తెలంగాణ

రూ.2 లక్షల వరకు రుణమాఫీ.. ఆ పైన లోన్ ఉన్న వారి పరిస్థితేంటి..?

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో ప్రధానమైంది రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని.. వరంగల్ డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆరు గ్యారంటీల్లోనూ ఇదే ప్రధానమైన హామీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది. మెుత్తం మూడు విడతల్లో ఈ హామీ అమలైంది. మూడో విడతలో భాగంగా రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రైతులకు మాఫీ …

Read More »

HYD: ఘోర ప్రమాదం.. బస్సు కిందికి దూసుకుపోయిన ఆటో.. టెన్త్ అమ్మాయి మృతి

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హబ్సిగూడ‌ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ స్కూల్ ఆటో.. అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో అతివేగంతో రావటం వల్ల.. బస్సు వెనకాల కిందకు దూసుకుని వెళ్లింది. ఈ ఘటనలో.. ఆటో డ్రైవర్‌తో పాటు అందులో ఉన్న పదో తరగతి విద్యార్థిని బస్సు కింద ఉరుక్కుపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సహాయంతో ఆటోను బస్సు కింద నుంచి తొలగించారు. అమ్మాయితో పాటు ఆటో డ్రైవర్‌ను హుటాహుటిన …

Read More »

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. 9 నెలల క్రితమే తండ్రి, ఇప్పుడు కొడుకు..!

అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేశ్ 2015లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. మధ్యలో రెండుసార్లు స్వగ్రామానికి వచ్చి.. తిరిగి వెళ్లాడు. అయితే.. తొమ్మిది నెలల క్రితమే రాజేష్ తండ్రి చనిపోగా.. ఆయన అంత్యక్రియలకు కూడా రాజేష్ రాలేకపోయాడు. తలకొరివి పెట్టడానికి రాకపోవటంతో.. తండ్రి సంవత్సరికానికి వస్తానని చెప్పాడు. కానీ.. ఇంతలోనే రాజేష్‌ చనిపోయాడన్న విషాద వార్త కుటుంబాన్ని …

Read More »

‘రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడబోయే’.. హరీష్ టార్గెట్‌గా ఫ్లెక్సీలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట కొందరు ఈఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హరీశ్ రావు రాజీనామాకు వారు డిమాండ్ చేశారు. ‘దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు …

Read More »

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. కాసేపట్లో భారీ వర్షం, జాగ్రత్తగా ఉండండి

హైదరాబాద్ నగరవాసులకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. కాసేపట్లో నగరంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత, లేదా రాత్రికి నగరంలో భారీ వర్షానికి ఛాన్స్ ఉందన్నారు. మధ్యాహ్నం వరకు వాతావరణం చాలా తేమగా ఉంటుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా క్యుములోనింబస్ తుఫానులు వస్తాయని హెచ్చరిచారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఉత్తర తెలంగాణలోనూ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, …

Read More »

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా విలయం.. నగరం అతలాకుతలం..!

హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వాన కురుస్తుండటంతో.. నగరంలోని రహదారులన్ని ఒక్కసారిగా జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్లపైనే వర్షంలో తడిసి ముద్దయిపోయారు. చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో… లోతట్టు …

Read More »

బిగ్ ట్విస్ట్.. కవితకు నో బెయిల్.. ఆ నిందితునికి మాత్రం భారీ ఊరట..!

Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజులో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ కేసులో సుమారు 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఇటీవలే బెయిల్ దొరకగా.. ఇప్పుడు ఈ కేసులో నిందితునిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం.. మరో రెండు వారాలు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అదనపు సొలిసిటర్ జనరల్ …

Read More »

అర్హులైనా రైతు రుణమాఫీ కాలేదా..? గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ. పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ. 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం జులై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మెుత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్ష, రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న మూడో విడతగా రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ …

Read More »

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లపైకి భారీగా వరద, బయటకెళ్లేవారు జాగ్రత్త

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వరుణుడు దంచికొడుతున్నాడు. జోరువానతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ప్రధానంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎర్రమంజిల్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, బాలానగర్, మెుహదీపట్నం, చౌలిచౌకి, యూసఫ్‌గూడ, మసాబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6.40 గంటలకు మెుదలైన వాన గంట నుంచి కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వరదతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు …

Read More »

రైతులకు మరో శుభవార్త.. ఖాతాల్లోకి ఒకేసారి 15 వేలు.. ముహూర్తం అప్పుడే..!?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వరుసగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. పలు పథకాలను అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్ఠాత్మకమైన రుణమాఫీ హామీని అమలు చేస్తోంది. ఆగస్టు 15లోపు రాష్ట్రంలోని అన్నదాతలందరికీ 2 లక్షల మేర రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఇప్పటికే రెండు విడతల్లో రుణాలు మాఫీ చేసిన సర్కార్.. ఇప్పుడు మూడో విడతకు సిద్ధమైంది. ఆగస్టు నెల పూర్తయ్యేలోపు 2 లక్షల రుణమాఫీ …

Read More »