షించని గులాబీఅధిష్ఠానం కన్నెర్ర చేసింది. గీతదాటితే, హద్దుమీరితే… కన్నకూతురైనా లెక్కచేయనన్న సంకేతాలు పంపిన గులాబీ దళపతి.. కవితపై బహిష్కరణ వేటు వేశారు. కొంతకాలంగా పార్టీపైనా, పార్టీ నేతలపైనా విమర్శలు గుప్పిస్తున్న కవిత తీరుపై…. ఎట్టకేలకు చర్యలు తీసుకున్న అధినేత కేసీఆర్, ఏకంగా పార్టీ నుంచి బయటకు సాగనంపేశారు. తనకు ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక… చాలాకారణాలే కనిపిస్తున్నాయి. పార్టీ …
Read More »తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు చదివితేనే లోకల్ కోటా వర్తింపు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రాష్ట్రంలో స్థానికంగా ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికే మెడికల్ కాలేజీ కోర్సుల ప్రవేశాల్లో 85 శాతం స్థానిక కోటా అమలు చేస్తామని గతంలో సర్కార్ జీవో 33ని జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో శాశ్వత స్థానికులకు వర్తించదని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని సమర్థిస్తూ తాజాగా అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాష్ట్ర కోటా కింద మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి అర్హత సాధించాలంటే 12వ తరగతికి …
Read More »బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్
BRS సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఆమె పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తూ ఉండటంతో.. అధినేత ఆదేశాల మేరకు పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సుదీర్ఘ చర్చల తర్వాత నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకుంది పార్టీ. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలయింది. ఇటీవల కాలంలో …
Read More »హరీష్‌రావుకు మద్దతుగా కేటీఆర్ ట్వీట్..! ఎమ్మెల్సీ కవిత ఆరోపణల తర్వాత..
తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హరీష్ రావును తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్‌కు అప్రతిష్ట రావడానికి హరీష్ రావు కారణమని ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా, కేటీఆర్ హరీష్ రావును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు అప్రతిష్ట రావడానికి కారణం హరీష్ రావు అని ఆరోపణలు చేసిన తర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. డైనమిక్ లీడర్ హరీష్ ఇచ్చిన మాస్టర్ క్లాస్ అంటూ …
Read More »ఆ కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
తెలంగాణలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. దీంతో పలు జిల్లాల్లో అపారనష్టం జరిగింది. ఇళ్లు, పంటలు నీటమునిగాయి.. ఇప్పుడిప్పుడే ప్రభావిత ప్రాంతాలు కోలుకుంటున్నాయి.. ఈ తరుణంలో వరదలు, పంట నష్టంపై మరోసారి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలకు పరిహారంతో పాటు పలు అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం. వరద మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మృతి చెందిన పశువులకు కూడా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం …
Read More »క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్.. కవితపై చర్యలకు సిద్ధమవుతోందా?
బీఆర్ఎస్లో తీవ్రమైన కుదుపులు. ఓ వైపు కాళేశ్వరంపై విచారణ పేరుతో బయటి నుంచి ఒత్తిడి పెంచే పరిణామాలు. మరోవైపు పార్టీలో కవిత నుంచి ఎదురవుతున్న ధిక్కార స్వరాలు. ఇంతకాలం కేసీఆర్‌కు కుటుంబమే బలం అనుకున్న పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఆ కుటుంబమే బీఆర్ఎస్లో కలకలం రేపుతున్న పరిస్థితి. కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్‌రావు. వీరంతా కేసీఆర్ కుటుంబసభ్యులు. కారు లాంటి బీఆర్ఎస్ పార్టీకి నాలుగు చక్రాల్లాంటివారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తరువాత అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎలాంటి కుదుపులు లేకుండా చూసేందుకు ఎవరి …
Read More »తెలంగాణలో సీబీఐకి రీ ఎంట్రీ.. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఇప్పుడేం జరగనుంది..?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ముమ్మాటికి అవినీతి జరిగింది..! పీసీ ఘోష్ కమిషన్ కూడా అదే తేల్చింది..! కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిందేనంటూ సీబీఐకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం.. ఇటు సీబీఐ విచారణకు కాషాయపార్టీ కూడా పచ్చజెండా ఊపింది. కాళేశ్వరం అవినీతికి పూర్తి బాధ్యత కారుపార్టీదేనని హస్తం నేతలతో కలసి కమలంపెద్దలు గట్టిగానే వాదిస్తున్నారు. ఇక అదంతా అటుంచితే… సీబీఐ ఎంట్రీపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాష్ట్రంలోకి నో ఎంట్రీ ఉన్న సీబీఐ ఎలా వస్తుంది..? వస్తే ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. …
Read More »కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయకూడదుః హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసిన వేసింది హైకోర్టు. — హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వొకేట్ …
Read More »బాబోయ్ మళ్లీ వానలు.. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! అతిభారీ వర్షాలు..
నిన్న, మొన్నటి వరకు వానలు నానాభీభత్సం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్న తరుణంలో IMD మరో బాంబ్ పేల్చింది. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీంతో వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో పలు.. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీర ప్రాంతం, వాయువ్య బంగాళాఖాతంలో సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు …
Read More »కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావుది కీలక పాత్ర.. వారిద్దరి వల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు.. కవిత సంచలన ఆరోపణలు..
కాళేశ్వరం అవినీతిలో మాజీ మంత్రి హరీశ్ రావు పాత్ర కీలకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. అందుకే హరీశ్‌ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించినట్లు తెలిపారు. హరీశ్, సంతోష్ వల్లేనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయని అన్నారు. వాళ్ల స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారన్నారు. వారిద్దరి వెనక సీఎం రేవంత్ ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపడం దారుణమన్నారు. దమ్ముంటే హరీష్, సంతోష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాపై కుట్రలు చేసినా సహించా.. కానీ కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నానని …
Read More »