తాజాగా మంత్రి సీతక్కపై వెలుగులోకి వచ్చిన మావోయిస్టు లేఖపై ఆమె స్పందించారు. ఇది నిజమైన బెదిరింపు లేక రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అనేది తెలియాల్సి ఉందని అన్నారు. ఆదివాసి మహిళగా తనకు మంత్రి పదవి రావడం కొందరికి జీర్ణం కాలేదని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.మావోయిస్టుల పేరుతో ఇటీవలె మంత్రి సీతక్కపై ఒక లేఖ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆ లేఖపై సీతక్క స్పందించారు. ఆ లేఖలో ములుగులో ఆదివాసీల గెంటివేతపై ఎందుకు మాట్లాడటం లేదు? తెలంగాణలో ఆదివాసీల పరిరక్షణ బాధ్యత …
Read More »బోనాల సంబరాలు షురూ.. గోల్కొండ జగదాంబికకి తొలి బోనం సమర్పణ..క్యూ కట్టిన రాజకీయ నేతలు, భక్తులు
తెలంగాణలో బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి.. సల్లంగా చూడమని వేడుకుంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది కూడా బోనాల సంబురం మొదలు కాగా.. వచ్చే నెల 24న ముగుస్తాయి. బోనాల పండుగ ప్రారంభంతో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర ప్రారంభం నేపథ్యంలో తొలి …
Read More »మావోల నుంచి బెదిరింపులు.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు భద్రత పెంపు!
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్‌రావుకు భద్రత పెంచాలని నిర్ణయించింది. మావోయిస్టుల నుంచి ఇటీవల రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన భద్రతపై పోలీస్ శాఖ ధృష్టి సారించింది. ఈ బెదిరింపు కాల్స్‌పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, ఆయనకు అదనపు భద్రత అవసమని నిర్ణయించారు. ఈ మేరకు రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాలని మెదన్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.అయితే ఇటీవల మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని …
Read More »ఎంతకు తెగించార్రా.. CID.. సుప్రీం కోర్టు.. చీఫ్ జస్టిస్.. అంతా ఫేక్! దారుణంగా మోసపోయిన ఉద్యోగి
కాప్రాకు చెందిన రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని, సైబర్ నేరస్థులు సుప్రీం కోర్టు, ఆర్బీఐ పేరుతో మోసం చేశారు. ఢిల్లీ పోలీసులమంటూ ఫోన్ కాల్ చేసి, మనీలాండరింగ్ కేసు నమోదైందని బెదిరించి, కోర్టు సెక్యూరిటీ పేరుతో రూ.22.05 లక్షలు గుట్టుచప్పుడు లేకుండా మోసం చేశారు. బాధితుడు తనకు తెలిసిన వారి సహాయంతో మోసం గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మోసం చేసేందుకు కేటుగాళ్లు ఏమైనా చేసేలా ఉన్నారు. ఏకంగా భారత దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా వాడేసుకున్నారు. గతంలో పోలీస్ యూనిఫామ్‌లో కొంతమంది ఫేక్ …
Read More »నమ్మకంగా ఉంటూ నిండా ముంచాడు.. ఓనర్‌కు భలే షాక్ ఇచ్చిన కలెక్షన్ బాయ్..!
హైదరాబాద్ మహానగరంలో ఓ కలెక్షన్ బాయ్ వ్యవహారం తన షాప్ యజమానికి హార్ట్ ఎటాక్ తెప్పించేంత పని అయ్యింది. తనని నమ్మి యజమాని పని అప్పచెపితే, తన అవసరం కోసం సోమ్ము చేసుకుని వాడుకున్నాడు. తీరా యజమాని పోలీసులను ఆశ్రయించడంతో కటకటాల పాలయ్యాడు. నమ్మిన బంగారు దుకాణం వ్యాపారికి టోకరా ఇచ్చిన ఉద్యోగి 7లక్షల రూపాయలతో కలెక్షన్ ఏజెంట్ పరార్ అయ్యాడు. నిందితుడిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతడి వద్ద నుండి రూ .6లక్షల 42 వేల …
Read More »ఫోన్ టాపింగ్ చేసే అధికారం ఎవరిది? టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెబుతోంది..?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతల వాంగ్మూలం తీసుకున్నా పోలీసులు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ టాపింగ్ గురించి చర్చ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది రాజకీయ నాయకులను మొదలుకుని జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను సైతం టాప్ చేశారంటూ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అసలు నిజంగానే ఇంతమంది ఫోన్లను టాప్ చేసే అధికారం ప్రత్యేక అధికారులకు ఉంటుందా..? ఎవరి అనుమతులు తీసుకొని ఇంత మంది ఫోన్లను …
Read More »మరోసారి సీఎం కుర్చీపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
సీఎం సీటుపై మరోసారి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఐదేళ్లు సీఎంగా ఉండేందుకు రేవంత్ రెడ్డి ఆల్‌రెడీ ప్రజల ముందు అప్పీల్ పెట్టుకున్నారని.. ఆయన దిగిపోయిన తర్వాత (9 ఏళ్ల) ముఖ్యమంత్రి అయ్యేందుకు తాను ప్రయత్నిస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలపై కూడా జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.గురువారం ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సీఎం సీటుపై మరోసారి …
Read More »కజకిస్తాన్ రాయబారితో నవాబ్ మీర్ కీలక భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ఎయిర్ కనెక్టివిటీ, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి హైదరాబాద్, అల్మట్టి మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని డాక్టర్ ఖాన్ ప్రతిపాదించారు. ఈ విమాన సర్వీసుల ద్వారా వైద్య, పర్యాటకానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, కజకిస్తాన్ పౌరులకు హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఆరోగ్య.. హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి కార్యాలయంలోని గౌరవ సలహాదారుడు డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ ఇటీవల ఢిల్లీలో రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి అజామత్ యెస్కరాయేవ్‌ను కలిశారు. అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన కజకిస్తాన్ రాయబారి.. ఏపీ, …
Read More »తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలల్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు!
తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిఏ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉప్పల్ ఆర్టిఏ కార్యాలయంతో పాటు తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ప్రధానంగా ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి బ్రోకర్ల చేతివాటం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సహకారం వంటి అంశాలపై ఏసీబీ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. గతంలోనూ మే 28న ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న …
Read More »వారంలో రెండుసార్లు విజిట్.. వారికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని అనేక సార్లు ప్రకటించిన రేవంత్ సర్కార్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే.. విద్యాశాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా.. తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు సార్లు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎం …
Read More »