నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి.. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకట చేసింది.. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనం వ్యవస్థల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40 కి.మీ.వేగంతో ఈదురు గాలులతో.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. …
Read More »తెలంగాణ ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ.. 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
ఆరోగ్యశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఆరోగ్యశాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిషికేషన్ జారీ చేసింది.రెండ్రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా మరో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈమేరకు జూన్ 10 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలకనుంది. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసినట్లు …
Read More »మీరు ఏటీఎంకి వెళ్లి ఇలా చేస్తున్నారా.. అయితే బీకేర్‌ఫుల్!
మీరు ఏటిఎంలో డబ్బులు డ్రా చేయడానికి లేదా.. డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారా.. ఆలా ఏటీఎంకి వెళ్లినప్పుడు మీరు ఫోన్‌లో మాట్లాడుతూ.. పక్కనే ఉన్న వారు డబ్బులు తీసేందుకు హెల్ప్ చేస్తామాంటే ఒకే చెబుతున్నారా.. అయితే బీకేర్‌పుల్.. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు ఇలానే మిమ్మల్ని మాటల్లో పెట్టి సాయం చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడవచ్చు. తాజాగా ఇలానే ఓ వ్యక్తికి సహాయం చేస్తున్నట్లు నమ్మించిన బాధితుడి అకౌంట్ నుంచి సుమారు రూ.31 వేలు డ్రాచేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో వెలుగుచూసింది. …
Read More »ఫోన్ ట్యాపింగ్ కేసు.. వారందరికీ KTR వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవంటూ..
తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ నేతలపై అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర …
Read More »భాగ్యనగరంలో ఈ సరస్సులు సూపర్.. కచ్చితంగా చూడాలి..
హైదరాబాద్ తెలంగాణ పరిపాలనా కేంద్రం. దీని చారిత్రక కట్టడాలు, ఐటీ సంస్థలకు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక్కడ అందమైన సరస్సులు ప్రశాంతమైన సహజ ప్రకృతి దృశ్యాలు కలిగి ఉంటాయి. ఇవి పిక్నిక్, బోటింగ్ కోసం మంచి ఎంపిక. మరి భాగ్యనగరం చుట్టూ పక్కల ఉన్న 5 ఉత్తమ సరస్సులు ఏంటి.? ఈరోజు తెలుసుకుందామా.. హుస్సేన్ సాగర్ సరస్సు: 1563లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో హైదరాబాద్ ప్రసిద్ధ సరస్సులలో ఒకటైన హుస్సేన్ సాగర్ నిర్మించబడింది. ఈ సరస్సు 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి …
Read More »బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌ను తరలించండి.. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భయాందోళన..
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత.. దేశంలోని ఎయిర్ పోర్టుల సమీపంలో నివాసం ఉండే ప్రజలు వణికిపోతున్నారు. సాధారణంగానే ఫ్లైట్స్ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పెద్ద శబ్దం చేస్తుంటాయి. ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ సమీపంలో నివాసం ఉండే వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం. ఇక.. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత.. ఎయిర్‌పోర్టుల సమీపంలో ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే.. DGCAకి కంటోన్మెంట్ వికాస్ మంచ్ లేఖ రాసింది. బేగంపేట ఎయిర్ పోర్ట్ తరలించాలని డిమాండ్ చేసింది. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌ను దుండిగల్‌కు తరలించాలని …
Read More »కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ బాస్.. ఆ నేతల మధ్యనే తీవ్ర పోటీ..! ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు
ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటూ సాగుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికపై క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. అయితే స్టేట్ పార్టీకి కొత్త బాస్ ఎవరు అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ పదవి కోసం మేం ప్రయత్నించడం లేదని కొందరు చెబుతుంటే.. అంతా హైకమాండ్ చూసుకుంటుందన్నది ఇంకొందరి వాదన. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మరికొద్ది రోజుల్లోనే సమాధానం రాబోతున్నట్టు తెలుస్తోందితెలంగాణలో ఈసారి అధికారం మాదే. రాష్ట్రంలో మేం అధికారంలోకి రాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. తెలంగాణలోని బీజేపీ నేతలు పదే పదే చాలా …
Read More »ప్రముఖ న్యూస్ యాంకర్ ఆత్మహత్య..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఇన్‌స్టా పోస్ట్
ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత 18 ఏళ్లుగా తెలుగు మీడియాలో పనిచేసిన స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు.గత 18 ఏళ్లు తెలుగు మీడియాలో న్యూస్ యాంకర్‌గా, జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం టీ న్యూస్ ఛానెల్ లో టీవీ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం …
Read More »తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13 వరకు జరిగిన టెన్త్ సప్లి ఎగ్జామ్ పేపర్స్ ను జూన్ 14 నుంచి 16 వరకు స్పాట్ వాల్యూయేషన్ చేశారు. పదో తరగతి సప్లీమెంటరి పరీక్షలకు 42,834 మంది దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 28,415 మంది ఉత్తీర్ణలయ్యారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 71.05 శాతం, బాలికలు 77 శాతం ఉత్తీర్ణత …
Read More »ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. పూర్తి వివరాలు ఇదిగో..!
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ప్రవేశాల కోసం ఎప్ సెట్ రాసి ర్యాంకులతో ఎదురుచూస్తున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 28 నుంచే కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 28 ప్రారంభం అవుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్: జూన్ 28న ప్రారంభం కానున్న మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ …
Read More »