తెలంగాణ

కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారికి బిగ్ అలర్ట్.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన..

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది.. ఈ క్రమంలోనే.. రేవంత్ సర్కార్.. కొత్తగా మంజూరైన వారికి రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నెల 14న తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ఈ …

Read More »

11 ఏండ్ల క్రితం ఇదే రోజు బీజేపీలో చేరా.. రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ సంచలన ప్రకటన..

రాజాసింగ్‌ రాజీనామాను అధిష్ఠానం ఆమోదించడంతో రాజాసింగ్‌ దారెటు అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే.. బీజేపీ అధిష్ఠానం తన రాజీనామా ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. 11 ఏళ్ల కిందట ఇదే రోజు బీజేపీలో చేరానని.. తనను నమ్మి మూడు సార్లు బీజేపీ టికెట్‌ ఇచ్చిందని రాజాసింగ్ చెప్పారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ రాజీనామాను బీజేపీ (భారతీయ జనతా పార్టీ) అధిష్ఠానం ఆమోదించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయంలో అలిగిన రాజాసింగ్‌ జూన్ 30న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ …

Read More »

ఆధ్యాత్మిక క్షేత్రం లాల్​దర్వాజా.. సింహవాహిని ఆలయ 117వ వార్షికోత్సవాలు..ఎప్పుడంటే.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ ఆషాడం బోనాలు. పట్నమంతా లష్కర్‌ బోనాల సందడి నెలకొంది. ఆషాడం బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని పాతబస్తీలోని అమ్మవారి ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలు, తీరు తీరు రంగులతో అందంగా అలంకరించారు. హైదరాబాద్‌ బోనాల్లో ప్రత్యేకమైనది పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారు. ఈ ఆలయం 117 వ వార్షికోత్సవాలు జులై 11నుండి ప్రారంభించారు. ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతి యాదవ్ ఉత్సవ …

Read More »

రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం..

రాజాసింగ్‌ రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించింది. BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై రాజాసింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్టీకి రాజీనామా ఇచ్చారు. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా లేఖను పంపగా.. రాజాసింగ్‌ రాజీనామాను జేపీ నడ్డా ఆమోదించారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఇటీవల జరిగిన BJP రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. …

Read More »

బెట్టింగ్ మాఫియాపై ఈడీ ఫోకస్.. ఈ సెలబ్రిటీలే నెక్స్ట్ టార్గెట్..?

బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో వారిలో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో ఈడీ టార్గెట్ ఏంటీ.? అన్నది ఉత్కంఠగా మారింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగడంతో సినీ సెలెబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్స్‌పై ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. తెలంగాణలో బెట్టింగ్ యాప్ బారిన పడి అమాయక ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుండగా పోలీసులు బెట్టింగ్ …

Read More »

రెండో విడత జీపీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టుల భర్తీకి మరోమారు రెవెన్యూశాఖ సమాయాత్తమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా రెండో విడతగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 10,954 జీపీవో పోస్టులను భర్తీ చేసింది. గతంలో వీఆర్‌ఏ, వీఆర్‌వో పోస్టులకు ఎంపికైన వారికి అవకాశం కల్పించింది. ఇందులో ఐదు వేల మంది దరఖాస్తు చేసుకోగా 3,550 మంది జీపీవోలుగా ఎంపియ్యారు. …

Read More »

జగన్మోహన్ రావు సహా ఐదుగురికి 12 రోజులు రిమాండ్… పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు

HCA అక్రమాల్లో అరెస్టైన అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ఐదుగురికి 12 రోజుల పాటు రిమాండ్ విధించింది మల్కాజ్‌గిరి కోర్టు. పోలీసుల రిమాండ్‌ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. 2024 మే కంటే ముందు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఘటనలకు సంబంధించి తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ 9న ఫిర్యాదు చేశారు. HCA ఎన్నికల్లో నిలబడటానికి జగన్మోహన్‌ రావు అక్రమ ప్రవేశం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా అధ్యక్షుడిగా గెలవడానికి నకిలీ పత్రాలు, …

Read More »

ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజు పెంపుకు CBITకి హైకోర్టు అనుమతి.. నేడు తుది తీర్పు!

2025-26 నుంచి 2027-28 వరకు బ్లాక్ పీరియడ్‌కు బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల ఫీజును పెంచుకునేందుకు చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) చేసిన అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. CBIT వసూలు చేసే ఫీజుల వివరాలు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని TG Eapcet అడ్మిషన్ల కన్వీనర్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఆదేశించారు. బీటెక్‌ కోర్సులకు ఏడాదికి రూ.2,23,000గా, MTech కోర్సుకు రు.1,51,600, MBA/MCA కోర్సుకు రు.1,40,000లకు పెంచేందుకు కోర్టు CBITని అనుమతించింది. పెరిగిన …

Read More »

తెలంగాణ నీట్‌ యూజీ 2025 ర్యాంకర్ల లిస్ట్‌ వచ్చేసింది.. ఫుల్‌ జాబితా ఇదే!

నీట్‌ యూజీ 2025 పరీక్షలో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 43,400 మంది అర్హత సాధించారు. ఈ మేరకు ఎంపిక జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. ఇది కేవలం నీట్‌లో అర్హత పొందిన అభ్యర్థుల వివరాలు తెలిపే జాబితా మాత్రమేనని, మెరిట్‌ జాబితా కాదని వర్సిటీ స్పష్టం చేసింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్‌ జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఎన్‌సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్, ఎస్‌సీసీఎల్‌ మెరిట్‌ జాబితాను విడిగా విడుదల చేస్తామని పేర్కొంది. …

Read More »

మోస్తరు వానలతో సరిపెడుతున్న వరుణుడు.. ఇప్పట్లో భారీ వర్షాలు లేనట్లే!

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో భారీ వర్షాల జాడ కనిపించడం లేదు. భారీ వర్షాల కోసం మరో రెండు వారాలు ఎదురుచూడాలని అంచనా వేసినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఉత్తరాదిన వర్షాలు ఊపేస్తుంటే.. దక్షిణాదిన మాత్రం బలమైన ఈదురుగాలులతో సరిపెట్టుకుంటుంది.. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఛత్తీస్గడ్, మీదుగా దక్షిణ జార్ఖండ్ ప్రాంతంలోని అల్పపీడనం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఉత్తర చత్తీస్గడ్ మీదుగా విదర్భ …

Read More »