పిల్లల్ని మార్చి.. నమ్మిన దంపతుల్ని ఏమార్చి, చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డ సృష్టికర్తలు ఎట్టకేలకు నేరం ఒప్పుకున్నారు. ఔను.. సరొగసీ పేరుతో పచ్చిమోసానికి పాల్పడ్డాం, దగా చేశాం, డాక్టర్ల వేషంలో దందాలు చేశాం అని లెంపలేసుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ అక్రమాల కేసు దర్యాప్తులో ఇదొక కీలక పరిణామం. సంతాన సాఫల్యం ముసుగులో అడ్డగోలు సంపాదనకు తెగించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కథ క్లయిమాక్స్‌కు చేరినట్టే ఉంది. గత వారంలో అరెస్టయిన డాక్టర్ నమ్రత కస్టడీ నిన్నటితో ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు …
Read More »తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ పర్సన్ వెంకటేష్ నాయుడు.. ఇంతకీ ఇతను ఎవరివాడు…?
ఏపీలో లిక్కర్ స్కాం సృష్టిస్తోన్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ ఎపిసోడ్‌లో రెండు రోజులుగా ఓ వ్యక్తి గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కాంను మించి ఆ వ్యక్తి గురించి ఎందుకు అంత చర్చ నడుస్తుంది. ఎవరా వ్యక్తి? అతని వెనుక ఉన్నది ఎవరు? చెరుకూరు వెంకటేష్ నాయుడు, s/o తిరుపతి నాయుడు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో నివాసం. 36 ఏళ్ల వెంకటేష్ నాయుడు, లిక్కర్ కేసులో ఏ34 అనూహ్యంగా తెరపైకి వచ్చాడు. లిక్కర్ స్కాం డబ్బును తరలించడానికి సహకారం అందించారని ఆరోపణలు …
Read More »తెలంగాణకు గుడ్ న్యూస్.. కిషన్ రెడ్డి చొరవతో రాష్ట్రానికి 2 క్రిటికల్ మినరల్ రీసెర్చ్ సెంటర్స్
తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ పరిశోధన కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ఏడు సెంటర్లలో రెండు హైదరాబాద్‌కి కేటాయించడం విశేషం. ఇది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ ఫలితంగా సాధ్యమైంది. ఈ కేంద్రాలు రాష్ట్ర యువతకు పరిశోధన, ఉద్యోగాలు, స్టార్టప్ అవకాశాల గేట్‌వేలా మారనున్నాయి. ఐటీ, స్టార్టప్‌లు, బయోటెక్, రీసెర్చ్… ఏ ఫీల్డ్ తీసుకున్నా హైదరాబాద్ పేరు వినిపించకమానదు. ఇప్పుడు అదే హైదరాబాద్‌కి మరొక అరుదైన గౌరవం దక్కింది. ఇండియాలోనే అత్యవసరంగా కావాల్సిన కీలక ఖనిజాలపై జరగనున్న రీసెర్చ్‌కు కేంద్ర …
Read More »శివార్లలో డ్రగ్స్ పార్టీలకు చెక్ పెట్టడానికి పోలీసుల నయా వ్యూహం
వీకెండ్ వస్తే…హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లు.. డ్రగ్స్ పార్టీలతో దద్దరిల్లిపోతున్నాయి. మత్తు పార్టీల కోసం ఐసోలేటెడ్ ఏరియాలో ఫామ్‌హౌస్‌లను ఎంచుకుంటున్నాయి ఎంజాయ్ బ్యాచ్‌లు. దీంతో నగర శివార్లలో డ్రగ్స్ పార్టీలకు చెక్ పెట్టడానికి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. చేవెళ్లలోని సెరేన్ ఆర్చర్డ్స్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ ముసుగులో డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. అభిజిత్ బెనర్జీ అనే ఐటీ ఎంప్లాయీ ఈ బర్త్‌డే పార్టీ ప్లాన్ చేశాడు. తనతో పాటు పనిచేసే సిప్సన్, పార్థ్ గోయల్, పల్లప్ప యశ్వంత్ …
Read More »ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా.. ముప్పేట దాడితో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి..!
ప్రతిపక్షానికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతుంది అధికార పక్షం. మొన్న ఫోన్ ట్యాపింగ్, తాజాగా కాళేశ్వరం కమిషన్ అంటూ.. ముప్పేట దాడితో.. బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇదే అదునుగా ప్రత్యర్థి బీజేపీ సైతం తన పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ నేతలకు గాలం వేసింది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు గడ్డు కాలం నడుస్తుంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కొనసాగుతుండగానే, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రూపంలో బీఆర్ఎస్‌పై మరో పిడుగు పడింది. నేడో, రేపో స్థానిక ఎన్నికలంటూ …
Read More »వీడికేం పోయేకాలం సామీ..! ఏకంగా 500 మంది మహిళలను మోసం చేశాడు.. అసలు మ్యాటర్ తెలిస్తే!
జల్సాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నమ్మించి నిండా ముంచాడు. ముద్ర రుణాలు ఇప్పిస్తానంటూ సుమారు 500 మంది మహిళలను మోసం చేశాడు. పక్కా సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఐఎస్ సదన్ పోలీసులు అతగాడిని అదుపులోకి తీసుకోవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేరు.. షేక్ జానీ.. మరో పేరు.. హరినాథ్ రావు.. ఊరు నల్గొండ జిల్లా నకిరేకల్. ఇంటర్ ఫెయిలైన జానీ.. బతుకు దెరువు కోసం 2011లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు.. సరూర్‌నగర్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో …
Read More »తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే ముప్పే!
వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులు భయపెడుతుంటాయి. వర్షాలతో కొత్త నీరు రాక, దోమల కారణంగా ప్రజలు ఎక్కువగా వ్యాధుల బారినపడుతుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో అధికారికంగా వందల కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో అత్యధిక కేసులు నమోదవుతున్నట్లు నిర్ధారణ అయింది. దోమ కాటువల్ల వచ్చే డెంగ్యూ జ్వరం సోకితే అప్రమత్తత చాలా అవసరం అంటున్నారు నిపుణులు. డెంగ్యూ వ్యక్తులు సరైన వైద్య పరీక్షలు చేయించుకుని, సమయానుకూలంగా చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. డెంగ్యూ జ్వరం ఎడిస్ ఈజిప్టి …
Read More »మళ్లీ వర్షాలు వచ్చేశాయోచ్..! తెలుగు రాష్ట్రాలకు భారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు..!
ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు చోట్ల కుంభవృష్టి వానతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ముఖ్యంగా.. తెలంగాణలోని పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. పలు …
Read More »ప్రత్యక్షంగా, పరోక్షంగా వారిద్దరే బాధ్యులు.. కేబినెట్ ముందుకు కమిషన్ రిపోర్ట్!
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ప్రాజెక్ట్ వైఫల్యానికి నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బాధ్యులని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని.. అయినప్పటికీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఆ నివేదికను తొక్కి పెట్టారని కమిషన్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో …
Read More »కూతురు అమెరికా నుంచి డబ్బులు పంపింది.. బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వెళ్తుండగా
బైంసాలో పట్టపగలే చోటుచేసుకున్న చోరీ కలకలం రేపింది. అమెరికాలో ఉన్న కూతురు పంపిన రూ.5 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తి… తినేందుకు బార్ అండ్ రెస్టారెంట్‌లోకి వెళ్లిన క్షణాల్లోనే స్కూటీ డిక్కీ నుంచి డబ్బులు గల్లంతయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో సోమవారం నాడు మధ్యాహ్న సమయంలో చోరీ జరిగింది. ముథోల్ మండలానికి చెందిన ఎడ్‌బిడ్ గ్రామవాసి బొంబోతుల ఆనంద్ అమెరికాలో ఉన్న తన కూతురు పంపిన డబ్బును బ్యాంకు నుంచి …
Read More »