తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలల్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు!

తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఫోకస్‌ పెట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిఏ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉప్పల్ ఆర్టిఏ కార్యాలయంతో పాటు తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ప్రధానంగా ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి బ్రోకర్ల చేతివాటం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సహకారం వంటి అంశాలపై ఏసీబీ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. గతంలోనూ మే 28న ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న …

Read More »

వారంలో రెండుసార్లు విజిట్.. వారికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని అనేక సార్లు ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగానే.. విద్యాశాఖ‌పై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో స‌మీక్ష నిర్వహించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా.. తెలంగాణ‌లో విద్యా వ్యవ‌స్థను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని అధికారులను ఆదేశించారు. అద‌న‌పు క‌లెక్టర్లు వారంలో క‌నీసం రెండు సార్లు ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాల‌ల నుంచి ప్రభుత్వ పాఠ‌శాలల్లో 48 వేల మంది చేరార‌ని అధికారులు సీఎం …

Read More »

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

తెలంగాణ పాలిసెట్‌ 2025 తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్దులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడానికి విండో ఓపెన్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 59 ప్రభుత్వ, 57 ప్రైవేట్‌ కాలేజీల్లో మొత్తం 29,263 డిప్లొమా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే పాలిటెక్నిక్‌లో 100 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కిందే భర్తీ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలో 6,703 సీట్లు, ఈఈఈలో 5,850 సీట్లు, ఈసీఈలో …

Read More »

కోరిన కోర్కెలు తీర్చే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు భాగ్య నగరంలోని బోనాల సందడి మొదలవుతుంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళికి తోలి బోనం సమర్పిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కూడా బోనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బోనాల సందర్భంగా ఇక్కడ కొలువైన అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో మహిళలు చేరుకుంటారు. ఈ పురాతన ఆలయంలో ఏ దేవతను పూజిస్తారు? ఈ ఆలయంతో సంబంధం వెనుక ఉన్న నమ్మకం ఏమిటో తెలుసుకుందాం. ఏ దేవతని పూజిస్తారంటే.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ప్రధానంగా ఆదిశక్తి …

Read More »

బనకచర్ల ప్రాజెక్ట్‌పై ముదురుతున్న రాజకీయం.. మళ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్!

తెలంగాణలో బనకచర్లపై పొలిటికల్ ఫైట్ ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ పీక్స్‌కు చేరుకుంది. రేవంత్ సర్కార్ వైఫల్యం వల్లే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోందని బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. తాము ఈ అంశాన్ని లేవనెత్తే వరకు అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని కారు పార్టీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం సంకేతాలు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మరింతగా తప్పుబడుతోంది. …

Read More »

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులపాటు పిడుగులతో భారీ వర్షాలు!

వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో పాటుగా మరోక ద్రోణి కూడా విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ …

Read More »

పీజీసెట్‌లో 93.55 శాతం ఉత్తీర్ణత.. ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్యాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి …

Read More »

పాస్ పోర్ట్ ధ్రువీకరణలో దేశంలోనే టాప్‌.. రికార్డ్‌ క్రియేట్‌ చేసిన తెలంగాణ పోలీసులు!

పాస్ పోర్ట్ అప్లికేషన్ వేరిఫికేషన్‌లో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచారు. రాష్ట్ర పోలీసులు రూపొందించిన వెరీ ఫాస్ట్ యాప్‌కు బెస్ట్ సర్వీస్ అవార్డు దక్కింది. మంగళవారం పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా చేతుల మీదుగా ఉత్తమ సేవా ధ్రువీకరణ పత్రాన్ని ఇంటలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి అందుకున్నారు.తెలంగాణ పోలీసులను వరుస అవార్డులు వరిస్తున్నాయి. ఇటీవలే జాతీయ స్థాయిలో అత్యుత్తమ పోలీసింగ్‌ నిర్వహిస్తున్న కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర …

Read More »

రోజులు మారాయి గురూ.. ఆ స్కూల్‌లలో దర్శనమిస్తున్న నో అడ్మిషన్ బోర్డ్స్‌!

ప్రభుత్వ స్కూల్స్‌ అనగానే.. ఏ అక్కడ క్వాలిటీ స్టడీ ఉండదు.. ఎందుకు అక్కడ చేర్చడం అని అనుకునే వారు ఇప్పుడు తమ మైండ్‌ సెట్‌ను మార్చుకోవాల్సిందే అంటున్నారు అధికారులు. ఎందుకంటే ఇప్పుడు ఆరోజులు మారాయి.. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ చొరవ, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి, పదో తరగతిలో విద్యార్థులు సాధిస్తున్న ఉత్తమ ఫలితాలే ఇందుకు నిదర్శనం.ఎటువంటి ఫీజు తీసుకోకుండా విద్య.. పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్, మధ్యాహ్న భోజనం వంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా.. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్‌లకు పంపేవారు కాదు. …

Read More »

హైదరాబాదీస్ బీ అటెన్షన్.. టోల్‌తో పన్లేదు.! ఇక ఓఆర్ఆర్‌పై గాల్లో దూసుకెళ్లడమే..

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. ఆ పద్మవ్యూహం నుంచి బయటపడటానికి వాహనదారులు ఓఆర్ఆర్‌పై ప్రయాణం చేస్తుంటారు. ఓఆర్ఆర్‌పై ప్రయాణం కొంతదూరం ఎక్కువగా ఉన్నప్పటికీ.. దానిపైనే ప్రయాణానికి మొగ్గు చూపిస్తుంటారు. ఓఆర్ఆర్‌పై ప్రయాణం చేస్తున్న వాహనారులకు కూడా ఆలస్యం కాకుండా ఉండేందుకు.. ఇప్పుడు టోల్ ప్లాజాల వద్ద బూస్టర్ లేన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫాస్ట్ స్టాగ్‌ను సెకన్లలో రీడింగ్ చేసే సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఈ లేన్లలో ఏర్పాటు చేశారు. దాంతో ఈ లేన్‌లో వాహనాలు ఆగే పరిస్థితి ఉండదు. బారికేడ్లు తెరిచి ఉండగానే.. …

Read More »