తెలంగాణ

ఇలాంటివి మళ్లీ రిపీట్‌ అయితే.. చట్టపరమైన చర్యలు తప్పవు- TGSRTC ఎండీ సజ్జనార్!

ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్పడితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ హెచ్చరించారు. పోలీస్ శాఖ స‌హ‌కారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామ‌ని ఆయ‌న స్పష్టం చేశారు. ఇటీవల దుండగుల చేతిలో దాడికి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న డ్రైవర్‌ విద్యాసాగర్‌ను పరామర్శించిన తర్వాత సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల కాలంలో ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మెహదీపట్నం …

Read More »

ముందు తలలో నాలుకలా మెలిగాడు – అందరికీ నమ్మకం కుదిరాక దుకాణం బంద్

భవిష్యత్తు అవసరాల కోసం కొందరు కూలీ, నాలీ చేసుకుని.. మరికొందరు రేయింబవళ్లు కష్టపడి పైసాపైసా కూడబెడతారు. అవసరానికి పనికి వస్తాయని చిట్టీలు వేస్తారు. కుటుంబ అవసరాల కోసం చిన్న మొత్తాలను చిట్టీల రూపంలో పొదుపు చేసుకుంటారు. అమాయక ప్రజల బలహీనతలను ఆసరగా చేసుకుని ఓ వ్యాపారి బిచానా ఎత్తివేశాడు. చిట్టీల పేరుతో నమ్మకంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యాపారి బురిడి కొట్టించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం శాంతినగర్‌కాలనీకి చెందిన కటకం సైదిరెడ్డి నివాసమున్నాడు. తన మంచి మాటలతో కాలనీవాసులందరినీ పరిచయం చేసుకున్నాడు. కాలనీ …

Read More »

రైతు నేస్తం.. మరో సభకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..

కాంగ్రెస్ సర్కార్ మరో సభకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందించిన రైతు భరోసాపై.. ప్రభుత్వ విజయాన్ని ప్రజల మధ్య పంచుకునేందుకు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో “రైతు భరోసా విజయోత్సవ సభ” నిర్వహించనున్నట్టు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు …

Read More »

రూ.10 లక్షలకు అమ్ముడైన ఆవు..! అంత భారీ ధర ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గుమ్మి రామిరెడ్డి గారి గోశాలలోని గిర్ జాతి ఆవు రూ. 10 లక్షలకు అమ్ముడుపోయింది. రోజుకు 16 లీటర్ల పాలను ఇచ్చే ఈ ఆవు యొక్క అద్భుతమైన పాల దిగుబడి దీనికి కారణం. ఈ ఆవును ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాకు చెందిన అమిత్ కిషన్ కొనుగోలు చేశారు.సాధారణంగా ఓ ఆవు ధర ఎంతుంటుంది.. రూ.10 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉంటుంది. బాగా పాలిచ్చే ఆవు అయితే రూ.60 వేల ధర పలుకుతుంది. కానీ, ఈ …

Read More »

చూడ్డానికి ఎంత అమాయకంగా ఉన్నాడో.. పెళ్లి అయ్యాక అందర్నీ వదిలేసి మెట్టినింటికి వచ్చిన ఆమెను..

కొత్త జీవితం మొదలై రెండు నెలలే అయింది.. ఇంతలోనే భర్త వేధింపులు మొదలయ్యాయి.. అటు భర్త వేధింపులు తట్టుకోలేకపోయింది.. ఇటు పుట్టింటికి ఏం చేప్పాలో అర్ధం కాలేదు.. దీంతో ఆమె జీవితం ఉక్కిరిబిక్కిరైంది.. పెళ్లైన రెండు నెలలకే భర్త టార్చర్ తో జీవితం మీద విరక్తి ఏర్పడింది.. మనస్థాపంతో కుమిలిపోయింది.. చివరకు ప్రాణాలు తీసుకునేలా దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది.. భర్త వేధింపులతో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్‌ …

Read More »

D-రిజర్వ్డ్‌ టికెట్‌ గురించి తెలుసా..? రిజర్వేషన్‌ లేకుండానే స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణించవచ్చు!

దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన డి-రిజర్వ్డ్ టిక్కెట్ల గురించి మీకు తెలుసా? ఇవి రైలు బయలుదేరే ఒక గంట ముందు రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. ఖాళీ స్లీపర్ బెర్తుల్లో ప్రయాణించేందుకు ఇవి అనుమతిస్తాయి. గరిష్టంగా 100 కి.మీ దూరం వరకు ప్రయాణించవచ్చు. రైళ్లలో లాంగ్‌ జర్నీ చేసేవారు.. ముందుగానే రిజర్వేషన్‌ చేయించుకుంటారు. కొన్ని సార్లు సడెన్‌గా ఎక్కడికైనా వెళ్లా్ల్సి వచ్చిన సమయంలో తత్కాల్‌ టిక్కెట్ల కోసం చూస్తారు. అవి కూడా దొరకకుంటే.. ఇక వారికి జనరల్ బోగీలో దిక్కు. ఇక జనరల్‌ …

Read More »

కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టిక్కెట్ లొల్లి.. అజహరుద్దీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం అధికార కాంగ్రెస్‌లో పానిపట్టు యుద్దమే జరుగుతోంది. ఏకంగా అరడజను మంది బీఫామ్ కోసం క్యూకట్టారు. పార్టీ నిర్ణయం కంటే ముందే ప్రకటనలు చేయడం ఆసక్తిగా మారింది. దీనిపై టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.. అదేం కుదరదు. ఇంకా ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికివ్వాలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేదంటూ అజహరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్ సమరం అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి …

Read More »

సినిమాల్లో ఛాన్స్‌ కావాలా? ఐతే ఈ కోర్సులు చేయండి.. వయసు ఎంతైనా ఓకే!

సినిమాలు, షార్ట్‌ ఫిల్మ్‌లు పుణెలోని ఫిల్మ్ అండ్‌ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో ప్రవేశాలు పొందండి. 2025-26 విద్యాసంవత్సరానికి సినిమా, టెలివిజన్ రంగాల్లో ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (MFA), ఏడాది పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ FTII నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నటన మాత్రమే కాదు దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ రైటింగ్, ఎడిటింగ్, సౌండ్‌ రికార్టింగ్ ఇలా తదితర రంగాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే రాత పరీక్ష …

Read More »

డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే?

ఎల్‌ఐసీ హైసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఐసీ హెచ్‌సీఎల్‌) దేశ వ్యాప్తంగా పలు బ్రాంచుల్లో.. అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు జూన్‌ 28, 2025వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు సమయం ముగిసేలోపు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 250 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఏపీలో 20, …

Read More »

హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 7 విమానాల రద్దు.. కారణం అదేనా?

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)దేశవ్యాప్తంగా విమానయాన భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అందువల్ల విమాన కంపెనీలు అనేక విమానాలను గ్రౌండ్ చేయాల్సి వచ్చింది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణాలపై పడింది. హైదరాబాద్ శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం(జూన్ 20) ఎయిర్ ఇండియా నాలుగు అంతర్జాతీయ, మూడు దేశీయ విమాన సర్వీసులను రద్దు …

Read More »