తెలంగాణ

తెలంగాణ నెల ఆదాయం ఎంత..? అప్పులకు ఎంత వడ్డీ కడుతున్నారు..?

తెలంగాణలో ఆదాయ-వ్యయాలు ఎలా ఉన్నాయి. నెలవారీ వస్తున్న వసూళ్లెంత?. ఖర్చవుతుంది ఎంత?. అభివృద్ధి, సంక్షేమానికి నిధుల కొరత ఉందా అంటే.. అవుననే సమాధానం వస్తుంది. నెలవారీ ఆదాయం మరో 4వేల కోట్లు పెరిగితే తప్ప.. ఆర్థిక పరిస్థితి మెరుగు పడదు అంటున్నారు సీఎం. మరి.. ఆ 4వేల కోట్ల ఆదాయం పెరిగేందుకు ఏం చేయబోతున్నారు?. ఎలా ఖజానా నింపబోతున్నారు..?తెలంగాణ ఆర్థిక కష్టాలను క్లియర్‌ కట్‌గా బయటపెట్టారు సీఎం రేవంత్. నెలవారీ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం ఎంత, దేనికి ఎంత ఖర్చవుతుంది?.. అభివృద్ధి, సంక్షేమానికి నిధులపై …

Read More »

హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళి అరెస్ట్.. ఏపీకి తరలింపు.!

ఏపీలో మరో పొలిటికల్ వికెట్ పడింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. పోసాని అరెస్ట్‌తో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి నిన్న రాత్రి నోటీసులు ఇచ్చారు. పోసానిని అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. పోసాని …

Read More »

ప్రధాని నోట ఆదివాసీ మాట.. దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న ఆదిలాబాద్ పేరు..!

భారతదేశంలో AI ప్రాధాన్యత పెరుగుతుందని.. మారుమూల గిరిజన గ్రామాల్లోను ఏఐని వినియోగిస్తున్నారని.. అందుకు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉపాధ్యాయుడు తొడసం కైలాసే నిదర్శనమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తొడసం కైలాస్.. అడవుల జిల్లా ఆదిలాబాద్, మావల మండలం వాఘాపూర్, గ్రామానికి చెందిన గోండి (భాష) రచయిత.ఆదిలాబాద్ జిల్లా పేరు మరోసారి దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఓ ఆదివాసీ ఉపాధ్యాయుడి చేసిన కృషిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంతో ఆదిలాబాద్ జిల్లా ఆనందంలో మునిగితేలుతోంది. తమ భాష యాసను బ్రతికించుకునేందుకు ఆదివాసీ ఉపాధ్యాయుడు …

Read More »

పదో తరగతి మెమోలను ఎట్లా ముద్రిచాలో.. గ్రేడింగా? మార్కులా? విద్యాశాఖ తర్జనభర్జన

తెలంగాణ పదో తరగతి మార్కుల మెమోలను ఎట్లా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తెగ ఆలోచిస్తుంది. పదో తరగతిలో గ్రేడింగ్‌ విధానం ఎత్తివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విద్యాశాఖ.. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అందించే మెమోలను మార్కులా? లేదా గ్రేడింగా? ఎలా ముద్రించాలన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఏ పద్ధతిలో ముద్రించాలన్న అంశంపై తర్జనభర్జన పడుతుంది..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు …

Read More »

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఒంటి పూట బడులు ఎప్పటినుంచంటే..?

హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బ సోకే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగుతన్న ఎండల నేపథ్యంలో పిల్లలకు ఒంటి పూట నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యకమవుతుంది.తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పొద్దున 10 దాటగానే సూర్యుడు యాక్షన్‌లోకి దిగిపోతున్నాడు. మార్చి కూడా రాకుండానే ఎండల తీవ్రత ఓ రేంజ్‌లో పెరిగింది. దీంతో రోడ్ల వెంట బండ్లు పెట్టుకుని చిన్న.. చిన్న వ్యాపారాలు చేసేవారు అల్లాడిపోతున్నారు. ఇక బళ్లకు వెళ్లే …

Read More »

దూరం నుంచి మెరుస్తూ కనిపించాయ్.. ఏంటా అని దగ్గరిగా వెళ్లి చూడగా..

11వ శతాబ్దంలో ప్రస్తుత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన కళ్యాణి చాళుక్య యువరాణి అక్కాదేవికి చెందిన రెండు బంగారు నాణేలు తెలంగాణ రాష్ట్రంలో లభించాయి. దీనిని అరుదైన ఆవిష్కరణగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నాణేలు తెలంగాణలోని మాడుగుల గ్రామం సమీపంలో లభించాయి. వాటిపై కన్నడ భాషలో 11వ శతాబ్దపు అక్షరాలతో కూడిన శాసనాలు ఉన్నాయి.కళ్యాణి చాళుక్య యువరాణి అక్కాదేవికి చెందిన రెండు బంగారు నాణేలు తెలంగాణలో తొలిసారిగా లభించాయని భారత పురావస్తు సర్వే (ASI) తెలిపింది. ఈ నాణేలు మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల …

Read More »

 మందు బాబుల‌కు బ్యాడ్ న్యూస్.. 3 రోజులు మ‌ద్యం షాపులు బంద్!

రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యుల (MLC) ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 25న ఉదయం 6:00 గంటల నుండి ఫిబ్రవరి 27న ఉదయం 6:00 గంటల వరకు వైన్ షాపులు బంద్‌ అవుతాయి..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మందు బాబుల‌కు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా 3 రోజుల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వ‌ర‌కు మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయ‌నున్నట్లు ఎక్సైజ్ …

Read More »

పెళ్ళికొడుకు అలంకారం లో ముస్తాబైన పరమశివుడు… మహాశివరాత్రికి మూడు రోజుల ముందే కళ్యాణ మహోత్సవం…

23 వ తేదీ ఆదివారం మాఘ బహుళ దశమి ముహూర్తాన ఉదయం 11 గంటలకు శ్రీ భవాని సహిత సిద్దేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు.. ఈ నేపద్యంలో ఆలయాన్ని కళ్యాణ వేడుకకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. కల్యాణ మహోత్సవానికి ముందు ఆనవాయితీ ప్రకారం సిద్దేశ్వరన్నీ పెళ్లి కొడుకులా ముస్తాబు చేశారు.. స్వయంభు సిద్దేశ్వరస్వామి లింగం వద్ద స్వామి వారినీ అచ్చం పెళ్ళి కొడుకులా ముస్తాబు చేసిన అలంకరణ ను చూసి భక్తులు మురిసి పోతున్నారు..దక్షిణ కాశీగా పేరుగాంచిన వరంగల్ లోని శ్రీ స్వయంభు …

Read More »

ఆ నగరానికి ఏమైందీ? వారానికో హత్య.. ఆరు నెలల్లో మొత్తం 24 ఖూనీలు..!

గత రెండు మూడు నెలలుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హత్యలన్నీ ఆ నగరంలోనే జరిగాయి కాబట్టి. అందునా.. తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్‌ తరువాత అతిపెద్ద నగరం అది. ఆ సిటీ పేరు.. ఓరుగల్లు. హైదరాబాద్-సికింద్రాబాద్‌ జంటనగరాలైతే.. వరంగల్-హన్మకొండ-కాజీపేట్ ట్రైసిటీ. తెలంగాణకు అన్‌అఫీషియల్‌ క్యాపిటల్‌గా చూస్తుంటారు ఈ ఏకశిలానగరాన్ని.తెలుగు రాష్ట్రాల్లో హత్యాకాండ సిరీస్‌ నడుస్తోందా అనే అనుమానం వస్తోంది ఈ వరుస ఘటనలు చూసి  వరుస హత్యలు, హత్యాయత్నాలు చెరగని రక్తపు మరకలు పడేలా చేస్తున్నాయి. ఓరుగల్లులో బరితెగిస్తున్న దుండగులు నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నారు. కత్తులు …

Read More »

కన్యాదానం తంతు ముగియగానే.. పెళ్లి కుమార్తె తండ్రికి గుండెపోటు.. ఆస్పత్రికి తీసుకెళ్లగా

చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు… నిండుగుండెలు నిలువునా ఎండిపోతున్నాయి. ఉన్నపళంగా ఊపిరి ఆగిపోతోంది… ఇక్కడ అంబులెన్సుల్లేవ్… హాస్పిటల్‌ ట్రీట్‌మెంట్లూ లేవు. కళ్ల ముందే జీవితాలు ఆవిరైపోతుంటే కళ్లు తేలేస్తున్నాం… తప్ప ఏమీ చెయ్యలేని అచేతనావస్థ మనది. తాజాగా తెలంగాణలో మళ్లీ అలాంటి కేసు వెలుగుచూసింది.పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. ఎలాంటి సమస్యలు లేకపోయినా.. మనిషి ప్రాణాలు క్షణాల్లో ఆవిరైపోతున్నాయి. అప్పటి వరకూ ఎంతో యాక్టివ్‌గా ఉన్నా అంతలోనే కుప్పకూలిపోతున్నారు. హార్ట్.. స్ట్రోక్.. ఈ పేరు వింటేనే.. గుండె వేగం పెరిగితోంది. రక్తం చిక్కబడినా.. రక్తం గడ్డకట్టినా.. గుండె ఆగిపోయినట్టే. …

Read More »