తెలంగాణ

భారీగా పెరిగిన మెడికల్ కాలేజీలు.. ఏ రాష్ట్రంలో ఎన్ని MBBS సీట్లు ఉన్నాయంటే..?

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో వైద్య విద్యలో పెద్ద మార్పు వచ్చింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించింది. అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2014కి ముందు దేశంలో 387 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. 2014కి ముందు 51,348 సీట్లు ఉంటే ఇప్పుడు 1,18,137కి పెరిగింది. ఇది 130 శాతం పెరుగుదల. ఇప్పుడు 2024లో మెడికల్ కాలేజీల సంఖ్య 780కి పెరిగింది. ఇది 102 శాతం పెరుగుదల నమోదు చేసుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య …

Read More »

చౌక.. చౌక.. ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్ కనెక్షన్‌.. అతి తక్కువ ధరకు

గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనుంది తెలంగాణ సర్కార్. అది కూడా చౌక ధరకే. టీ-ఫైబర్ ఆధ్వర్యంలో దశలవారీగా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఇంటర్నెట్ అందించనున్నారు.ఇకపై తెలంగాణలో అత్యంత చౌకగా ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. టి ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ప్రభుత్వం 300 రూపాయలకే ఇవ్వనుంది. ఈ కనెక్షన్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న టీవీని కంప్యూటర్ మాదిరిగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా టీవీలోనే …

Read More »

రాములమ్మ రాజకీయ అడుగులు తడబడ్డాయా..? తప్పుకున్నారా..? ఎందుకీ మౌనం?

కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతికి పెద్దగా ప్రయారిటీ మాత్రం దక్కలేదు. పార్టీ నేతలు ఆమెను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవట.ఆమె యాక్టర్ కమ్ పొలిటిషియన్.. నాడు ఎన్నో హిట్ మూవీస్ చేశారు. ఆ తర్వాత పొలిటికల్‌గా రాణించారు. ఎందుకో ఆమె ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. అటు సినిమాల్లోనూ… ఇటు రాజకీయాల్లోనూ ఆమె సైలెంట్ అయ్యారు. దీంతో ఆమె రాజకీయ అడుగులు తడబడ్డాయా ? సినిమాల్లో సెకండ్ ఇన్సింగ్స్ కలిసిరావడం లేదా ? గాడ్ ఫాదర్స్ లేకపోవడంతోనే ఆమె స్ట్రగుల్స్ ఫేస్ …

Read More »

శరవేగంగా కుంభమేళా ఏర్పాట్లు.. మమతా బెనర్జీ నుంచి ఒమర్ అబ్దుల్లా వరకు ప్రతిపక్ష రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానం

హిందూ సంప్రదాయంలో నదులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు పుజిస్తారు. నదులకు పుష్కరాలు, కుంభమేళావంటి వేడుకలను నిర్వహిస్తారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభ మేళా జాతర ప్రయాగ్ రాజ్ లోని 2025 జనవరిలో ప్రారంభం కానుంది. త్రివేణీ సంగం ఒడ్డున జరిగే మహా కుంభ మేళాకు ప్రముఖులను ఆహ్వానించడానికి యోగి సర్కార్ సిద్ధం అవుతుంది. మహా కుంభ మేళా ప్రపంచంలోనే అతిపెద్ద హిందువు ఉత్సవం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ మేళా ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ప్రకటించింది. ఇది మహాకుంభమేళా జిల్లాగా …

Read More »

SDRF: తెలంగాణలో సిద్ధమైన సరికొత్త దళం.. విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం..!

తెలంగాణలో బలమైన సైన్యం రెడీ అయింది. విపత్తులు సంభవించినప్పుడు కేంద్రంపై ఆధారపడకుండా ఉండేందుకు కొత్త దళాన్ని సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యవసరంగా రక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో 2000 మందికి వేర్వేరు రాష్ట్రాల్లో శిక్షణ ఇప్పించి మెరికాల్లా మారింది. తెలంగాణలో సరికొత్త దళం సిద్ధమైంది. జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో తెలంగాణ విపత్తు స్పందన దళం సిద్ధమైంది. భారీ అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం సిద్ధమవుతోంది. తెలంగాణ అగ్నిమాపక …

Read More »

‘పీఎం-కిసాన్’ స్కీమ్.. అనర్హుల నుంచి రూ.335 కోట్ల రికవరీ చేసిన కేంద్రం

పీఎం-కిసాన్ కార్యక్రమం కింద నగదు ప్రయోజనాలను పొందిన అనర్హుల నుండి రూ. 335 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. PM-కిసాన్ కింద, అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 చొప్పున మద్దతును అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున మూడు సమాన నగదు బదిలీలలో రూ.2,000 చెల్లిస్తోంది. మొదటి వాయిదా చెల్లింపును ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించింది నరేంద్ర మోదీ సర్కార్. రైతులకు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. …

Read More »

ఇలా తయారు అయ్యారేంట్రా బాబూ..! సినిమా సీన్ తలపించే ఛేజింగ్.. చివరికి ఇలా !

ఓ వ్యక్తి ఆసుపత్రి వద్ద కాలికి గాయంతో ఉన్నాడు. అయితే ఆ ఆ వ్యక్తి తన ఊరికి వెళ్లాలనుకున్నాడు. అక్కడే ఉన్న ఓ అంబులెన్స్ వేసుకుని వెళ్లాడు. కానీ అనుకున్నట్టుగా అతను ఇంటికి చేరుకోలేదు. అంబులెన్స్‌తో పారిపోతున్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు సినిమా స్టైల్ చేజ్ చేయాల్సి వచ్చింది. సీన్ కట్ చేస్తే అంబులెన్స్‌తో కల్వర్టుకు ఢీ కొట్టి ప్రమాదానికి గురైయ్యాడు. అసలేం జరిగింది అంటే..? హయత్‌నగర్‌లో 108 వాహనాన్ని ఎత్తుకెళ్లాడో దొంగ. అంబులెన్స్‌తో విజయవాడ పరారయ్యేందుకు యత్నించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. …

Read More »

తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొడుకు.. వెతగ్గా

అమ్మానాన్నలు అంటే అందరికీ ఇష్టమే. కానీ కొందరు మాత్రం తల్లిదండ్రులతో విపరీతమైన బాండింగ్ కలిగి ఉంటారు. వారితో ఉన్న మమకారాన్ని కొందరు తెంచుకోలేరు. అలాంటి ఓ తనయుడు.. తండ్రి మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించాడు. ఓ వైపు తండ్రి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కాటం రాములుకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఉన్నంతలో వారిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. …

Read More »

సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేలా ఆర్బీఐ కీలక నిర్ణయం

టెక్నాలజీ యుగంలో సైబర్‌ నేరగాళ్ల బెడద రోజురోజుకీ పెరిగిపోతోంది. అమాయకులే లక్ష్యంగా సొమ్ములు కొల్లగొట్టి మోసాలకు పాల్పడటమే కాదు.. ఆ సొమ్మును ఫేక్‌ అకౌంట్లకు మళ్లిస్తున్నారు. ఆయా ఖాతాల నుంచి సొమ్మును తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ముఖ్యంగా నిరక్ష్యరాస్యులు, నిరుద్యోగులకు కమీషన్‌ ఆశ చూపి వారి పేరుతో ఖాతాలు తెరుస్తున్నారు. వీటినే మ్యూల్‌ అకౌంట్లు అంటారు. ఈ ఖాతాల్లోకి వెళ్లిన సొమ్మును గుర్తించడం, రికవరీ చేయడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మ్యూల్‌ ఖాతాల ఏరివేతే లక్ష్యంగా ఆర్‌బీఐ మ్యూల్‌ హంటర్‌ డాట్‌ ఏఐని …

Read More »

బ్యాంకుల లూటీ కేసులో వెలుగులోకి సంచలనాలు.. దొంగల ముఠా స్కెచ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

దేశవ్యాప్తంగా బ్యాంకులను టార్గెట్ చేసి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లాకర్లలోని బంగారం లూటీ చేస్తున్న ముఠా ఎట్టకేలకు పట్టుబడింది. వరంగల్ జిల్లా రాయపర్తిలోని SBI బ్రాంచ్‌లో 19 కేజీలకు పైగా బంగారం లూటీ చేసిన ఆ ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద దొంగిలించిన బంగారంలో కొంత రికవరీ చేసిన పోలీసులు దోపిడీలకు వాడుతున్న టెక్నాలజీని చూసి షాక్ అయ్యారు. గూగుల్ మ్యాప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకులను గుర్తించి దోచేస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం ప్రత్యేక …

Read More »