తెలంగాణ

అలర్ట్.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల వెదర్ అప్‌డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. శుక్రవారం, శనివారం తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఈ రెండు రోజులు తెలంగాణలో అన్ని జిల్లాలలో …

Read More »

ఏపీ, తెలంగాణ సహా 7 రాష్ట్రాల్లో అత్యధికంగా టెన్త్‌, ఇంటర్‌ ఫెయిల్‌ విద్యార్ధులు.. కేంద్రం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా అస్సాం, కేరళ, మణిపుర్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 7 రాష్ట్రాల్లో గత ఏడాది ఫెయిలైన విద్యార్థులు 66 శాతంగా ఉన్నారని కేంద్రం తెలిపింది. 10, 12 తరగతులకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ సిఫార్సు చేశారు..పరీక్షల్లో విద్యార్థుల ఫెయిల్‌ శాతం అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ తరగతులకు కామన్‌ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర విద్యా శాఖ సూచించింది. …

Read More »

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. 3 రోజులు పాఠశాలలకు సెలవులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వేసవి సెలవులు ముగిసి ఈనెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు విద్యార్థులకు ఏకంగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులకు పండగే.. పండగ. మరి ఈ సెలవులు ఎందుకు వస్తున్నాయి? అన్ని పాఠశాలలకు వర్తిస్తాయా? లేదా అనేది తెలుసుకుందాం.. పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులు ఎగిరి గంతులేస్తారు. గత వారం కిందటనే ప్రారంభమైన పాఠశాలలు ఇప్పుడు మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర …

Read More »

త్వరలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వైఫై…!

త్వరలో తెలంగాన ఆర్టీసీ బస్సుల్లో వై-ఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. ఢిల్లీకి చెందిన ప్రైవేటు సంస్థ, బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో ముందుగా అప్‌లోడ్ చేసిన సినిమాలు, పాటలు అందించడంపై ప్రతిపాదనలు చేసింది. వాటి మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం పంచుకోనే విధానంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది.ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ సంక్షేమంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ సర్కార్.. తాజాగా బస్సుల్లో సాంకేతికను పెంచే అంశంపై దృష్టి పెట్టింది. త్వరలో …

Read More »

ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ఈ ఏడాది సర్కారు నిరాకరించింది. ఇష్టారీతిన ఫీజుల పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త ఫీజుల అధ్యయనానికి కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఫీజుల అంశంపై భేటీ అయిన టీఏఎఫ్ఆర్సీ – తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఈ యేడాది పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జులై మొదటి వారంలో ఎప్ సెట్ కౌన్సిలింగ్ జరగనుంది. …

Read More »

కేసీఆర్ ప్రభుత్వం, షర్మిలమ్మ పోన్ ట్యాప్ చేసిందా..? వైఎస్ జగన్ తొలి స్పందన ఇదే!

తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తోంది. ఈ అంశంలో ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగింది నిజమేనన్న షర్మిల.. కేసీఆర్‌, జగన్‌ కలిసే ఆ ఇన్ఫర్మేషన్‌ను షేర్‌ చేసుకున్నారని ఆరోపించారు. తన ఫోన్‌ను, తన భర్త ఫోన్‌ను ట్యాప్‌ చేశారని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. షర్మిల …

Read More »

అయ్యో భగవంతుడా.. ఇదేంటయ్యా..! చనిపోయిన మరుసటి రోజే ఉద్యోగం వచ్చినట్లు సమాచారం..

భవిష్యత్‌పై కోటి ఆశలతో కష్టపడి ఇష్టంగా చదివాడు.. పోలీస్ అవ్వాలని.. దేశ భద్రత కోసం సీఆర్పీఎఫ్ లో పని చేయాలని ఎన్నో కలలు కన్నాడు. దీని కోసం అన్ని విధాలుగా సిద్ధమై.. సక్సెస్ అయ్యాడు.. సీఆర్‌పీఎఫ్ పరీక్షలు సైతం రాశాడు.. మరికొన్ని గంటల్లోనే పరీక్ష ఫలితాలు వస్తాయనగా.. ఇంతలోనే విధి వంచించింది.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం వి వెంకటాయ పాలెం గ్రామానికి చెందిన బానోత్ మణిచంద్ర నాయక్ (22) అనే యువకుడు …

Read More »

సెల్‌ఫోన్‌ సమర్పించాలన్న ఏసీబీ నోటీసులకు కేటీఆర్‌ రిప్లై.. ఏమన్నారంటే?

ఫార్ములా-ఈ రేస్ కేసులో మొబైల్ ఫోన్ సమర్పించాలని కోరుతూ ACB జారీ చేసిన నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ.. ఏసీబీ అధికారుల తీరు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తుందని KTR తన లేఖలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి కేసులలో అదే విషయాన్ని పేర్కొందని ఏసీబీకి రాసిన లేఖలో రాసుకొచ్చారు.తెలంగాణలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం …

Read More »

జంతు హింస.. పాలమూరు బయోసైన్సెస్‌పై కేసు నమోదు! ఆ ఇన్‌ఫెక్షన్లు మనుషులకు కూడా ప్రమాదమే..?

పాలమూరు బయోసైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో తీవ్రమైన జంతుహింస జరుగుతోందని జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై బూత్‌పూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కర్వెనలోని ల్యాబొరేటరీలో జంతువుల మందులు, పెస్టిసైడ్లు, వైద్య పరికరాల పనితీరును పరీక్షించడానికి అశాస్త్రీయంగా పరిశోధనలు చేస్తున్నారని ‘పెటా ఇండియా’ శాస్త్రవేత్త, రీసెర్చ్‌ పాలసీ అడ్వైజర్‌ డా.అంజనా అగర్వాల్‌ గతంలో సంచలన ఆరోపణలు చేశారు. పాలమూరు బయోసైన్సెస్‌లో 800 శునకాలను ఉంచేందుకు కేటాయించిన స్థలంలో సుమారు 1,500 ఉంచారు. దీనివల్ల అవి తరచూ …

Read More »

రైతులకు సంకెళ్లు.. రేవంత్ సర్కార్ ఆగ్రహం.. ముగ్గురు పోలీసు అధికారుల సస్పెండ్..

జోగుళాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ శివారులోని ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటనపై రేవంత్‌ సర్కార్‌ సీరియస్‌ అయింది. ఇథనాల్ ఫ్యాక్టరీ విధ్వంసం కేసులో అరెస్టయిన 12 మంది రైతులను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో సంకెళ్లు వేయడాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు.. ఒక ఆర్‌ఎస్సై , ఇద్దరు ఏఆర్‌ఎస్సైలను సస్పెండ్ చేశారు. ముగ్గురు సస్పెన్షన్‌కు సంబంధించి ఉత్తర్వులు …

Read More »