తెలంగాణ

దుమ్ము దుమారమే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. మొత్తం ఎన్ని రోజులంటే..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. కాళేశ్వరం రిపోర్ట్ ఆధారంగా బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడమే లక్ష్యంగా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది అధికార పార్టీ. కాళేశ్వరంపై ప్రభుత్వం కుట్రలను సభ సాక్షిగా తిప్పికొడతామంటోంది బీఆర్ఎస్‌. మరోవైపు కాంగ్రెస్‌ వైఫల్యాలను, బీఆర్ఎస్‌ అవినీతిని అసెంబ్లీలో కడిగేస్తామంటోంది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు అధికార విపక్షాలు అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకున్నాయి. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరిస్తామంటోంది …

Read More »

ఇక అన్ని స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు.. సీఎం రేవంత్‌ ఆదేశం

పాఠశాలల నుంచి వర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌.. విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పాఠశాలల నుంచి వర్సిటీల వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌లో విద్యాశాఖపై సమీక్ష …

Read More »

యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ ఆందోళన

తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్‌ ఆందోళనకు దిగింది. అసెంబ్లీ ముందు గన్‌పార్క్‌లో నినాదాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్, హరీష్‌రావు ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపగా.. మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ యూరియాపై ఆందోళన చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్‌పార్క్‌కు వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ నినాదాలు చేశారు. గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు …

Read More »

గణపతి విగ్రహంతో పాటు రూ.5 లక్షల విలువైన బంగారం నిమజ్జనం.. కట్ చేస్తే..

హైదరాబాద్ శివారులో వినాయక నిమజ్జనం సందర్భంగా గిరిజ కుటుంబం ఐదు తులాల బంగారాన్ని విగ్రహంతో పాటు చెరువులో నిమజ్జనం చేయడంతో కలకలం రేగింది. నిమజ్జనం తర్వాత వారికి బంగారం విషయం గుర్తుకువచ్చింది..? ఆ తర్వాత వారు ఏం చేశారు..? బంగారం తిరిగి వారి చేతుల్లోకి వచ్చిందా..? తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు వినాయక నవరాత్రి సందడితో కళకళలాడిపోతున్నాయి. ఊరూరా మండపాలు వెలసి.. గణపతి బప్పా మోరియా నినాదాలతో మారుమోగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కూడా ప్రారంభమయ్యాయి. కాగా హైదరాబాద్‌ శివారులోని తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని …

Read More »

మండపాల్లో వివిధ రూపాల్లో గణపయ్య.. ఆకట్టుకున్న ఆపరేషన్ సిందూర్, ఆపిల్, టెంకాయ గణేశ విగ్రహాలు..

దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంటిలో మాత్రమే కాదు వీధి వీధిలో గణపయ్య అత్యంత భక్తిశ్రద్దలతో పూజలను అందుకుంటున్నాడు. డిల్లీ నుంచి గల్లీ వరకూ ఏర్పాటు చేసిన గణపతి మండపాలలో రకరకాల రూపాల్లో గణపయ్య కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. రకరకాల వినాయక విగ్రహాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆపిల్ పండ్లతో చేసిన పెద్ద వినాయక విగ్రహం, ఆపరేషన్ సిందూర్ నేపధ్య గణపతి ఇలా అనేక రకాల విగ్రహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. …

Read More »

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ సహా ఆ రాష్ట్రాల్లో ఆగస్ట్‌ 30న పాఠశాలలు బంద్‌.. వరుసగా 2 రోజులు సెలవులు

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్ట్ 30న పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ కళాశాలలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని జిల్లా విద్యా అధికారిని ఆదేశించారు కలెక్టర్లు. విద్యా సంస్థలకు ఆగస్ట్‌ నెలలో చాలా సెలవులు వచ్చాయి. ఇక దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వర్షాలతో పాఠశాలలకు సెలవులు …

Read More »

జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అన్ని పరీక్షలు వాయిదా..! కారణం ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయాయి. అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో ఇరుక్కుపోయాయి. అడుగుతీసి బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే …

Read More »

మార్వాడీ గో బ్యాక్‌ ప్రచారంపై స్పందించిన అసదుద్దీన్‌ ఒవైసీ! ఏమన్నారంటే..?

తెలంగాణలోని ‘మార్వాడీ గో బ్యాక్’ ప్రచారంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ప్రచారానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక వ్యాపారులు, కొన్ని సంఘాలు ఈ ప్రచారానికి మద్దతు ఇస్తున్నాయి. సమస్యలను పరిష్కరించేందుకు సంయమనం అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ‘మార్వాడీ గో బ్యాక్‌’ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. కొన్ని సంఘాలు ఈ ప్రచారం జోరుగా చేస్తున్నాయి. తెలంగాణలో ఆర్థిక దోపిడీకి మార్వాడీలో కారణం అవుతున్నారని, గుజరాత్‌కు చెందిన వాళ్లు తెలంగాణలో వ్యాపారాలను శాసిస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. …

Read More »

తెలుగు రాష్ట్రాల గ్రామీణ నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్‌ ట్రస్ట్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ.. ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్‌ ట్రస్ట్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, …

Read More »

నార్కోటిక్స్‌ కేసు.. మహీంద్రా యూనివర్సిటీ కీలక ప్రకటన!

కొంతమంది విద్యార్థులపై నమోదైన నార్కోటిక్స్ కేసుపై వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజుల మేడూరి స్పందించారు. విశ్వవిద్యాలయం జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కఠిన శిక్షలు విధిస్తారని ప్రకటించారు. పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నామని, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్‌ వాడుతున్నారని నమోదైన నార్కోటిక్స్‌ కేసుపై మహీంద్రా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ యాజుల మేడూరి స్పందించారు. దీనికి సంబందించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహీంద్రా యూనివర్సిటీలో తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం …

Read More »