తెలంగాణ

మాజీ సీఎం ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి

కల్వకుంట్ల కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సోదరి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో కేసీఆర్‌ కలత చెందారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఇంటికి కేసీఆర్‌తో సహా ఇతర కుటుంబసభ్యులు వెళ్లారు. మాజీ సీఎం, బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్‌ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఐదో సోదరి చీటీ సకలమ్మ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు దాదాపు 85 వరకు ఉంటుందని సమాచారం. సికింద్రాబాద్‌ యశోద …

Read More »

కరీంనగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్‌.. మేయర్ సహా 10 మంది కార్పోరేటర్లు రాజీనామా

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి బిగ్‌షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌కి కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు రాజీనామా చేశారు. శనివారం బీజేపీలో చేరనున్నారు మేయర్‌ సునీల్‌రావు.  మేయర్‌తోపాటు మరో 10మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సైతం బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. బండి సంజయ్‌ సమక్షంలో వీళ్లంతా బీజేపీ గూటికి చేరబోతున్నారు బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు.  BRSలో అవినీతిని భరించలేకే పార్టీ వీడుతున్నట్టు చెప్పారు. రివర్‌ ఫ్రంట్‌, స్మార్ట్‌ సిటీ.. ఇతర పనుల్లో అవినీతి జరిగిందని..ఆ అవినీతి నేత పేరును త్వరలోనే వెల్లడిస్తానన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల అవినీతి చిట్టా …

Read More »

అయ్యో! ఎంతపని చేశావమ్మా.. అవమానంతో ఇద్దరు కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య!

మాటిమాటికీ పోలీసులు ఇంటికి రావడం.. అనుమానం, దర్యాప్తు పేరిట భర్తను అరెస్ట్ చేయడం, ఇంట్లో సోదాలు చేయడంతో ఆ ఇల్లాలు గుండె ముక్కలైంది. సాఫీగా సాగుతున్న తమ కాపురంలో పోలీసులు నిత్యం ప్రకంపనలు సృష్టించ సాగారు. దీంతో అవమానం భరించలేక ఇద్దరు కూతుళ్లకు ఉరి వేసి, ఆ తర్వాత తానూ ఉరి కొయ్యకు వేలాడింది ఓ ఇల్లాలు..ఇరు కుటుంబాల్లో పెద్దల్ని ఎదిరించి మతాంతర వివాహం చేసుకుందా జంట. ఇద్దరు పిల్లలతో పచ్చగా సాగుతున్న వీరి కాపురంలోకి కేసుల పేరుతో పోలీసులు చిచ్చుపెట్టారు. ఇంటిని పలుమార్లు …

Read More »

250 ఏళ్ల నాటి పురాతన ఆలయం.. ఒక్క దేవుడి విగ్రహం కూడా లేదు.. ఎక్కడో తెల్సా

ఏ గుడికెళ్లినా.. దేవుడుంటాడు. అక్కడ పూజలు జరుగుతుంటాయి. భక్తులు వస్తుంటారు. భక్తుడికీ, భగవంతుడికీ అనుసంధానమైన పూజారి ఉంటారు. కానీ, అక్కడ మాత్రం పరిస్థితి భిన్నం. భక్తులు రారు. పూజారి లేడు. అసలు పూజారి, భక్తులు అనుసంధానం చేసే దేవుడే లేడు. 250 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ గుళ్లో దేవత విగ్రహ ప్రతిష్ఠాపన ఇంకా జరక్కపోవడానికి గల కారణమేంటి.. ఆ మిస్టరీ ఏంటీ..?ఆధ్యాత్మిక ప్రదేశాలు.. పర్యాటక ప్రాంతాలుగా కూడా విరాజిల్లుతుంటాయి. కానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశం ఇప్పుడు కేవలం ఓ పర్యాటక ప్రాంతంగా.. వెడ్డింగ్ …

Read More »

రేవంత్‌కు 26, కేటీఆర్‌కు 24.. తెలంగాణలో రిమార్కబుల్ డేస్.. అసలేంటీ లెక్కలు..

జనవరి 24, జనవరి 26, జనవరి 28… రోజువిడిచిరోజు.. తెలంగాణలో రిమార్కబుల్ డేస్ కాబోతున్నాయి. కొందరికి ఫెస్టివల్ డేస్ ఐతే.. మరికొందరికి క్రొకొడైల్ ఫెస్టివల్స్. 26న పథకాల బొనాంజాకు మేం రెడీ మీరు రెడీనా అని సర్కార్ దండోరా వేస్తుంటే.. 24 నుంచే జగడం సినిమా చూపిస్తాం అని బీఆర్‌ఎస్ హెచ్చరిస్తోంది. ఈ రెండూ కాకుండా.. 28వ తేదీ స్పెషల్‌గా మరో డోస్ ఉంది కాచుకోండి అంటోంది గులాబీ దండు. ఏమిటది..?కొత్తగా నాలుగు సంక్షేమపథకాలకు జనవరి 26న ముహూర్తంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. లబ్దిదారుల …

Read More »

తెలంగాణ ఏకలవ్య గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఫిబ్రవరి 16వతేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిల్లో ప్రవేశాలు పొందిన …

Read More »

తెలంగాణతో అమెజాన్ భారీ ఒప్పందం.. రూ.60,000 కోట్ల పెట్టుబడులతో అతిపెద్ద డేటా సెంటర్!

దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఎదుగుతోందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఐటీలో అగ్రగామిగా అవతరిస్తుందని, వ్యవసాయం, డెయిరీలో ఎంతో స్కోప్‌ ఉందంటున్నారు. దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్‌, సింగపూర్‌ డీల్స్‌తో సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయిపెట్టుబడుల సాధనలో దూసుకుపోతోంది తెలంగాణ రాష్ట్రం. దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్‌, సింగపూర్‌ డీల్స్‌తో సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం …

Read More »

 తెలంగాణకు మరో రూ.45,500 కోట్ల పెట్టుబడులు.. సన్ పెట్రో కెమికల్స్‌తో కీలక ఒప్పందం

దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై తెలంగాణ మరో సారి భారీ పెట్టుబడులను ఆకర్షించి కొత్త రికార్డు సాధించింది. ఇంధన రంగంలో ప్రముఖ సంస్థ సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందంపై (ఎంవోయూ) సంతకం చేసింది. ఈ ఒప్పందం ద్వారా నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో మూడు భారీ పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. ఇవి 5,440 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్తు …

Read More »

 డబ్బు కోసం టెకీ అత్యాశ.. డ్రగ్స్‌ పెడ్లర్‌ అవుదామని స్కెచ్‌ వేశాడు! కట్‌చేస్తే..p

మంచి జీతంతో పేరు గాంచిన సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొలువు చేస్తున్న అతగాడి బుర్రలో ఓ చెత్త ఐడియా వచ్చింది. అప్పటికే డ్రగ్స్ బానిసై వచ్చిన జీతం వచ్చినట్లు ఖాళీ అవుతుంటే అడ్డదారిలో వేగంగా డబ్బు సంపాదించాలనే దురాశ పుట్టింది అతడిలో. అంతే కారెక్కి నేరుగా పూణె వెళ్లి రూ.21 లక్షల విలువైన డ్రగ్స్ తో హుషారుగా వస్తుండగా రోడ్డుపై ఊహించని షాక్ తగిలింది..సాఫ్ట్ వేర్ ఉద్యోగుల లైఫ్ చాలా బాగుంటుంది. వాళ్ళకు వచ్చే జీతం కూడా లక్షల్లో ఉంటుంది. వారి లైఫ్‌స్టైల్‌ కూడా …

Read More »

 తెలంగాణ గవర్నర్‌ ప్రతిభా అవార్డులు 2024 ప్రకటించిన రాజ్ భవన్.. పూర్తి జాబితా ఇదే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీయేటా వివిధ రంగాల్లో విశేష కృషి అందించిన సంస్థలు, వ్యక్తులకు గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి కూడా అవార్డులను ప్రధానం చేయనుంది. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీటిని ప్రధానం చేయనున్నారు. మొత్తం జాబితా ఈ కింద తెలుసుకోవచ్చు..వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు అందించే గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ గవర్నర్‌ కార్యాలయం తాజాగా ప్రకటించింది. ఈ అవార్డులకు మొత్తం 8 మంది ఎంపికైనట్లు వెల్లడించింది. ఈ మేరకు …

Read More »